E-Paper
Advertisement

రాడు.. రానేరాడు.. వస్తే గిస్తే.. సీఎంగానే వ‌స్త‌డు.. ఏం చేసుకుంట‌రో చేసుకోండి..!

రాడు.. రానేరాడు.. వస్తే గిస్తే.. సీఎంగానే వ‌స్త‌డు.. ఏం చేసుకుంట‌రో చేసుకోండి..!
Advertisement

అచ్చంగా కేటీఆర్ మాట్లాడిన మాట‌లు ఇట్ల‌నే ఉన్న‌యి. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ వెయ్యి రోజులుగా ఫామ్‌హౌజ్‌కే ప‌రిమితం కావ‌డం, ప్ర‌భుత్వ ధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌నే కార‌ణంతో రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. దీనిపై నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌కు కూడా పిలుపునిచ్చారు సీఎం. రేవంత్ పిలుపుపై కేటీఆర్ ఘాటుగానే స్పందించారు.

అసెంబ్లీకి రావాలె.. రావాలె.. అంటున్నారు. అస‌లు రానే రాడు.. మీ స‌ర్కార్ పోయేదాకా రాడు.. అని తేల్చేశారు కేటీఆర్‌. అంటే మ‌రో రెండేళ్ల దాకా కేసీఆర్ అసెంబ్లీకి రాడ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పేశార‌న్న‌మాట‌. వ‌స్తే గిస్తే సీఎంగానే అసెంబ్లీలో అడ‌గు పెడ‌తాడ‌ని కూడా క్లారిటీ ఇచ్చారు. మీరెంత మొత్తుకున్నా.. ఆయ‌న ఫామ్‌హౌజ్ విడిచి బ‌య‌ట‌కు వ‌చ్చేదీ లేదు.. అసెంబ్లీలో అడుగు పెట్టేదీ లేదు.. అని తీర్మానించేశారు.

Advertisement

దీనికి కార‌ణాల‌ను కూడా చెప్పి స‌మర్థించుకునే ప్ర‌య‌త్నం చేశారాయ‌న‌. సీఎంగా ఎలా మ‌ట్లాడాలో తెలియ‌ని రేవంత్ ఉన్నంత కాలం కేసీఆర్ అక్క‌డ అడుగు పెట్ట‌లేర‌న్నారు. చేత‌కాక‌పోతే దిగిపో.. అంతేగానీ అసెంబ్లీకి రా.. అసెంబ్లీకి రా.. అంటే కేసీఆర్ వ‌చ్చే ర‌కం కాద‌నే విధంగా కేటీఆర్ చేసిన కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.

సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడ‌తారు అని చెప్పడం వెనుక .. వచ్చేది మా స‌ర్కారేన‌నే ధీమాను వ్య‌క్తం చేశారాయ‌న‌. ప్ర‌జ‌ల ఆశీర్వాదాలుంటే త‌ప్ప‌కుండా గెలుస్తామ‌ని ఓట‌ర్ల‌ను విజ్ఞ‌ప్తి చేసుకున్న‌ట్టుగా కూడా క‌వ‌ర్ చేసుకున్నారు కేటీఆర్‌. ఇక కేసీఆర్ రాజీనామా చేయాల‌నే డిమాండ్‌పైనా త‌న‌దైన శైలిలో ఎదురుదాడికి దిగారు. కేసీఆర్ రాజీనామా చేస్తేనే తెలంగాణ వ‌చ్చింద‌ని గుర్తు చేశారు. ఒక్క‌సారి రాజీనామాకే ఢిల్లీ గ‌డ‌గ‌డలాడింద‌న్న ఆయ‌న‌.. సోనియాకు వీపు ప‌గులుతుంద‌నే భ‌యం ప‌ట్టుకుంద‌ని మాట తూలారు.

Advertisement

మీ నాయ‌కులే కేసీఆర్ రాజీనామాను త‌ట్టుకోలేక‌పోయారు.. నీతో అవుతుందా? ఆలోచించుకో మ‌రి.. అని వ్యంగ్యంగా మాట్లాడారు కేటీఆర్‌. మ‌ళ్లీ కేసీఆర్ టైం వ‌స్త‌ద‌ని.. ఆయ‌నే సీఎం కాబోతున్నార‌నే విధంగా కామెంట్ చేశారు. కేటీఆర్ ఇవాళ చేసిన కామెంట్ల ద్వారా సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నంత‌కాలం కేసీఆర్ అసెంబ్లీకి రాడ‌నే విష‌యం క్లారిటీకి వ‌చ్చింది. అంటే.. బీఆరెస్ అధికారంలోకి వ‌స్తేనే ఆయ‌న సీఎంగా అసెంబ్లీలో అడుగుపెడ‌తాడ‌ట‌. అప్ప‌టి వ‌ర‌కు అసెంబ్లీ ముఖ‌మే చూడ‌ర‌ని కూడా ఖుల్లం ఖుల్లాగా చెప్పేశారు. కేటీఆర్ అన్న‌మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే.. మ‌రో రెండేళ్లు ఫామ్‌హౌజ్ కేసీఆర్, రాజీనామా చెయ్ కేసీఆర్ అనే కాంగ్రెస్ నినాదాలు స‌జీవంగానే ఉంటాయ‌న్న‌మాట‌.

Tags

Related News

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

ఎల్‌నినో ఎఫెక్ట్.. ఉచిత చేపపిల్లల పంపిణీకి కొత్త కష్టాలు.. చనిపోలాల్సిందేనా..?

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఇద్దరూ పోటీ..! మహేశ్‌కు వరించిన అధ్యక్ష పీఠం..! లేటుగానైనా జాతీయ స్థాయి కీలక పదవిలో యాష్కీ!

కాంగ్రెస్‌..కోదండరాం మంత్రం! ఆయనే ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రం..? రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు!

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

కృష్ణా-గోదావరి ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్.. నిజాంసాగర్‌లో పడిపోయిన నీటి నిల్వలు!

ఇకపై నో సైలెంట్.. దూకుడు పెంచడమే.. గులాబీ పార్టీ నెక్స్ట్ వ్యూహం ఇదే?

ఎల్‌నినోతో జాడలేని ఎవుసం పనులు.. ! అనూహ్యంగా పెరిగిన కూలీల హాజరు! గత ఏడాది 25వేల మంది.. ఇప్పుడు 2.54లక్షల మందికి ‘ఉపాధి’!

Big Stories

Advertisement
×