JD Vance: ఉద్యోగాలు కోల్పోయిన H-1B వీసా హోల్డర్లను వారి స్వదేశానికి తిరిగి పంపించేందుకు తాను చేసిన వ్యాఖ్యలపై క్లారిఫికేషన్ ఇచ్చారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో నోరు విప్పారు. తాను అమెరికా కంపెనీలు, వీసా వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నానని, హెచ్-1బి వీసాదారులను కాదని స్పష్టంచేశారు.
రెండు వారాల కిందట కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో, హెచ్సీఎల్, క్యాప్జెమిని కంపెనీలను పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి సస్పెండ్ చేసినప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ విషయంలో ఆనాడు హద్దులు దాటి మాట్లాడానని, విదేశీ ఒప్పంద పనివాళ్లు అని నేను వాడిన పదం సరైనది కాదన్నారు. తన ప్రసంగంలో ఏమైనా లోపాలు ఉంటే అది నా తప్పేనని చెప్పుకొచ్చారు.
ఆయన వ్యాఖ్యలపై కేంద్ర విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. నిపుణుల తరలింపు విషయంలో భారతీయులకు అవకాశాలు కల్పించడంతోపాటు అమెరికా కంపెనీల సంపదను పెంచుతోందని తెలిపింది. ఆవిష్కరణలు, పరిశోధన, ఉత్పాదకత, పోటీతత్వం, ఉద్యోగకల్పన వంటి విషయాల్లో కంపెనీలకు అత్యాధునిక ప్రతిభ ఎంతో సహాయకారిగా ఉందని తెలియజేసింది. ఇవేమీ తెలియకుండా అనవసరంగా వాన్స్ మాట్లాడారని వ్యాఖ్యానించింది.
హెచ్-1బీ వీసాదారులను లక్ష్యంగా చేసుకోవాలనేది నా ఉద్దేశం కాదని, అమెరికా కంపెనీలు, వీసా వ్యవస్థ గురించి మాట్లాడానని తెలిపారు. అమెరికాకు హెచ్-1బీ వీసాపై ఉద్యోగులు వస్తారని, వారిని తీసుకున్న కంపెనీలు ఆ పనికి ప్రత్యామ్నాయంగా అమెరికన్ కార్మికులు దొరకలేదని చెబుతాయని అన్నారు. ఇలాంటి నిర్ణయం వల్ల స్థానికులకు అవకాశాలు తగ్గిపోతున్నాయని, తరచుగా ఇక్కడే ఇదే జరుగుతోందన్నారు. ఆనాడు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చిందన్నారు.
ALSO READ: మంటల్లో ఫ్రాన్స్.. రోడ్లపైకి లక్షల్లో నిరసనకారులు, భవనాలు దగ్దం, షాపులు లూఠీ
అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్లడానికి వచ్చేవారికి హెచ్ 1 బీ వీసా ఏకైక జీవనాధారం అన్నారు. యజమానితో కార్మికులు విభేదిస్తే.. తమ ఉద్యోగాన్ని కోల్పోవచ్చని తెలుసని, వారిని వెనక్కి పంపించేయవచ్చని అన్నారు. యజమానికి చాలా ఎక్కువ అధికారాన్ని ఇస్తుందని నేను భావిస్తున్నానని, బహుశా నా వాదనలో లోపం ఉండి ఉండవచ్చన్నారు. వీసా వ్యవస్థే ప్రజలను ఒప్పంద సేవకులుగా చూడటానికి అనుమతిస్తోందని, వారి స్వదేశాలకు పంపించేయవచ్చని చెప్పుకొచ్చారు.