E-Paper
Advertisement

Narasaraopeta: జగన్‌ను మెప్పిస్తాడా! నరసరావుపేటపై మోదుగుల ఫోకస్

Narasaraopeta: జగన్‌ను మెప్పిస్తాడా! నరసరావుపేటపై మోదుగుల ఫోకస్
Advertisement

Narasaraopeta:  ఆ గట్టు నుంచి ఈ గట్టు… ఈ గట్టు నుంచి ఆ గట్టు… నిత్యం భూమి గుండ్రంగా తిరిగినట్టు అటు నుంచి ఇటు.. తిరుగుతూనే ఉంటారు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి.. ప్రజారాజ్యం మొదలుకొని వైసీపీ వరకు ఆ నేత రాజకీయ ప్రయాణం చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది . పార్టీలే కాదు ఏకంగా నియోజకవర్గాలు మార్చేస్తుంటారాయన.. తాజాగా వైసీపీలో ఉన్న మోదుగులు తిరిగి నర్సరావుపేట సెగ్మెంట్‌పై కన్నేశారంట.

బావ కోసం టికెట్ త్యాగం చేసిన మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుంటూరు జిల్లాకి ప్రత్యేక గుర్తింపు పొంది… అందులోనూ పల్నాడు రాజకీయాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది.. అటువంటి పల్నాడులో నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి … బావ కళ్లలో ఆనందం చూడడం కోసం టికెట్ త్యాగం చేస్తానని సరదాగా వ్యాఖ్యానించారు… ఆ సరదా నే ఆయన జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది… అంతేకాదు ఆయన రాజకీయ జీవితంపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి.

వైసీపీ కార్యక్రమాల్లో యాక్టివ్ అవుతున్న మోదుగుల

Advertisement

ప్రస్తుతం మాజీగా ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల వైసీపీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి… చాలా కాలంగా కనిపించిన ఈయన సడన్‌గా వైసిపి కార్యక్రమాల్లో యాక్టివ్ అవుతున్నారు… పిలిచినా పిలవకపోయినా నేను ఉన్నాను అంటే పరుగులు పెడుతూ కనిపిస్తున్నారు.. ఇప్పుడు ఆయన కన్ను గతంలో తాను పోటీ చేసి గెలుపొందిన నరసరావుపేట పై పడిందంట…. అధిష్టానం కూడా బావ మాట బంగారు బాట అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట…. ఇటీవల కాలంలో వైసీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి కోసం ఐవిఆర్ఎస్ కాల్స్‌తో సర్వే చేసి ఆయనవైపే మొగ్గుచూపుతోందంట ..

నరసరావుపేట లో తెగ హడావిడి చేస్తున్న మాజీ ఎంపీ

దాంతో ఉన్నట్టుండి ఉలిక్కిపడి నిద్ర లేచినట్టు… తెగ హడావిడి చేసేస్తున్నారు ఆ మాజీ ఎంపీ. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత అసలు ఎక్కడున్నారో కూడా తెలియని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఉన్నట్టుండి యాక్టివ్‌ అయిపోయారు. ఇన్నాళ్ళు… ఉన్నావా…. అసలున్నావా… అంటూ వెదుక్కున్న వాళ్ళందరికీ ఇప్పుడు కనిపిస్తూ, డోంట్‌ వర్రీ… ఉన్నా, ఇక్కడే ఉన్నానంటూ తెగ తిరిగేస్తున్నారట. ఇంతలోనే ఎంత మార్పు అంటూ నరసరావుపేట పొలిటికల్‌ సర్కిల్స్‌లో తెగ గుసగుసలాడేసుకుంటున్నారు. 2009లో రాజకీయాల్లోకి వచ్చారు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి. ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్‌ కెరీర్‌ మొదలైనా… అప్పటి ఎన్నికల సమయానికే ఆ పార్టీని వదిలేసి టీడీపీలో చేరి నరసరావుపేట ఎంపీగా గెలిచారు. అప్పటినుంచి పల్నాడులో యాక్టివ్ పాలిటిక్స్ మొదలుపెట్టారాయన.

Advertisement

దాంతో ఈ ఏరియాలో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. 2014లో మరోసారి టీడీపీ తరపున నరసరావుపేట ఎంపీ టిక్కెట్‌ ఆశించినా.. దాన్ని రాయపాటి సాంబశివరావుకు కేటాయించి మోదుగులకు ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. దాంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గెలిచినా…అప్పుడు పార్టీ అధికారంలో ఉన్నా…. నియోజకవర్గ రాజకీయాల్ని తట్టుకోలేకపోయారట ఆయన. ఈ క్రమంలో….ఇంకోసారి టీడీపీ టిక్కెట్‌ రాదని ముందే గ్రహించి వైసీపీ పంచన చేరిపోయారు.

గుంటూరు పార్లమెంట్ ఇన్ చార్జుగా ఐదేళ్ల పాటు హవా

మోదుగుల వేణుగోపాలరెడ్డి బంధువులు అయోధ్యరామిరెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైసీపీలో కీలకంగా ఉండటంతో… తేలిగ్గా లైన్‌ క్లియర్‌ అయింది. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున గుంటూరు ఎంపీగా బరిలో దిగారు మోదుగుల. కానీ… అనుహ్యంగా స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారాయన. అయినా… అప్పుడు పార్టీ అధికారంలోకి రావడంతో… గుంటూరు పార్లమెంట్ ఇన్ చార్జుగా ఐదేళ్ల పాటు హవా నడిపారు. కానీ.. 2024లో వైసీపీ కూడా టిక్కెట్‌ నిరాకరించడం, పార్టీ సైతం ఓడిపోవడంతో… సైలెంట్‌గా ఉండిపోయారు మాజీ ఎంపీ. కానీ…గత కొద్ది రోజుల నుంచి యాక్టివ్‌గా తిరుగుతుండటం చూస్తున్నవాళ్ళు మాత్రం తెర వెనక ఏదో జరిగిందని గుసగుసలాడు కొంటున్నారు.

గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా వేణుగోపాల్‌రెడ్డిని నియమిస్తారని ఆ మధ్య పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ… అనూహ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఆ పోస్ట్‌ దక్కింది. మోదుగులకు జిల్లా అధ్యక్ష పదవి వస్తే తనకు ప్రాధాన్యత తగ్గుతుందని భావించిన గుంటూరు నేత ఒకరు అంబటికి మద్దతు ఇచ్చినట్టు అప్పట్లో చెప్పుకున్నారు. జిల్లా అధ్యక్ష పదవి మిస్ అవడంతో బాగా హర్టయిన మాజీ ఎంపీ… తన బావ అయిన ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి ద్వారా జగన్ దగ్గర పావులు కదిపారంట. ఆ తర్వాతే ఆయనకు నరసరావుపేట, విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పదవి దక్కిందని చెప్పుకుంటున్నారు.

నరసరావుపేట పై ఫోకస్..మోదుగుల

ఇక ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారాయన. ఎలాగైనా సరే… వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ సంపాదించాలనుకుంటూ… ఇప్పటినుంచే జగన్ దృష్టిలో పడేందుకు తెగ కష్టపడుతున్నారట. ఇదే సమయంలో అయోధ్యరామిరెడ్డి కూడా మోదుగులకు ప్రాధాన్యత ఇవ్వాలని జగన్‌కు సిఫారసు చేసినట్టు తెలిసింది. ఈసారి మోదుగులకు సీటు గ్యారెంటీ అన్న ప్రచారం జరుగుతోంది వైసీపీ సర్కిల్స్‌లో. సీటు ఇస్తే చాలు… ఎక్కడినుంచైనా పోటీకి సిద్ధమని చెప్పారట ఆయన. పైకి ఎక్కడి నుంచైనా అని అంటున్నారేగానీ…ఆయన చూపు మొత్తం గతంలో పోటీ చేసిన నరసరావుపేట మీదే ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పార్టీ తరపున నరసరావుపేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ ప్రస్తుతం నెల్లూరుకే పరిమితమయ్యారు. ఇక ఆయన ఇక్కడికి తిరిగి వచ్చే అవకాశం కూడా లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలో తనకు మంచి పరిచయాలున్న నరసరావుపేటపై ఫోకస్ పెంచారట వేణుగోపాల్‌రెడ్డి. ఇప్పుడు చేస్తున్న ఈ హంగామా అంతా అందుకోసమేనన్నది లోకల్‌ వాయిస్‌…. మరి పల్నాడు వైసీపీలో ఉన్న నేతలు మోదుగుల రాకను ఎంత వరకు స్వాగతిస్తార్ చూడాలి.

Story by Apparao, Big  Tv

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×