సరిగ్గా నేటితో ఎనిమిది రోజులు. ఢిల్లీని అష్టదిగ్బంధనం చేసి. ఈనెల 10న సీజేపీ ఛలో జంతర్‌మంతర్‌కు పిలుపునిచ్చింది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాక్రోచ్ పార్టీ పిలుపునిచ్చిన రోజు నుంచి నేటి వరకు ఢిల్లీ మొత్తం పోలీసుల పహారాతో స్తంభించిపోయింది. జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేయొద్దని కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసిన తరువాత మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నాయి పోలీసులు బలగాలు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు .. 8 రోజుల పాటు బలగాలు పెంచుతున్నారే తప్ప.. తగ్గించడం లేదు. భద్రతా ఏర్పాట్లు అనే ముసుగులో ఢిల్లీని మరింతగా నిర్బంధించే చర్యలకే పాల్పడుతోంది కేంద్ర సర్కార్. అయితే జంతర్‌మంతర్ వేదికను బంద్ చేస్తే.. నిరసన వేడి తగ్గుతుందనే వ్యూహాన్ని అమలు చేసిన కేంద్రం.. ఆల్టర్నేట్గా రాంలీలా మైదాన్, బురారీ మైదానాలను చూపించింది. సీజేపీ ఆందోళనకారులు.. కనాట్ ప్లేస్, సెంట్రల్ పార్క్ ప్రాంతాల్లో ఆందోళనలు చేపడుతున్నారు.
ఇక్కడ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, పండుగ వేళ ఈ నిర్బంధలేలా..? అంటూ అక్కడి వ్యాపారులు కూడా కేంద్రం నిర్ణయంపై విరుచుకు పడుతున్నారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాదు.. కోర్టును కూడా ఆశ్రయించారు. జంతర్‌మంతర్ వద్దే ఆందోళనలు చేసుకునేలా చూడాలని వారు కోర్టును కోరడం గమనార్హం. అయితే, వారం రోజులుగా ఇక్కడ పోలీసు బలగాలను అస్సలు తగ్గించలేదు, పైగా భద్రతను మరింత కఠినతరం చేశారు. పారామిలట్రీ సిబ్బంది, స్థానిక పోలీసులు పార్లమెంట్ స్ట్రీట్, అశోక్ రోడ్ వంటి ప్రధాన రహదారుల వద్ద మొహరించే ఉన్నారు.
ఈ నెల 14న జంతర్ మంతర్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన సీజేపీ కీలక నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని జుడీషియల్ కస్టడీకి తరలించారు. నిరసనలకు ప్రత్యామ్నాయంగా రాంలీలా మైదాన్, బురారీ మైదానాలను కేటాయించారు. అయితే, జంతర్ మంతర్ వద్ద ఆంక్షల నేపథ్యంలో 16న కనాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్ వేదికగా ‘లెహరా దో తిరంగా’ పేరుతో ర్యాలీకి సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పిలుపునిచ్చారు.
ర్యాలీ ప్రారంభానికి ముందే అభిజీత్ దీప్కేను, లెఫ్ట్ విద్యార్థి సంఘం (AISA) అధ్యక్షురాలు నేహా బోరాను పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయం నేహా బోరాను విడుదల చేయగా, దీప్కేను కోర్టులో హాజరుపరిచి షరతులతో కూడిన బెయిల్‌పై విడుదల చేశారు.
సెంట్రల్ పార్క్‌ను కూడా మూసేశారు తాజాగా పోలీసులు. పైగా ఇక్కడ భారీగా భద్రతను పెంచారు. అంటే జంతర్ మంతర్ పోయింది.. తాజాగా సెంట్రల్ పార్కును కూడా ఆధీనంలోకి తీసేసుకున్నది కేంద్రం. ఈ ఆందోళనల్లో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, తదితర విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. ఆంక్షలను ఉల్లంఘించారనే కారణంతో పోలీసులు అక్కడ కూడా సుమారు 150 మందిని నిర్బంధించి, ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.