BigTV English
Advertisement

Lady oriented Movies : టాప్ 5 లేడీ ఓరియెంటెడ్ మూవీస్… మీ ఫేవరెట్ సినిమా ఉందా ?

Lady oriented Movies : టాప్ 5 లేడీ ఓరియెంటెడ్ మూవీస్… మీ ఫేవరెట్ సినిమా ఉందా ?

Lady oriented Movies : రీసెంట్‌గా ఫీమేల్ సూపర్ హీరో సినిమా ‘లోకా: చాప్టర్ 1 చంద్ర’ రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర 200 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్ అయ్యింది. కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ మలయాళ సినిమాను దుల్కర్ సల్మాన్ తన సొంత బ్యానర్‌లో ప్రొడ్యూస్ చేశాడు. ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమాకు ఇంత భారీ కలెక్షన్లు వస్తాయని ఎవరూ ఊహించలేదు. మన దగ్గర ఇది ఒక రికార్డ్. అయితే హాలీవుడ్‌లో మాత్రం చాలా ఏళ్లుగా ఫీమేల్ సూపర్ హీరో సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు వాటిలో కలెక్షన్స్ పరంగా టాప్ 5 సినిమాలను చూద్దాం.


1. కెప్టెన్ మర్వెల్

2019లో వచ్చిన మార్వెల్ యూనివర్స్ సినిమా కెప్టెన్ మర్వెల్ మొదటి స్థానంలో ఉంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) లో కెప్టెన్ మర్వెల్ పాత్ర ఆధారంగా వచ్చిన ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర 1.1 బిలియన్ డాలర్లు (9,700 కోట్ల రూపాయలు) కలెక్ట్ చేసింది. స్టోరీలైన్, ప్రధాన పాత్రల నటన, అద్భుతమైన యాక్షన్ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అవెంజర్స్: ఎండ్ గేమ్ రిలీజ్ కి ముందు రావడంతో ఈ సినిమా క్రేజ్ మరింత పెరిగి భారీ ఓపెనింగ్స్ సాధించింది.

2. బ్లాక్ పాంథర్: వాకండా ఫరెవర్

2022లో విడుదలైన బ్లాక్ పాంథర్: వాకండా ఫరెవర్ రెండో స్థానంలో నిలిచింది. ర్యాన్ కూగ్లర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర 859 మిలియన్ డాలర్లు (7,577 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. వాకండా రాజు టి’చల్ల మరణం తరువాత అతని చెల్లెలు షురి రాజ్యాన్ని రక్షించడానికి చేసిన పోరాటం ఈ సినిమాలో చూపించారు. షురి పాత్ర, ఎమోషనల్ సీక్వెన్సులు, క్యారెక్టర్ రైటింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.


3. వండర్ వుమన్

మూడో స్థానంలో డిసీ యూనివర్స్ లో వచ్చిన వండర్ వుమన్ ఉంది. గాల్ గాడోట్, క్రిస్ పైన్ నటించిన ఈ సినిమాను పాటీ జెంకిన్స్ దర్శకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా 824 మిలియన్ డాలర్లు (7,269 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. అపారమైన శక్తులు కలిగిన వండర్ వుమన్ ఒక రాక్షసుడి నుండి ప్రపంచాన్ని ఎలా కాపాడిందన్నదే సినిమా కథ. గాల్ గాడోట్ నటన, యాక్షన్ సీన్లు సినిమాలో హైలైట్స్‌గా నిలిచాయి.

4. బ్లాక్ విడో

2021లో వచ్చిన బ్లాక్ విడో నాలుగో స్థానంలో ఉంది. ఇతర ఫీమేల్ సూపర్ హీరోల లాగా బలమైన శక్తులు లేకపోయినా, తన మానసిక ధైర్యం, ఫైటింగ్ స్కిల్స్‌తో బతుకుతున్న బ్లాక్ విడో పాత్ర ప్రేక్షకులకు దగ్గరగా అనిపిస్తుంది. స్కార్లెట్ జోహాన్సన్ నటించిన ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర 379 మిలియన్ డాలర్లు (3,343 కోట్ల రూపాయలు) కలెక్ట్ చేసింది.

5. ది మార్వెల్స్

ఐదో స్థానంలో కెప్టెన్ మర్వెల్ సీక్వెల్ అయిన ది మార్వెల్స్ ఉంది. ఈ సినిమా ఊహించినంత స్థాయిలో విజయం సాధించకపోయినా ప్రపంచవ్యాప్తంగా 206 మిలియన్ డాలర్లు (1,817 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. అయితే, 350 మిలియన్ డాలర్ల (3,087 కోట్ల రూపాయలు) భారీ బడ్జెట్ కారణంగా ఇది ఫ్లాప్‌గా నిలిచింది.

ఇవి టాప్ 5 హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫీమేల్ సూపర్ హీరో సినిమాలు. ఇప్పుడు మన దేశంలో లోకా సినిమాకే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. దీని తర్వాత భవిష్యత్తులో మరిన్ని ఫీమేల్ సెంట్రిక్ సూపర్ హీరో సినిమాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి.

Related News

Vyjayanthi Movies: రైట్స్ అన్ని లోకల్ వాళ్లకే… అందరూ ఈ నిర్మాతల ఉండాలి

Mass jathara: మాస్ జాతర కలెక్షన్స్.. మరీ ఇంత దారుణం అయితే ఎలా బాసూ!

Bahubali The Epic Collections : ‘బాహుబలి ది ఎపిక్’ కలెక్షన్ల కోత..రెండు రోజులకు ఎన్ని కొట్లంటే..?

Prashanth Varma: ప్రశాంత్ వర్మ 100 కోట్లు ఇవ్వాలి… ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాత కంప్లైంట్

Dragon NTR Look Leak : డ్రాగన్ మూవీ నుంచి ఎన్టీఆర్ లుక్ లీక్.. ఏమున్నాడురా హీరో..

Star Heros : భార్యలకు విడాకులు ఇచ్చిన టాలీవుడ్ హీరోలు.. హీరోయిన్స్ తో ఎఫైర్స్..?

Prasanth Varma : నిర్మాతలతో హనుమాన్ డైరెక్టర్ గొడవలు.. ‘జై హనుమాన్’ ఇప్పట్లో రాదా..?

Geethika : బికినీలో అందాలతో కుర్రాళ్ళను ఉడికిస్తున్న అహింస హీరోయిన్.. బాపురే కష్టమే..

Big Stories

×