Infertility Problems: అమ్మాయిలంతా.. కచ్చితంగా తెలుసుకోవాల్సిన న్యూస్ ఇది. అమ్మ అవ్వాలనే ఆశ ఉంటే.. కొందరు అమ్మాయిలు.. కొన్ని అలవాట్లు మానుకోవాలి. లేకపోతే.. మీ లైఫ్‌లో నుంచి మదర్ చాప్టర్‌ని మీరే చెరిపేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతి పది జంటల్లో.. ఆరుగురిలో ఇన్‌ఫెర్టిలిటీ సమస్యలు కనిపిస్తున్నాయ్. దీనికి కారణమేంటి? మహిళల్లో సంతానలేమి సమస్యలు పెరగడానికి లైఫ్‌స్టైల్‌లో వచ్చిన మార్పులు, చెడు అలవాట్లే ప్రధాన కారణమా?
చెడు వ్యసనాల కారణంగా దూరమవుతున్న అమ్మతనం
రోజులు మారుతున్నాయ్. జనం లైఫ్ స్టైల్ కూడా మారుతోంది. అందుకు తగ్గట్లుగానే.. సమస్యలు కూడా వస్తున్నాయ్. మోడ్రన్ లైఫ్ స్టైల్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, పబ్బులు, క్లబ్బుల్లో హ్యాంగ్ అవుట్‌లు, లేట్ నైట్ పార్టీలు, స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్ అడిక్షన్‌ల లాంటివి.. యువతరం భవిష్యత్తుని దెబ్బకొడుతున్నాయ్. దాంతో.. సరైన సమయంలో, సంతానం విషయంలో.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. చెడు వ్యసనాల కారణంగా.. అమ్మాయిలకు అమ్మతనం దూరమవుతోంది. ఇప్పుడు కంట్రోల్‌లో లేకపోతే.. ఫ్యూచర్‌లో ఇన్‌ఫెర్టిలిటీ సమస్యతో బాధపడాల్సి వస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. అనవసరపు అలవాట్లే.. ఆడవాళ్లలో ఇన్‍ఫెర్టిలిటీ ఇష్యూస్ పెరగడానికి కారణమవుతున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయ్. అమ్మ అవ్వాలనే ఆశ ఉంటే.. లైఫ్ స్టైల్ మార్పులు తప్పనిసరి అని చెబుతున్నారు గైనకాలజిస్ట్‌లు.
అమ్మాయిల్లోనూ కామనైపోయిన సిగరెట్ మద్యం
అబ్బాయిలు సిగరెట్ తాగడం, మందుకొట్టడం.. ఈ జనరేషన్‌లో కామనైపోయింది. సిగరెట్, మద్యం అలవాటున్న అమ్మాయిలు కూడా కొన్నేళ్ల కిందటి వరకు అక్కడక్కడా అరుదుగా కనిపించేవారు. కానీ.. ఇప్పుడు అమ్మాయిల్లోనూ.. ఈ అలవాట్లు కామనైపోయాయ్. సాధారణంగా.. సౌత్ ఇండియా సిటీస్‌లో.. నార్త్ నుంచి వచ్చి కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే మహిళలు ఎక్కువగా స్మోక్ చేసేవారు. అది కూడా ఎవరూ చూడని, లేని ప్రదేశాల్లోనే సిగరెట్లు తాగేవారు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయ్. రోడ్డు పక్కన ఛాయ్, పాన్ షాప్‌ల దగ్గర అబ్బాయిలతో కలిసి.. వారితో పోటీగా దమ్ముకొడుతున్నారు. ఎవరేమనుకున్నా.. తమకు అవసరం లేదనే రీతిలో అమ్మాయిల ఆలోచనవిధానంలో మార్పులొచ్చాయ్. ఫ్రెండ్స్ బలవంతం మీదే అలవాటు చేసుకున్నామని చెప్పేవాళ్లు కొందరైతే.. స్టైల్‌గా ఉంటుందని స్మోక్ చేసే వాళ్లు ఇంకొందరు. డిప్రెషన్ నుంచి బయటపడేందుకే.. పొగ తాగడం అలవాటు చేసుకున్నామని మరికొందరు చెబుతున్నారు. అయితే.. అలవాటు ఏదైనా.. ఓ లిమిట్ దాటనంత వరకే బాగుంటుంది. మితిమీరితే.. ఆరోగ్య సమస్యల ముప్పు తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు డాక్టర్లు.
కార్పొరేట్ కల్చర్‌కి బాగా అట్రాక్ట్ అవుతున్న అమ్మాయిలు
హైదరాబాద్ లాంటి మెట్రో సిటీకి.. తెలంగాణ నలుమూలల నుంచే కాదు.. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఉద్యోగాల కోసం అనేకమంది అమ్మాయిలు వస్తుంటారు. పీజీల్లో, హాస్టళ్లలో ఉంటూ ఉద్యోగాలు చేస్తుంటారు. అలా.. చాలామంది కార్పొరేట్ కల్చర్‌కి అట్రాక్ట్ అవుతున్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీల్లో జాబ్ చేస్తూ.. సోషల్‌గా ఇతరులతో మింగిల్ అయ్యేందుకు చెడు వ్యసనాలకు బానిసవుతున్నారు. పియర్ ప్రెజర్‌తో స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్ లాంటివి చేస్తూ.. నెమ్మదిగా వాటికి అలవాటు అవుతున్నారు. అయితే.. ఈ అలవాట్ల వల్లే.. మహిళల్లో ఇన్‌ఫెర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువగా వచ్చే ప్రమాదముందని గైనకాలజిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. వెస్ట్రన్ కల్చర్‌ని అడాప్ట్ చేసుకుంటూ.. అనారోగ్య సమస్యల పాలవుతున్నారని అంటున్నారు.
ఐటీ కారిడార్‌లో విపరీతంగా పెరుగిన ఫెర్టిలిటీ సెంటర్లు
ఒకప్పటితో పోలిస్తే.. ఇటీవలి కాలంలో ఐటీ కారిడార్‌లో ఫెర్టిలిటీ సెంటర్లు విపరీతంగా పెరుగుతున్నాయ్. మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మియాపూర్ ఏరియాల్లో.. అనేక ఫెర్టిలిటీ సెంటర్లు ఏర్పాటయ్యాయి. హాస్పిటల్స్‌లోనూ ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్ల ట్రీట్‌మెంట్‌పై స్పెషల్‌గా బోర్డులు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఫెర్టిలిటీ సెంటర్లకు వెళ్లే మహిళల సంఖ్య బాగా పెరిగిందని డాక్టర్లు చెబుతున్నారు. సంతానం విషయంలో చిన్న డౌట్ వచ్చినా సరే.. వెంటనే డాక్టర్లను సంప్రదిస్తున్నారు. అందుకనుగుణంగా.. ఫెర్టిలిటీ సెంటర్లు కూడా పెరిగిపోతున్నాయ్. కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా గైనకాలజిస్ట్‌లు, ఆండ్రాలజిస్ట్‌లతో సెపరేట్ సెంటర్లు ఏర్పాటు చేయడంపై ఫోకస్ పెట్టాయ్. ఇలా.. గతంతో పోలిస్తే హైదరాబాద్ సిటీలో ఒక్కో ఏరియాలో వందల సంఖ్యలో ఫెర్టిలిటీ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయ్.
జంగ్ ఫుడ్, ప్రోజెన్ ఫుడ్ నిద్రలేమి సమస్యలతో సంతానంపై ఇంపాక్ట్
ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం కూడా సంతానలేమి సమస్యలకు ప్రధాన కారణమని.. వైద్య నిపుణులు చెబుతున్నారు. 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లిళ్లు చేసుకోవడం, ఒబెసిటీ, బిగుతుగా ఉండే బట్టలు, స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ లాంటి కారణాలు.. సంతానలేమికి కారణాలుగా కనిపిస్తున్నాయ్ లైఫ్ స్టైల్‌లో వస్తున్న మార్పులు జంక్ ఫుడ్, ఫ్రోజెన్ ఫుడ్‌కి అలవాటు పడటం, నిద్రలేమి లాంటి సమస్యలన్నీ.. సంతానంపై ఇంపాక్ట్ చూపుతున్నాయ్. మహిళల్లో పీసీఓడీ, థైరాయిడ్, ఎగ్ కౌంట్ తక్కువగా ఉండటం ఇన్‌ఫెర్టిలిటీకి దారితీస్తోంది. దాంతో.. వివాహమై ఏళ్లు గడుస్తున్నా.. పిల్లలు లేక భార్యాభర్తలు ఇబ్బందులు పడుతూ ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయించి చికిత్స తీసుకుంటున్నారు.
ఇప్పుడంతా మెంటల్‌గా స్ట్రాంగ్ అయ్యాకే పెళ్లిళ్లు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చాలా మంది 30 ఏళ్లు దాటాకే వివాహం చేసుకుంటున్నారు. వీలైనంత త్వరగా తల్లిదండ్రులవ్వాలని ఆశపడుతున్నారు. కానీ.. మారుతున్న లైఫ్ స్టైల్‌తో.. ఇన్‌ఫెర్టిలిటీ బారిన పడుతున్నారు. అందువల్ల.. పెళ్లికి ముందే మగవారు సెమెన్ టెస్ట్, అమ్మాయిలు ఎగ్ కౌంట్ ఏ విధంగా ఉందో చూసుకుంటే బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.
మోడ్రన్ లైఫ్ స్టైల్‌లో మనుషుల జీవితాల్లో ఎన్నో మార్పులొస్తున్నాయ్. ఏళ్లు గడుస్తున్నకొద్దీ.. సంతానలేమి సమస్యలు పెరుగుతున్నాయ్. ఈ సమస్య ఇప్పుడు మహిళలతో పాటు మగాళ్లలోనూ కనిపిస్తోంది. మహిళల్లోనూ ఇన్‌ఫెర్టిలిటీ సమస్యలు పెరిగిపోతున్నాయ్. అసలు.. ఆడవాళ్లలో సంతానలేమి సమస్యలు ఎందుకు తలెత్తుతున్నాయ్? సరైన వయసులో పెళ్లి చేసుకోకపోతే.. ఇన్‌ఫెర్టిలిటీ ఇబ్బందులు తప్పవా? నేటి తరం అమ్మాయిలు తెలుసుకోవాల్సిందేమిటి?
ఆందోళనకరంగా పెరుగుతున్న సంతానలేమి సమస్యలు
సంతానం ప్రతి స్త్రీ జీవితంలో ఓ మధురమైన అనుభూతి. కానీ.. ఆధునిక జీవనశైలిలో వచ్చిన మార్పులు, పెరుగుతున్న ఒత్తిడి కారణంగా.. సంతానలేమి సమస్యలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయ్. కొన్ని చెడు వ్యసనాలు.. మహిళల సంతాన సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయ్. గర్భం దాల్చాలనే ఆశ ఉన్న ప్రతి అమ్మాయి.. తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయ్. మహిళల్లో సంతానలేమికి అత్యంత ప్రధానమైన కారణం వయస్సు. 30 ఏళ్ల తర్వాత మహిళల్లో అండాల సంఖ్య, నాణ్యత క్రమంగా తగ్గిపోతుంది. 35 ఏళ్లు దాటిన తర్వాత.. అండాల నాణ్యత వేగంగా క్షీణిస్తుంది. దీనివల్ల.. గర్భం దాల్చే అవకాశం తగ్గిపోవడమే కాదు.. గర్భస్రావాలు అయ్యే ప్రమాదం పెరుగుతుంది. చాలా మంది కెరీర్ కోసం, ఆర్థిక స్థిరత్వం కోసం.. గర్భదారణని వాయిదా వేస్తుంటారు. కానీ.. సంతానోత్పత్తికి సహజంగా అనుకూలమైన వయసు 25 ఏళ్ల నుంచి 30 ఏళ్లే అనే విషయం అంతా తెలుసుకోవాలి.
శరీరంలో కొవ్వు కణజాలంతో అధికంగా ఈస్ట్రోజెన్ ఉత్పత్తి
మహిళలు తీసుకునే ఆహారం కూడా సంతానోత్పత్తిపై ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా అవసరమైన విటమిన్లు, ఐరన్ సరిపోను లేకపోవడం అండం ఉత్పత్తి, నాణ్యతపై ప్రభావం చూపుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్స్, అధిక చక్కెర, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు.. శరీరంలో హర్మోన్ల సమతుల్యతని దెబ్బతీస్తుంది. శరీరంలో కొవ్వు కణజాలంతో.. అధికంగా ఈస్ట్రోజెన్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల.. అండోత్పత్తి ప్రక్రియ దెబ్బతిని గర్భం దాల్చడం కష్టమవుతుంది. తగినంత కొవ్వు నిల్వలు లేకపోతే.. శరీరం గర్భదారణకు అనుకూలంగా లేదని భావించి.. అండోత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల.. పోషకాహారం కచ్చితంగా తీసుకోవాలి. సంతానం కావాలని కోరుకునే మహిళలు కచ్చితంగా మానుకోవాల్సిన అలవాట్లు కొన్ని ఉన్నాయ్. సిగరెట్ స్మోకింగ్ వల్ల.. అండాశయాలు త్వరగా వృద్ధాప్యానికి గురవుతాయ్. ఇది.. ఎగ్ కౌంట్‌ని వేగంగా తగ్గిస్తుంది. సిగరెట్ అలవాటు ఉంటే.. మెనోపాజ్ దశకు మూడు నాలుగేళ్ల ముందే చేరుకునే అవకాశం ఉంది. అధికంగా మద్యం సేవిస్తే.. హార్మోన్లపై ఎఫెక్ట్ పడుతుంది. అండోత్పత్తి సరిగా జరగదు. గర్భం దాల్చినా.. గర్భస్రావం అయ్యే ప్రమాదం పెరుగుతుంది. రోజుకు 3 కప్పుల కాఫీ తాగినా.. ఇన్‌ఫెర్టిలిటీకి దారితీయొచ్చని కొన్ని రీసెర్చ్ రిపోర్ట్స్ సూచిస్తున్నాయ్.
ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ ఉత్పత్తి కార్టిసాల్ హార్మోన్ ప్రభావం
ఈ రోజుల్లో.. ప్రతి ఒక్కరిపై ఉద్యోగపరమైన ఒత్తిడి, కుటుంబపరమైన సమస్యలు పెరుగుతున్నాయి. హై ప్రెజర్.. కార్టిసాల్ అనే హార్మోన్‌ని పెంచుతుంది. ఇది గర్భధారణకు సహాయపడే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ ఉత్పత్తిని అణచివేస్తుంది. ఒత్తిడి అధికమైతే.. అది పీరియడ్స్‌ని ఆలస్యం చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల.. మెన్‌స్ట్రువల్ సైకిల్ అస్తవ్యస్తమవుతుంది. సరిగా నిద్రలేకపోవడం వల్ల.. సంతానోత్పత్తి హార్మోన్ల విడుదలలో అంతరాయం కలుగుతుంది. శరీరంలో.. పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్, థైరాయిడ్, ట్యూబల్ బ్లాకేజ్ లాంటి అంతర్గత ఆరోగ్య సమస్యలు కూడా సంతానలేమికి కారణమవుతాయ్. వీటిని గుర్తించి.. వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. పెళ్లిళ్లయి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు లేక బాధపడే భార్యాభర్తలెందరో ఉన్నారు. పిల్లల కోసం ఎందరో దేవుళ్లకు మొక్కుతారు. ఏవేవో పూజలు చేస్తుంటారు. ఆఖరికి.. దంపతులిద్దరూ ఫెర్టిలిటీ సెంటర్లనే ఆశ్రయిస్తున్నారు. ఇలా.. చికిత్స తీసుకునే జంటలు బాగా పెరిగాయ్.
దంపతుల ఆశలపై నీళ్లు చల్లుతున్న సంతానలేమి సమస్యలు
అబ్బాయిలు, అమ్మాయిల్లో.. పెళ్లి చేసుకోవాలనే కోరిక ఎంతుంటుందో.. పిల్లల్ని కనాలనే ఆశ కూడా అంతే ఉంటుంది. కానీ.. పెరుగుతున్న సంతానలేమి సమస్యలు వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నాయ్. అందువల్ల.. అమ్మాయిలు కాస్త తమ లైఫ్ స్టైల్ మార్చుకోవాలనే చర్చ మొదలైంది. సంతానోత్పత్తికి బయాలాజికల్ క్లాక్ అనేది.. స్త్రీ, పురుషులిద్దరికీ వర్తిస్తుంది. పెళ్లిళ్లు ఆలస్యం కావడం వల్ల.. సంతానలేమి సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా పెరుగుతాయ్. మహిళల్లో వయస్సుతో పాటు సంతానోత్పత్తి అవకాశాలు కూడా వేగంగా తగ్గిపోతున్నాయ్. మహిళలు 30 ఏళ్ల లోపు ఉంటే.. ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి నెలా సహజంగా గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయ్. అదే 30 ఏళ్లు దాటితే.. స్త్రీలలో సంతానోత్పత్తి రేటు తగ్గుముఖం పట్టడం మొదలవుతుంది. 35 ఏళ్ల తర్వాత సంతానోత్పత్తి రేటు మరింత వేగంగా పడిపోతుంది. ఎగ్ కౌంట్‌తో పాటు అండం నాణ్యత కూడా బాగా తగ్గుతుంది. గర్భస్రావం ప్రమాదం పెరుగుతుంది. 40 ఏళ్ల నాటికి గర్భం దాల్చే అవకాశం గణనీయంగా తగ్గిపోతుంది. 40 ఏళ్లు దాటితే సంతానలేమి సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, ఆలస్యంగా పిల్లల్ని కనడం ప్లాన్ చేస్తే.. పుట్టే పిల్లల్లో ఆటిజం, డౌన్స్ సిండ్రోమ్ లాంటి జన్యుపరమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
Also Read: గుడ్‌న్యూస్..! భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?
నేటి తరం యువతీ, యువకులు.. కెరీర్ ఫస్ట్ అనే ఆలోచనతో పెళ్లిళ్లు ఆలస్యం చేస్తున్నారు. ఇదే.. సంతానలేమి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. అందువల్ల.. అమ్మాయిలైతే.. 30 ఏళ్ల లోపే పెళ్లి చేసుకొని, పిల్లల్ని కంటే ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. 25 నుంచి 30 ఏళ్ల మధ్య పిల్లల్ని ప్లాన్ చేసుకోవడం మరీ మంచిదంటున్నారు. 35 ఏళ్లు దాటితే.. సంతానోత్పత్తి సామర్థ్యం బాగా తగ్గుతుంది. ఈరోజుల్లో దంపతులిద్దరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. జీవనశైలిలో మార్పులు చేసుకుని, సరైన వయస్సులో కుటుంబాన్ని ప్లాన్ చేసుకుంటే తప్ప.. సంతానం విషయంలో తలెత్తే సమస్యలని అధిగమించే అవకాశం లేదంటున్నారు వైద్య నిపుణులు.
Story By Anup, Bigtv