BigTV English

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Kakinada: కాకినాడ రూరల్ నియోజకవర్గంలో టిడిపి అధిష్టానం ప్రస్తుత నాయకులను లైట్ తీసుకుందా? కాకినాడ రూరల్‌లో టీడీపీ నాయకుల పై పార్టీ అధిష్టానానికి నమ్మకం లేదా.. టీడీపీ పార్టీని సంస్థాగతంగా నడిపించే నాయకుడు రూరల్ సెగ్మెంట్‌లో కరువైనా టిడిపి అధిష్టానం లైట్ తీసుకుంటుందా?.. పిల్లి సత్యనారాయణ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసినా హైకమాండ్ ఎందుకు పట్టించుకోవడం లేదు? కటకం శెట్టి బాబి మరోవైపు ఇంచార్జ్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. టిడిపి అధిష్టానం ఆయన విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోనుంది?


ముందు నుంచి టీడీపీకి గట్టి పట్టున్న కాకినాడ రూరల్ సెగ్మెంట్

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలలో టీడీపీ పార్టీకి రాజకీయంగా కీలకంగా ఉండే నియోజకవర్గం కాకినాడ రూరల్. ముందు నుంచి తెలుగుదేశం పార్టీకి అక్కడ గట్టి క్యాడర్ ఉంది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయం నుండి పార్టీ పై అభిమానంతో ఎంతో మంది నాయకులు కార్యకర్తలు టిడిపి వెన్నంటి ఉండి పార్టీలో కీలక పాత్ర పోషించేవారు . శెట్టి బలిజ సామాజికవర్గ ఓటర్ లు అత్యధికంగా ఉన్న కాకినాడ రూరల్ నియోజకవరం..టిడిపి నుండి గెలుపొందిన నాయకుల మెజారిటీ విషయంలోను పార్టీకి శాశ్వతమైన ఓటర్లుగా శెట్టిబలిజి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు నిలుస్తూ వచ్చారు.


రూరల్‌ను జనసేనకు కేటాయించడంతో తమ్ముళ్లలో గందరగోళం

2024 ఎనికల్లో కూటమిలో తెలుగుదేశం, జనసేన,బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేసిన నేపద్యంలో కాకినాడ రూరల్ అసెంబ్లీ స్థానం జనసేన పార్టీకి కేటాయించారు. అప్పుడేటిడిపి పార్టీ పరిస్థితి ఏంటి అని నాయకులు, కార్యకర్తల్లో సందేహాలు ఉత్పన్నం అయ్యాయి. అయితే టిడిపికో ఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి, మాజీ శాసనసభ్యురాలు పిల్లి అనంతలక్ష్మి లు నాయకులు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి, క్షేత్ర స్థాయిలో కూటమి అభ్యర్థికి సహకారం అందించి , చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయడంలో కీలక పాత్ర పోషించాలని సముదాయించారు. నాయకులు కార్యకర్తలకు ఏ పని కావాలన్న చేస్తామని క్యాడర్ ను బుజ్జగించారు.

పిల్లి సత్యనారాయణమూర్తి రాజీనామాపై స్పందించని అధిష్టానం

అయితే కూటమి ప్రభుత్వం పాలన చేపట్టి 16 నెలలు పూర్తి కావస్తున్నా కాకినాడ రూరల్ నియోజకవర్గం పై తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టిసారించడం లేదని తెలుగుతమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పిల్లి సత్యనారాయణమూర్తి రాజీనామా చేసి నెలలు గడుస్తున్నా నియోజకవర్గానికి ఇంచార్జి ను నియమించకపోవటం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు చేస్తుందని వాపోతున్నారు. కూటమి అభ్యర్థిగా విజయం సాధించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ టిడిపి నేతలను పట్టించుకోవడం లేదని, క్యాడర్కు ఏ పని చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసి కో ఆర్డినేటర్ గా ఉన్న పిల్లి సత్తిబాబు పార్టీ పదవికి రాజీనామా చేశారు.

వర్మను రూరల్‌కు పంపించిన చంద్రబాబు

నాటకీయ పరిణామాల మధ్య రాజీనామా చేసిన పిల్లి సత్తిబాబు తో పిఠాపురం టిడిపి ఇంచార్జి ఎస్.వి.ఎస్. ఎన్ వర్మను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంపించారు. సత్తిబాబు ఎనికల్లో చేసిన కృషికి తగిన గౌరవం పార్టీ కల్పిస్తుందని వర్మ భరోసా కల్పించారు. పిల్లి సత్తిబాబు రాజీనామా ను పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకోలేదు. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ పై టిడిపి క్యాడర్లో రోజురోజుకు సంతృప్తి పెరుగుతుందట. ఈ ప్రభావం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అయ్యే ప్రమాదముందని కిందిస్థాయి క్యాడర్ అంటోంది. కూటమి అభ్యర్థిగా పంతం నానాజీ గెలుపుకు కృషి చేసిన టిడిపి క్యాడర్ ఎవరు ఏ పని కావాలని వెళ్లినా పంతం నానాజీ చేయడం లేదంట. ఎన్నికల్లో సమిష్టిగా విజయానికి కృషి చేస్తే టిడిపి నాయకులను ఇప్పుడు ఇలా అవమానిస్తారా అని లోలోపల మల్లగులల్లు పడుతున్నారట.

నానాజీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న టీడీపీ నేత బాబీ

కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వర్గాలుగా విడిపోవటం స్థానిక శాసనభ్యులు పంతం నానాజీ కలిసి వచ్చిందనే టాక్ నియోజకవర్గంలో ఉంది. టీడీపీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలలో ఒక వర్గానికి చెందిన కటకంశెట్టి బాబీని పంతం నానాజీ కలుపుకుని పోతున్నారు. పంతం నానాజీ కార్యక్రమాల్లో టీడీపీ నేత బాబీ చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీ అధిష్టానం కూడా తనకు మద్దతుగా ఉందని బాబీ ప్రచారం చేసుకోవటంతో పార్టీ కింద స్థాయి నాయకులు కార్యకర్తలు అయోమయంలో ఉన్నారట. పంతం నానాజీ, కటకం శెట్టి బాబి ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారని శెట్టిబలిజ సామాజిక వర్గాన్ని నియోజకవర్గంలో అణిచివేయాలని చూస్తున్నారని టిడిపి బీసీ నాయకులలో, శెట్టిబలిజలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందట.

ఎవరి వెంట నడవాలో తెలియక తమ్ముళ్లలో గందరగోళం

రూరల్ నియోజకవర్గంలో అసలు ఎవరు నాయకుడు? ఎవరు వెనక క్యాడర్ ఉండాలనే ప్రశ్నలు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఒక ప్రశ్నగా మిగిలిపోయిందట. పార్టీ అంతర్గత విభేదాలను పరిష్కరించడంలో పార్టీ అధిష్టానం ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందనే అసంతృప్తి క్యాడర్‌లో వ్యక్తమవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే పార్టీలో ఇమడలేక బయటకు వెళ్ళిపోవడానికి సిద్ధపడే పరిస్థితిని పార్టీ అధిష్టానమే కల్పిస్తుందని అంటున్నారు మరి కొంతమంది నాయకులు. 2026 జనవరి నెలలో ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికలు నిర్వహణకు కసరత్తు చేస్తుండటంతో పార్టీ క్యాడర్‌లో తమ ఉనికి కాపాడుకోవడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నారట నాయకులు. అసెంబ్లీ ఎనికల్లో కూటమి పార్టీ అభ్యర్థికి విజయానికి కృషి చేసినట్లు పంచాయతీ ఎనికల్లో చేయలేము అని బాహాటంగానే చెబుతున్నారట టిడిపి క్యాడర్. ఏది ఏమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ఈ సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారాన్ని చూపించాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు.

Also Read: హైదరాబాద్‌లో శృతి మించుతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు

తెలుగుదేశం పార్టీకి మొన్నమొన్నటి వరకు కంచుకోటగా ఉన్న కాకినాడ రూరల్ నియోజకవర్గం లో తిరిగి పట్టు సాధించి పార్టీ క్యాడర్ చెదిరిపోకుండా కార్యాచరణ చేపట్టాలని తమ్ముళ్లు ఆశిస్తున్నారు. గ్రామ స్థాయిలో పార్టీని పునః నిర్మించి, పార్టీని నమ్ముకుని ఉన్న క్యాడర్ కు తగిన న్యాయం చేయాలని తెలుగుదేశంపార్టీ వీరాభిమానులు కోరుకుంటున్నారు. మరి టీడీపీ హైకమాండ్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Story By Rami Reddy, Bigtv

Related News

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Kakani Govardhan Reddy: జైలు జీవితం కాకాణిని మార్చేసిందా?

American Gun Culture: హద్దులు దాటుతున్న అమెరికా గన్ కల్చర్.. ట్రంప్ ఫ్రెండ్ చార్లీ కిర్క్ పై గన్ ఫైర్ దేనికి సంకేతం?

Telangana BJP: నూతన రాష్ట్ర కమిటీని ప్రకటించిన బీజేపీ

Anantapur Politics: అనంతపురం జిల్లా టీడీపీ కొత్త అధ్యక్షుడు ఎవరంటే..!

Drinking Water Project: ఒక్క ప్రాజెక్ట్‌తో హైదరాబాద్‌కు తాగునీటికి నో ఢోకా.. ఎలా అంటే..!

AP Liquor Scam: వైసీపీలో గుబులు.. లిక్కర్ స్కాంలో నెక్స్ట్ అరెస్ట్ ఎవరు?

Big Stories

×