E-Paper
Advertisement

బతుకమ్మ కుంటకు జీవం పోసిన సీఎం.. సిటీ జనం చిరస్థాయిగా రేవంత్‌ను గుర్తు పెట్టుకునేలా! ఆంక్షలు చేధించుకుని మరీ ఈసారి ఘనంగా సద్దుల బతుకమ్మ!

బతుకమ్మ కుంటకు జీవం పోసిన సీఎం.. సిటీ జనం చిరస్థాయిగా రేవంత్‌ను గుర్తు పెట్టుకునేలా! ఆంక్షలు చేధించుకుని మరీ ఈసారి ఘనంగా సద్దుల బతుకమ్మ!
Advertisement

హైడ్రా చేసిన మంచి పనుల్లో చెప్పుకోదగ్గ పేరు బతుకమ్మ కుంట. చెరువుల పునరుద్దరణల్లో జీవం పొందిన నీటి తటాకాల  లిస్టులో ఉన్న మొదటి పేరు బతుకమ్మ కుంటే అని చెప్పాలి. అంతలా ఇది సర్కార్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. రేవంత్‌ పేరును చిరస్మరణగా నిలిపేలా చేసిందిది.

అప్పటి వరకు కబ్జాల పాలై రూపు రేఖలు కోల్పయి ఉన్న బతుకమ్మ కుంటకు జీవం పోసింది హైడ్రా. దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని యుద్ధప్రాతికన పనులు చేయించారు సీఎం. దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టి ఆ బతుకమ్మ కుంటకు అద్బత రూపమిచ్చి.. అందరి దృష్టిని ఆకర్షించారు.

Advertisement

ఈ కబ్జాల బాగోతంలో.. కుంటకు చెందిన భూములను తిరిగి లాక్కుని కుంటలో కలిపిన ఇష్యూలో తెర వెనుక ఉన్నది బీఆర్‌ఎస్‌ పార్టీనే. దీంతో ఈ రెండు పార్టీల మధ్య జరిగిన పోరుగా కూడా ఇది మారింది. అంబర్‌పేట నియోజకవర్గ ఇంచార్జి ఎడ్ల సుధాకర్‌కర్‌రెడ్డికి ఈ కుంటకు చెందిన భూములను కబ్జా చేశారనేది సర్కార్ ప్రధాన ఆరోపణ. అందుకే దీనిపై సర్వే చేయించి.. మొత్తం భూములను లాక్కుని కుంటలో కలిపేసింది సర్కార్‌.

ఇక్కడే ఇది రెండు రాజకీయ పార్టీల మధ్య గొడవగా కూడా మారింది. కానీ సీఎం రేవంత్‌ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. బతుకమ్మ కుంట నాడు ఎలా ఉండేదో.. ఎన్ని ఎకరాలతో ఆ కుంట విస్తరించి ఉందో.. ఆ భూములన్నింటినీ తీసుకుని బతుకమ్మ కుంటకు పునరుజ్జీవనం చేసేదాకా వదల్లేదు. కేసీఆర్ వచ్చినప్పుడు హెలికాప్టర్ తో పూలు చల్లించినందుకు బహుమానంగా సుధాకర్ రెడ్డికి బతుకమ్మ కుంట భూములను అప్పగించారని రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. గత ఏడాది సద్దుల బతుకమ్మ వేడుకలు ఈ జీవం పోసుకున్న బతుకమ్మ కుంటలో ఘనంగా జరిగాయి. ఆ తరువాతే ఎడ్ల సుధాకర్‌రెడ్డి దీనిపై కోర్టుకు వెళ్లాడు. కోర్టు కూడా కుంటకు చెందిన కాంపౌండ్‌ వాల్‌ కు రాసిన హైడ్రా పేర్లను తొలగించాలని పలు ఆంక్షలు పెట్టింది.

Advertisement

ఇది జనాల్లో తీవ్ర అయోమయానికి తెర తీసింది. మొన్నటి వరకు కూడా జనాలు .. ‘ఏంటీ బతుకమ్మ కుంటను తీసేస్తున్నారా? బీఆర్‌ఎస్‌ నాయకులు దీన్ని బంద్‌ చేయించారంట కదా? ఈసారి బతుకమ్మలు ఎక్కడ వేద్దాం.. ?’ అనే చర్చ ఆ చుట్టు పక్కల బాగా వినిపించింది. అంటే.. ‘సీఎం దీన్ని బాగు చేయిస్తే.. బీఆర్‌ఎస్‌ నేతలు కోర్టుకు వెళ్లి దీన్ని ఆపేశారంట కదా?’ అనే చర్చ జనాల్లో విస్తృతంగా జరిగింది.

ఎందుకంటే.. ఈ బతుకమ్మ కుంటలో బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తారు. ఆటోలు, కార్లు, తదితర వాహనాల్లో తరలివచ్చి మహిళలు.. ఇక్కడ బతుకమ్మలు ఆడి.. ఆ కుంటలో నిమజ్జనం చేస్తారు. అయితే, ఈసారి బీఆర్‌ఎస్‌ కోర్టు ఆంక్షలతో దీన్ని కట్టడి చేయాలని చూసినా.. అంతిమంగా బతకమ్మ వేడుకలను జనం బాగానే జరుపుకున్నారు. ఈ క్రెడిట్‌ మాత్రం కాంగ్రెస్‌ కు దక్కిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

దీనిపై బీఆర్ఎస్‌ ఎంత లాగితే అంత వారికే నష్టం తప్ప.. జనం మాత్రం ఈ కుంట పునరుజ్జీవనంలో కాంగ్రెస్‌ సర్కార్‌ వెంట ఉంది. సీఎం రేవంత్‌ పేరును ఎప్పటికీ గుర్తించుకుంటుంది. అంతలా ఈ బతుకమ్మ కుంట పేరు సిటీ జనాల్లో బలంగా స్థిరపడిపోయింది.

Tags

Related News

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

ఎల్‌నినో ఎఫెక్ట్.. ఉచిత చేపపిల్లల పంపిణీకి కొత్త కష్టాలు.. చనిపోలాల్సిందేనా..?

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఇద్దరూ పోటీ..! మహేశ్‌కు వరించిన అధ్యక్ష పీఠం..! లేటుగానైనా జాతీయ స్థాయి కీలక పదవిలో యాష్కీ!

కాంగ్రెస్‌..కోదండరాం మంత్రం! ఆయనే ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రం..? రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు!

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

కృష్ణా-గోదావరి ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్.. నిజాంసాగర్‌లో పడిపోయిన నీటి నిల్వలు!

ఇకపై నో సైలెంట్.. దూకుడు పెంచడమే.. గులాబీ పార్టీ నెక్స్ట్ వ్యూహం ఇదే?

Big Stories

Advertisement
×