E-Paper
Advertisement

Congress DCC Presidentship: డీసీసీ పదవుల కోసం.. రూల్స్ బ్రేక్ చేస్తున్నారా?

Congress DCC Presidentship: డీసీసీ పదవుల కోసం.. రూల్స్ బ్రేక్ చేస్తున్నారా?
Advertisement

Congress DCC Presidentship:  కాంగ్రెస్ పార్టీలో డీసీసీ అధ్యక్ష పదవి కావాలంటే 5 ఏళ్ల పాటు పార్టీ లో కొనసాగి ఉండాలి.. ఎలాంటి రిమార్క్స్ ఉండకూడదు. రెండు పదవులు ఉండకోడదు ఇలాంటి ఎన్నో నిబంధనలు పెట్టారు పార్టీ పెద్దలు. నిబంధనల ప్రకారమే ఏఐసిసి నుండి వచ్చిన వారు జిల్లా స్థాయి పదవి ఆశిస్తున్న వారి దగ్గర నుండి బయోడేటా తీసుకొని ఇంటర్వ్యూ లు చేశారు. ఐతే ఈ నిబంధన ఎమ్మెల్యేలకు వర్తించదట..అంటే ఆ షరతులు ఎవరికి వర్తిస్తాయి?

కొత్తకొత్త రూల్స్ పెట్టి వాటిని బ్రేక్ చేసే కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ లో కొన్ని సార్లు పదవులు ఎలా వస్తాయో తెలీదు… మొదటి నుండి వినిపించే పేరు ఒక్కటైతే చివరి నిమిషంలో సీల్డ్ కవర్ లో వచ్చే పేరు ఇంకొకటి ఉంటుంది. పార్టీ లో ఎవరికైనా ఒక పదవి ఇవ్వాలన్నా.. ఒకరికి పదవి ఇవ్వొదన్నా ఆ సమయనికి వారి కోసం పార్టీ ఒక కొత్త రూల్ తీసుకొస్తుంది.. అదే సమయంలో ఇంకెవరికైనా ఇవ్వాలి అనుకుంటే తెచ్చిన రూల్స్‌నే బ్రేక్ చేస్తుంది. ఐతే హస్తం పార్టీలో ఇదేమి కొత్త కాదనుకోండి అందరికి తెలిసిందే.

Advertisement

పార్టీ అగ్ర నాయకత్వమే పార్టీ లోకి వచ్చిన ప్యారాషుట్లకు నో టికెట్, పార్టీలో ఏమైనా పదవి కావాలంటే 5 ఏళ్లు పార్టీలో పని చేయాలి అని స్టేట్మెంట్ ఇస్తారు… అదే అగ్ర నాయకత్వం అలాంటి సమయం వచ్చిన్నప్పుడు రాజకీయాల్లో కొన్ని సార్లు తప్పదంటూ చెప్పిన మాట పక్కకు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే తెలంగాణ హస్తం పార్టీలో చోటు చేసుకుంది.

డీసీసీ అధ్యక్ష పదవుల కోసం కసరత్తు

తెలంగాణ లో డీసీసీ అధ్యక్ష పదవుల కోసం కసరత్తు పూర్తయింది. ఈ నెలలో ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా లిస్ట్ విడుదల కావ్వొచంటూ పీసీసీ అధ్యక్షుడు సైతం చిట్ చాట్ లో తెలిపారు. ఐతే ఏంటి సమస్య అనుకుంటున్నారా…! ఈ డీసీసీ అధ్యక్ష పదవి కోసం పార్టీ పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. పార్టీ కోసం పని చేస్తుంది ఎవరు? .. పార్టీ లో ఏళ్ల తరబడి కొనసాగింది, కొనసాగుతోంది ఎవరు? .. పదవుల కోసం పార్టీ లు జంప్ అవుతూ అధికారం వచ్చిన తర్వాత వచ్చింది ఎవరు? … డీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారికి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలుగా ఉన్నవారిలో ఎవరైనా బంధువులు ఉన్నారా…! ఉంటే నో ఛాన్స్ అన్నారు.

Advertisement

ఎవరైనా సీనియర్ నాయకులు ఎవరి పేరైనా రిఫర్ చేస్తున్నారా? ఐతే ఇచ్చేదే లేదన్నారు. డీసీసీ అధ్యక్షుడిగా పార్టీలో 5 ఏళ్లు సభ్యత్వం పూర్తి చేసుకున్న వారు మళ్ళీ ఎవరైనా ఆశిస్తున్నారా? డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన వారు వారి కుటుంబ సభ్యులు ఎవరైనా తిరిగి ఆ పదవి ఆశిస్తున్నారా? ఐతే ఆశలు పెట్టుకోకండి… ఇప్పటికే పదవులు, నామినేటెడ్ పదవులో ఉన్నవారికి డీసీసీ పీఠం కావాలంటే ఒక్క పదవి వదులుకోవాల్సిందే అంటూ ఇలా అనేక రూల్స్ డీసీసీ అధ్యక్షా పదవి కోసం తీసుకొచ్చింది హస్తం పార్టీ.

పార్టీలో పదవి కావాలంటే 5 ఏళ్లు పని చేయాలని స్టేట్మెంట్

దాని కోసం 22మంది అబ్జర్వర్లను నియమించి. డీసీసీ పదవి ఆశిస్తున్న వారి వివరాలు తీసుకుంది. అందులో 3 పేర్ల చొప్పున అర్హులు ఉన్న వారి లిస్ట్ ను సైతం ఫైనల్ చేశారు. ఐతే ఇక్కడి వరకు బాగానే కొనసాగింది ప్రక్రియ… ఇప్పుడు డీసీసీ అధ్యక్షుల లిస్ట్ వస్తుందని వార్తలు వస్తున్న సమయంలో ఈ రూల్స్ ఎమ్మెల్యేలకు వర్తించదు, ఎమ్మెల్యేలు ప్రజల నుండి గెలిచి వచ్చారు.. ఎవరైతే పార్టీ పదవులో ఉన్నారో… ఎవరైతే నామినేటెడ్ పదవులో ఉన్నారో వారికి మాత్రమే వర్తిస్తుందని… ఎమ్మెల్యే లకు ఇది వర్తించదని పీసీసీ అధ్యక్షుడు ఒక చిట్ చాట్ లో చెప్పేశారు.

కొన్ని చోట్ల ఎమ్మెల్యే లు డీసీసీ అధ్యక్షులుగా ఉంటే బాగుంటుందని కూడా ఒక సందర్భంలో మహేష్‌ కుమార్‌ గౌడ్ చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పటివరకు జరిగిన ప్రక్రియ అంత వేస్టేనా అంటూ పార్టీ లో డిస్కషన్ మొదలైంది. పార్టీ లో 5 ఏళ్ల పాటు కంటిన్యూ గా కొనసాగిన వారికే ఛాన్స్ అంటే చాలా మంది ఆశవహులు ఆ పదవుల్లో ఎదురు చూస్తున్నారు. ఎన్ఎస్‌యూఐ నుండి పార్టీ లో జిల్లా పదవులు చేపట్టిన వారు..అవకాశలు రాని వారు ఎంతో ఆశతో డీసీసీ పీఠాల కోసం ధరఖాస్తు చేసుకున్నారు.

ఇప్పటివరకు పెట్టిన రూల్స్, చేసిన ప్రక్రియ అంతేనా

ఇప్పుడు అలాంటి వారిలో కొందరికి నిరాశ తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికలో ఎమ్మెల్యే ల పోటీ చేసి ఓడిపోయిన వారు.. ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ లుగా ఉన్నారు. అలాంటి వారు సైతం కొన్ని జిలాల్లో డీసీసీ అధ్యక్షా పదవి ఆశిస్తున్నారు. మరి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారికే అవకాశం ఇస్తే…. ఇక కొత్త వారికి వచ్చే అవకాశం ఎంత..? అనే ప్రశ్న ఇప్పుడు పార్టీ వర్గాలో ఉత్పన్నమవుతోంది.

మొత్తానికి డీసీసీ అధ్యక్షుల విధానం సాఫీగా సాగుతుందని ఆశావహలు ఆశించారు. కానీ ఎమ్మెల్యేలకు ఇది వర్తించదు అనే స్టేట్మెంట్ రాగానే డీసీసీ పదవి ఆశిస్తున్న వారిలో తెలియని ఆందోళన మొదలైందంట . ఇక ఇప్పటివరకు పెట్టిన రూల్స్, చేసిన ప్రక్రియ కూడా ఎప్పటిలాగే అంతేనా అంటూ మాట్లాడుకుంటున్నారు..చూడాలి మరి పార్టీ చెప్పిన్నట్లు రూల్స్ పాటిస్తుందా… లిస్ట్ వచ్చే సమయానికి ఈ రూల్స్ కేవలం ఎమ్మెల్యే ల వరకే మినహాయింపుగా ఉంటుందా అన్నది చూడాలి.

Story by Apparao, Big Tv

Related News

ఫిఫా ఫైనల్ కురుక్షేత్రం.. 16 ఏళ్ల కల నెరవేరిన వేళ.. కన్నీళ్లతో మెస్సీ వీడ్కోలు!

మీ అవినీతిని బంద్ పెడితే చాలు.. ఉచిత కార్పొరేట్ విద్యా, వైద్యం అందించొచ్చు..!

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

Big Stories

Advertisement
×