E-Paper
Advertisement

ప్రయాణికుడి చెవిలో ఇరుక్కుపోయిన ఇయర్‌ బడ్.. రైల్వే సిబ్బంది చేసిన పనికి ప్రశంసలు!

ప్రయాణికుడి చెవిలో ఇరుక్కుపోయిన ఇయర్‌ బడ్.. రైల్వే సిబ్బంది చేసిన పనికి ప్రశంసలు!
Advertisement

Medical Help on Train: రైలు ప్రయాణంలో అనుకోని సమస్య ఎదురైతే ఏం చేయాలో తెలియక చాలామంది ఆందోళన చెందుతారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వైద్య సహాయం అవసరమైతే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుంది. అయితే, కావేరి ఎక్స్‌ ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు భారతీయ రైల్వే సిబ్బంది స్పందించిన తీరు అతడిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇంతకీ అసలేం జరిగిందంటే?

కావేరి ఎక్స్‌ ప్రెస్‌ లో రాత్రిపూట ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వైర్‌ లెస్ ఇయర్‌ బడ్స్ పెట్టుకున్నాడు. ఈ సమయంలో ఇయర్‌ బడ్‌ కు ఉండే చిన్న సిలికాన్ కొన అతడి ఎడమ చెవిలో ఇరుక్కుపోయింది. దాన్ని బయటకు తీయడానికి ఆయన  ప్రయత్నించిగా, అది చెవి లోపలికి మరింత వెళ్లిపోయింది. చెవి మూసుకుపోయినట్లు అనిపించడంతో పాటు మంట కూడా మొదలైంది. పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారకముందే మెడికల్ హెల్ప్ తీసుకోవాలనుకున్నాడు.

139 హెల్ప్‌ లైన్‌ కు ఫోన్ చేయడంతో..

Advertisement

సాయం కోసం ఆ ప్రయాణికుడు భారతీయ రైల్వే హెల్ప్‌ లైన్ నంబర్ 139కు కాల్ చేశాడు. అతడి సమస్యను తెలుసుకున్న సిబ్బంది అవసరమైన సాయాన్ని అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ రెడ్డిట్ పోస్టు పెట్టాడు. రైల్వే సిబ్బంది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), వైద్యుడిని సంప్రదించారు. రైలు జోలార్‌ పేటకు చేరుకునే సమయానికి ప్రయాణికుడికి వైద్య సాయం అందేలా ఏర్పాట్లు చేశారు.

జోలార్‌పేటలో వైద్యుడి సాయం

రైలు జోలార్‌ పేట చేరుకున్నప్పుడు వైద్యుడు ప్రయాణికుడిని పరీక్షించారు. అనంతరం చెవిలో ఇరుక్కున్న సిలికాన్ కొనను జాగ్రత్తగా బయటకు తీశారు. చెవికి గాయం అయిందా? రక్తస్రావం ఏమైనా ఉందా? అనేది కూడా పరిశీలించినట్లు ఆ ప్రయాణికుడు వివరించాడు. ఈ సమస్య పరిష్కారం కావడంతో ప్రయాణాన్ని మధ్యలో ఆపేయకుండా దిగాల్సిన చోటుకు చేరుకున్నట్లు చెప్పాడు. అత్యవసర సమయంలో వెంటనే స్పందించి సాయం  అందించిన రైల్వే సిబ్బంది, వైద్యుడికి కృతజ్ఞతలు తెలిపాడు.

రైల్వే సిబ్బందిపై ప్రశంసలు

Advertisement

తనకు ఎదురైన పరిస్థితిని రెడ్డిట్‌ లో పంచుకున్న ప్రయాణికుడు.. ప్రభుత్వ సర్వీసుల్లో సమస్యలు ఉండొచ్చని, అయితే అవసరమైన సమయంలో తనకు సాయం అందిందని చెప్పుకొచ్చాడు. ఇలాంటి మంచి అనుభవాలను కూడా ప్రజలు షేర్ చేసుకోవాలన్నాడు.

139 హెల్ప్‌ లైన్ ను పయోగించుకోండి..   

భారతీయ రైల్వేకు చెందిన 139 హెల్ప్‌ లైన్ ప్రయాణికులు రైలులో ఉన్నప్పుడు పలు రకాల సాయాలు అందించనుంది. మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితులు, భద్రతకు సంబంధించిన సమస్యలు, రైల్వే సర్వీసులకు సంబంధించి ఫిర్యాదుల కోసం ప్రయాణికులు ఈ నెంబర్ ను ఉపయోగించుకోవచ్చు.

Read Also: ప్రకృతి అందాల మధ్య మరిచిపోలేని అనుభూతి.. దేశంలో 8 అద్భుతమైన రైలు ప్రయాణాలు!

Tags

Related News

ప్రకృతి అందాల మధ్య మరిచిపోలేని అనుభూతి.. దేశంలో 8 అద్భుతమైన రైలు ప్రయాణాలు!

అంతరిక్షంలోకి టూరిస్టులు.. అసలు ఇది సాధ్యమేనా, ఖర్చు ఎంతవుతుంది?

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

Big Stories

Advertisement
×