E-Paper
Advertisement

Karnataka Congress Crisis: సీఎం సీటు ఫైట్! మార్పు తప్పదా?

Karnataka Congress Crisis: సీఎం సీటు ఫైట్! మార్పు తప్పదా?
Advertisement

Karnataka Congress Crisis: సిద్ధ రామయ్య నేనే సీఎం అంటున్నారు. డీకే శివకుమార్ కూడా సిద్ధూనే సీఎం అని చెబుతున్నారు. అయినా సరే.. కర్ణాటకలో ఎక్కడో తేడా కొడుతోంది. లోలోపల ఏదో జరుగుతోంది. మొత్తంగా.. కర్ణాటక కాంగ్రెస్‌లో రాజకీయం కుతకుతలాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. రగులుతున్న ఈ రాజకీయ జ్వాలని.. అధిష్టానం ఎలా చల్లార్చబోతోంది. పవర్ షేరింగ్ విషయంలో షివర్ అవుతున్న పార్టీని.. ఎలా సెట్ చేయబోతోంది? సోనియా గాంధీనే కర్ణాటక సీన్‌లోకి దిగబోతున్నారా?

సీఎం కుర్చీ కోసం పెరిగిన రాజకీయ పోరు
ట్విస్ట్‌లు, టర్న్‌లు, సస్పెన్స్.. ఇలా ఆల్ మిక్స్ ఎంటర్‌టైనర్ ఉంది కర్ణాటక పొలిటికల్ డ్రామా. నాయకత్వం విషయంలో గందరగోళం, వారం రోజుల వరుస సమావేశాలు, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చేసిన రహస్య పోస్టుల మధ్య.. కర్ణాటక రాజకీయం పీక్‌కి చేరింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య.. సీఎం కుర్చీ కోసం పోరు పెరిగింది. ఈ ఇంట్రస్టింగ్ పొలిటికల్ ఎపిసోడ్‌.. ఇప్పుడు ఢిల్లీకి చేరింది. దాంతో.. కాంగ్రెస్ హైకమాండ్ తీర్పు ఎలా ఉండబోతోందనే దానిపై.. కర్ణాటకతో పాటు దేశ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. శక్తిమంతమైన వొక్కలిగ సామాజికవర్గానికి చెందిన డీకే శివకుమార్.. తన సహనం నశించిందంటూ.. రహస్య సంకేతాలిస్తున్నారు. మరోవైపు.. ఓబీసీ లీడర్ సిద్ధరామయ్య.. 2028 వరకు తానే సీఎంగా కొనసాగుతానని గట్టిగా చెబుతున్నారు.

Advertisement

ఢిల్లీ లెవెల్‌లో జోరుగా నడుస్తున్న లాబీయింగ్
ఈ పొలిటికల్ డ్రామా అంతా.. సిద్ధరామయ్య సర్కార్ తన ఐదేళ్ల పదవీకాలంలో.. సగం పూర్తి చేసుకోవడంతో మొదలైంది. సీఎం కుర్చీ కోసం.. సిద్ధరామయ్య, శివకుమార్ క్యాంప్‌ల నుంచి ఢిల్లీ లెవెల్‌లో లాబీయింగ్ జోరుగా నడుస్తోంది. డిప్యూటీ సీఎం డీకేకు విధేయులైన దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు.. ఆయనకు ముఖ్యమంత్రిగా పగ్గాలు అప్పజెప్పాలంటూ.. ఢిల్లీ వెళ్లడంతో ఈ ఇష్యూ మరింత హీటెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో.. రెండున్నరేళ్ల పాటు డీకే శివకుమార్‌ని.. సీఎంగా చేస్తామని కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చిన హామీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదానికి.. అదే ప్రధాన కారణమైంది. ఇలాంటి పరిస్థితుల్లో.. కర్ణాటక డ్రామా ఢిల్లీకి షిఫ్ట్ అయింది. దాంతో.. హైకమాండ్ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతోందనేది మోస్ట్ ఇంట్రస్టింగ్‌గా మారింది.

సీనియర్ నేతలో సమావేశం ఏర్పాటు చేస్తానన్న ఖర్గే
కర్ణాటక కాంగ్రెస్‌లో తలెత్తిన సమస్యని పరిష్కరించేందుకు.. రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, శివకుమార్ సహా సీనియర్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తానని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్పారు. మొత్తం హైకమాండ్ దీని గురించి చర్చించి.. ఈ గందరగోళానికి ముగింపు పలుకుతుందన్నారు. కానీ.. ఉన్నట్టుండి ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే.. డీకే శివకుమార్‌ను సీఎంగా అంగీకరించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని సిద్ధరామయ్య సన్నిహితుడు, హోంమంత్రి పరమేశ్వర చెప్పారు. ఇది చూశాక.. సిద్ధరామయ్య క్యాంపులో చీలిక ఏర్పడినట్లు కనిపిస్తోంది. సిద్ధూ శిబిరానికి చెందిన మరో నాయకుడు జమీర్ అహ్మద్ ఖాన్.. 2028 వరకు సీఎం సీటు ఖాళీగా లేదన్నారు. ఇదిలా ఉంటే.. డీకే శివకుమార్ తన అసహనానికి సంబంధించి హింట్స్ వదులుతున్నారు. మొదట.. తన ట్విట్టర్ అకౌంట్‌లో ఓ సీక్రెట్ సందేశాన్ని పోస్ట్ చేశాడు. వర్డ్ పవర్ ఈజ్ వరల్డ్ పవర్ అని ట్వీట్ చేశారు. ప్రపంచంలో అతిపెద్ద శక్తి.. ఒకరికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం అన్నారు. తర్వాత.. అలాంటిదేమీ తాను పోస్ట్ చేయలేదని ఖండించారు.

Advertisement

ఐదారుగురు వ్యక్తుల మధ్య సీక్రెట్ అగ్రిమెంట్ అన్న డీకే
డీకే శివకుమార్.. కాంగ్రెస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం మాత్రమే కాదు.. స్టేట్ కాంగ్రెస్ చీఫ్ కూడా. ఆయనే.. గతంలో ఓ సందర్భంలో మాట్లాడుతూ.. అధికారాన్ని పంచుకునే అంశంపై జరిగిన రహస్య ఒప్పందం గురించి.. పార్టీలో ఐదారు మందికి మాత్రమే తెలుసన్నారు. తనని సీఎంని చేయమని అడగలేదని.. ఇది తమలో ఐదారుగురు వ్యక్తుల మధ్య జరిగిన సీక్రెట్ అగ్రిమెంట్ అని అన్నారు. అయితే.. కర్ణాటక కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన వ్యూహకర్త డీకే.. ఒక్కొక్కటిగా తన ఎత్తుగడలన్నింటిని వేస్తున్నాడు. ఇటీవలే.. సిద్ధరామయ్య క్యాంప్‌లో ఉన్న సతీష్ జార్కిహోళితో అర్ధరాత్రి సమావేశం నిర్వహించారు.

సిద్ధ రామయ్యని విడిచిపెట్టేది లేదన్న సతీష్ జార్కిహోళి
అయితే.. తాను సిద్ధరామయ్యని విడిచిపెట్టేది లేదనే విషయం సతీష్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ ఏమిటంటే.. ఇటీవలే బెంగళూరుకు వచ్చిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గేని.. డీకే శివకుమార్ కలవలేదు. కానీ.. ఖర్గే.. సిద్ధరామయ్యతో గంటపాటు భేటీ అయ్యారు. ఈ పవర్ ప్లే మధ్య.. ఇద్దరు నాయకులు.. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలకు సమయం ఆసన్నమైందనే బీజేపీ వాదనలని తోసిపుచ్చుతూ.. 140 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఐక్యంగానే ఉన్నారని స్పష్టం చేశారు.

నాయకత్వ మార్పుపై నిర్ణయం తీసుకోవాలంటున్న డీకే
మరోవైపు.. తనకు నమ్మకమైన ఎమ్మెల్యేలతో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్న సిద్ధరామయ్య, తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఒత్తిడి తెస్తున్నారు. ఇది తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు.. ఆయన చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తోంది. అయితే.. డీకే శివకుమార్ మాత్రం పార్టీ అధిష్టానం ముందుగా నాయకత్వ మార్పుకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నారు. అయితే.. కాంగ్రెస్ నాయకత్వం మద్దతు పొందిన సిద్ధరామయ్య.. ఎస్సీ, ఎస్టీ, ముస్లింపు, ఓబీసీ ఓటర్ల నుంచి ఎంతో మద్దతు పొందిన ప్రజా నాయకుడిగా కనిపిస్తున్నారు. డీకే శివకుమార్.. తన వ్యక్తిగత సామర్థ్యాలు, ఎన్నికల నిర్వహణ, వ్యూహాలు, రాజకీయ చతురత, ట్రబుల్ షూటర్‌గా పాపులర్ అయ్యారు. కర్ణాటకలో ఇప్పటికిప్పుడు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభం తలెత్తడానికి ప్రధాన కారణం.. రెండున్నరేళ్ల ఫార్ములా. ఇటీవలే.. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రెండింటిలోనూ.. కాంగ్రెస్ ఈ చిక్కుని ఎదుర్కొంది. ఆ రెండు ఎన్నికల్లోనూ అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు.. కర్ణాటక విషయంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది ఆసక్తి రేపుతోంది. డెసిషన్ ఎలాంటిదైనా.. డిసెంబర్ 1 లోపే వెలువడే అవకాశం ఉంది.

కర్ణాటకలో పవర్ షేరింగ్ గురించి.. పార్టీలో మొదలైన షివరింగ్ చూశాక.. అందరికీ అనిపిస్తున్నదొక్కటే! కాంగ్రెస్ ఎప్పుడూ ఇంతేనని! దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కేవలం మూడే మూడు. అందులో.. పెద్ద స్టేట్ కర్ణాటకనే. అక్కడ.. ఇలాంటొక పొలిటికల్ క్రైసిస్ రాకుండా చూడటమే అధిష్టానం పని. కానీ.. అది కుదరలేదు. రాజకీయ సంక్షోభం మొదలైంది. దీనిని.. వీలైనంత త్వరగా సెటిల్ చేయకపోతే.. అది కాంగ్రెస్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడం ఖాయమా? కర్ణాటకలో మొదలైన ఈ సెగ.. ఢిల్లీని కూడా తాకుతుందా? హైకమాండ్ తేరుకోకుండా.. ఊరుకుంటే.. హస్తం పార్టీ అస్తవ్యస్తమవడం ఖాయమా?

కాంగ్రెస్ భవిష్యత్తుపై ప్రభావం చూపే అధిష్టానం తీరు
కర్ణాటక కాంగ్రెస్‌లో.. ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన పవర్ షేరింగ్ కాంట్రవర్సీ.. ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. భారత్‌లోని అతిపెద్ద రాష్ట్రాల్లో.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న అరుదైన రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. ఈ క్రమంలో.. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంపై అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు.. కాంగ్రెస్ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయ్. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. అధికారం కాంగ్రెస్‌దేనని తేలాక.. సీఎం సీటు విషయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య అప్పట్లో తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో.. హైకమాండ్ ఓ పవర్ షేరింగ్ ఫార్ములాని తెరపైకి తెచ్చిందని.. దాని ప్రకారం మొదటి రెండున్నరేళ్ల పాటు సిద్ధరామయ్య సీఎంగా ఉంటారని, ఆ తర్వాత.. డీకే శివకుమార్ సీఎం పగ్గాలు చేపడతారనే ప్రచారం జరిగింది.

నాయకత్వ మార్పు కోసం అధిష్టానంపై ఒత్తిడి
ఇప్పుడు.. సిద్ధరామయ్య సీఎంగా రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న క్రమంలో.. ముందుగా కుదిరిన రహస్య ఒప్పందం ప్రకారం.. డీకే శివకుమార్ వర్గం.. నాయకత్వ మార్పు కోసం అధిష్టానంపై ఒత్తిడి పెంచుతోంది. అయితే.. సీఎం సిద్ధరామయ్య మాత్రం తాను ఐదేళ్ల పాటు సీఎంగా ఉంటానని చెబుతూనే.. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేస్తున్నారు. అయితే.. ఈ సంక్షోభం నుంచి కాంగ్రెస్ పార్టీని బయటపడేసేందుకు.. అధిష్టానం వెంటనే జోక్యం చేసుకోవాలనే డిమాండ్ కార్యకర్తల్లో బలంగా వినిపిస్తోంది.

బెంగళూరులో ఐటీ కార్యకలాపాలు తగ్గాయనే చర్చ
ఇప్పటికే.. కర్ణాటకలో పరిస్థితులు బాలేవు. ఐటీ క్యాపిటల్‌గా భావించే బెంగళూరులో.. కాంగ్రెస్ హయాంలో ఐటీ సంబంధిత కార్యకలాపాలు తగ్గాయనే చర్చ జరుగుతోంది. ఈ ఎఫెక్ట్ క్రమంగా.. సర్కార్ మీద పడుతుంది. తర్వాత.. అది నేరుగా ఢిల్లీకి రిఫ్లెక్ట్ అవుతుంది. కర్ణాటక ప్రభుత్వంలో పదవుల కోసం ఈ కుమ్ములాటలు, పార్టీలో అంతర్గత పోరు, ప్రభుత్వంలో సఖ్యతో లేకపోవడం లాంటి అంశాలన్నీ.. రాష్ట్ర భవిష్యత్తుని ప్రభావితం చేస్తాయనే చర్చ ఉంది. అదే జరిగితే.. కాంగ్రెస్ హయాంలో కర్ణాటకలో అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. ఇక్కడ జరిగే డ్యామేజ్.. ఇండియా లెవెల్లో కాంగ్రెస్ ఇమేజ్‌ని దెబ్బకొడుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. పైగా.. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు మూడే. అందులో.. పెద్ద రాష్ట్రం కర్ణాటకనే. అందువల్ల..

పరిపాలన స్థిరంగా లేదనే భావన ప్రజల్లోకి వెళితే?
ఇప్పుడు తలెత్తిన సంక్షోభంలో.. అంతర్గత విభేదాలను పరిష్కరించుకోలేకపోతే.. అది పార్టీకి నష్టం చేయడం ఖాయమంటున్నారు. ఇప్పటికే.. ఈ నాయకత్వ మార్పుతో మొదలైన పోరు వల్ల.. మంత్రులు, ఎమ్మెల్యేల్లో గందరగోళం నెలకొంది. ఇది.. ప్రభుత్వ పాలన, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రభావం చూపుతుంది. పరిపాలన స్థిరంగా లేదనే భావన ప్రజల్లోకి వెళితే.. అది భవిష్యత్తుల్లో కాంగ్రెస్‌కు నష్టం కలిగిస్తుంది. ప్రతిపక్ష బీజేపీకి ఈ అంతర్గత కుమ్ములాటలు ఓ బలమైన ఆయుధంగా మారాయి. స్థిరమైన పాలన ఇవ్వలేని పార్టీగా.. కాంగ్రెస్‌ని విమర్శిస్తున్నారు. త్వరలోనే ఉపఎన్నికలు వస్తాయనే కామెంట్లు చేయడమే బిగ్ ఎగ్జాంపుల్. మెజారిటీతో అధికారంలోకి వచ్చినా.. సిద్ధరామయ్య, డీకేఎస్ మధ్య మొదలైన ఈ పవర్ షేరింగ్ పోరుకు.. అధిష్టానం గనక వెంటనే చెక్ పెట్టకపోతే.. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌పై పెట్టుకున్న విశ్వాసం సన్నగిల్లిపోతుంది. కాంగ్రెస్ ఉంటే.. ఎప్పుడూ ఇంతేనన్న నిర్వేదం వారిలో తలెత్తే అవకాశం ఉంది.

కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా కర్ణాటక ఇష్యూ
ఇప్పటికే.. కర్ణాటకలో రాజుకున్న రాజకీయ వేడి తాలూకూ సెగ.. ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్‌ని తాకింది. ఇది.. అధిష్టానానికి కూడా పెద్ద తలనొప్పిగా మారింది. సంక్షోభం మొదలై వారంపైనే అవుతున్నా.. దీనిని వెంటనే సెటిల్ చేయడంలో హైకమాండ్ ఆలస్యం చేస్తంది. క్లియర్ స్టాండ్ లేకపోవడం వల్లే.. డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు నేరుగా ఢిల్లీకి వెళ్లి ఒత్తిడి చేసే పరిస్థితులొచ్చాయ్. ఇది.. పార్టీలో హైకమాండ్ పట్టు కోల్పోయిందనే సంకేతాన్ని పంపింది. అంతేకాదు.. కర్ణాటకకు చెందిన కొందరు నాయకులు.. జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న మల్లికార్జున ఖర్గే.. కర్ణాటకకు చెందిన నేతే కావడంతో.. ఇష్యూ మరింత చర్చనీయాంశమవుతోంది. అట్లాంటి రాష్ట్రంలో.. ఇట్లాంటి సంక్షోభం నెలకొంటే.. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ నాయకత్వంపై అనేక ప్రశ్నలు తలెత్తే చాన్స్ ఉంది. ఇలాంటి అంతర్గత విభేదాల కారణంగానే.. గతంలో వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. కర్ణాటక సంక్షోభంపై హైకమాండ్ వెంటనే ఏదో ఒకటి తేల్చకపోతే.. హస్తం పార్టీ అస్తవ్యస్తమవడం ఖాయమనే వాదన వినిపిస్తోంది.

Also Read: ఢిల్లీలో పెరుగుతున్న గాలి కాలుష్యం.. వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు..

కర్ణాటక రాజకీయ సంక్షోభం.. కేవలం కర్ణాటక కాంగ్రెస్‌కి సంబంధించిన సమస్య కాదు. ఇండియా లెవెల్లో.. పార్టీ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశం. పవర్ షేరింగ్ విషయంలో.. అధిష్టానం తక్షణమే స్పష్టమైన, కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. పవర్ షేరింగ్ ఫార్ములా ఉందా? లేదా? అనే విషయంపై ఉన్న గందరగోళాన్ని తొలగించాలి. నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు.. ఒక బలమైన సందేశాన్ని ఇవ్వగలిగితేనే కాంగ్రెస్ తన ఇమేజ్‌ని కాపాడుకోగలదు. లేకపోతే.. అంతర్గత కలహాలతో చెదిరిపోయే పార్టీగా మరోసారి ముద్ర వేసుకొని.. ప్రత్యర్థులకు మరింత బలం చేకూరేందుకు కారణమవుతుంది.

Story By Anup, Bigtv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×