E-Paper
Advertisement

F-35 Crash: రాడర్లకే దొరకదు అనుకున్నారు.. ఇరాన్ ఇచ్చి పడేసింది, అమెరికా F-35 కథ క్లోజ్?

F-35 Crash: రాడర్లకే దొరకదు అనుకున్నారు.. ఇరాన్ ఇచ్చి పడేసింది, అమెరికా F-35 కథ క్లోజ్?
Advertisement

F-35 Crash: యుద్ధమంటే.. శత్రువును దెబ్బకొట్టడమే కాదు. అప్పుడప్పుడు ఊహించని ఎదురుదెబ్బలు కూడా తగులుతుంటాయ్. ఈ ఎదురుదెబ్బలు సమఉజ్జీలు కొట్టినప్పుడు పెద్దగా ఏమీ అనిపించదు. కానీ, తమ స్థాయిలో లేని దేశాలు, తమకంటే తక్కువ టెక్నాలజీ, ఆయుధ సంపత్తి ఉన్న దేశాలు కొట్టిన దెబ్బ నుంచి కోలుకోవడం కష్టమే. ముఖ్యంగా.. అమెరికా లాంటి దేశానికి.. ఇది చాలా ఘోర పరాభవం. ఎస్.. ఇరాన్ అదే చేసి చూపించింది. అమెరికాకు చెందిన మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్టెల్త్ ఫైటర్ జెట్ అయిన.. ఎఫ్-35ని ఇరాన్ కూల్చేసింది. ఇప్పటివరకు యుద్ధాల్లో.. ఎఫ్-35 దాని మొత్తం ఆపరేషనల్ హిస్టరీలో.. ఎప్పుడూ దెబ్బతినలేదు. కానీ, తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తో ఇరగదీసింది. అమెరికాకు ఇచ్చిపడేసింది.

ప్రపంచాన్ని కుదిపేసిన సంఘటన

అమెరికా దాడుల్లో.. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ ధ్వంసమయ్యాయని ప్రెసిడెంట్ ట్రంప్ గొప్పగా చెప్పారు. కానీ.. ఇప్పుడవే డిఫెన్స్ సిస్టమ్స్.. ఎఫ్-35 లాంటి అధునాతన స్టెల్త్ ఫైటర్ జెట్‌ని కూల్చాయ్. ఇరాన్ రక్షణ సామర్థ్యాలను నాశనం చేశామని, అమెరికా గొప్పలు చెప్పుకుంటన్న టైమ్‌లో.. యుద్ధంలో ఇదో కీలక ఘట్టంగా మారింది. ఎఫ్-35 ఫైటర్ జెట్‌ని కూల్చామని ఇరాన్ వీడియో రుజువులతో చెబుతున్నా.. అమెరికా మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేదు. ఆ యుద్ధ విమానం.. మిడిల్ ఈస్ట్‌లోని ఓ స్థావరంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది చెబుతోంది. కానీ, ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ మీదుగా వెళ్తున్నప్పుడు, రెండో ఎఫ్-35 జెట్ కూల్చేసినట్లు సమాచారం. కానీ, ఇదొక ముఖ్యమైన ప్రశ్నని లేవనెత్తుతోంది. బలహీనపడిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కలిగిన ఇరాన్.. ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన, ఖరీదైన విమానాల్లో ఒకటైన.. అమెరికా ఫైటర్ జెట్‌ని ఎలా కూల్చేసింది? అనే చర్చ.. గ్లోబ్ మొత్తం నడుస్తోంది.

ట్రంప్ మాటలకు షాక్

Advertisement

ఈ మధ్యే ప్రెసిడెంట్ ట్రంప్ ఓ మాట అన్నారు. ఇరాన్‌లో తమ యుద్ధ విమానాలు నచ్చిన చోట తిరుగుతున్నాయని, నచ్చినప్పుడు టేకాఫ్ అవుతున్నాయని, వాటిని ఎవరూ కాల్చడం లేదని గొప్పగా చెప్పుకున్నాయ్. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ న్యూట్రల్ చేశామని అమెరికా చెప్పింది. కానీ.. రాడార్లకు కూడా చిక్కకుండా ఉండేలా డిజైన్ చేసిన స్టెల్త్ ఫైటర్ జెట్ ఎఫ్-35 జెట్‌పై.. ఇరాన్ దాడి చేయడం, కూల్చడం జరిగాయ్. అమెరికా నుంచి ఓ ప్రకటన రాకముందే, 100 మిలియన్ డాలర్లకు పైగా ఖరీదు చేసే అమెరికా జెట్‌ని కూల్చిన ఫుటేజ్‌ని రిలీ చేయడం, కూల్చింది తామేనని క్లెయిమ్ చేయడం.. అమెరికాకు ఘోర పరాభవాన్ని మిగిల్చింది.

అమెరికా ప్రతిష్టకు దెబ్బా?

దాంతో.. యుద్ధంలో ఇదొక కీలక ఘట్టమనే వాదనలు వినిపిస్తున్నాయ్. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. సుమారు 15 దేశాలు వివిధ వెర్షన్ల ఎఫ్-35 యుద్ధ విమానాన్ని ఉపయోగిస్తున్నాయ్. గతేడాది.. ప్రధాని మోడీ వైట్ హౌజ్‌ని సందర్శించినప్పుడు, ప్రెసిడెంట్ ట్రంప్.. ఎఫ్-35ని ఇండియాకు కూడా ఆఫర్ చేశారు. కానీ, భారత్ దీనిపై ఎలాంటి ఆసక్తి చూపలేదు. కానీ, ఎఫ్-35 యుద్ధ విమానం.. అమెరికా ఏరోస్పేస్ సామర్థ్యానికి శిఖరం లాంటిది. ఇది.. ట్రిలియన్ డాలర్ల ప్రోగ్రామ్ నుంచి బయటకొచ్చిన గ్రేట్ ప్రొడక్ట్. కానీ, యుద్ధంలో పూర్తిగా నాశనమైన ఇరాన్.. ఈ అడ్వాన్స్‌డ్ ఫైట్ జెట్‌కి కూడా కొన్ని బలహీనతలు, లోపాలు ఉన్నాయని.. ప్రపంచం మొత్తం తెలిసేలా చూపించింది.

స్టెల్త్ జెట్ ఎలా పట్టుబడింది? అసలు సీక్రెట్ ఇదే!

Advertisement

రాడార్ల నుంచి తప్పించుకునేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ స్టెల్త్ ఫైటర్ జెట్ ఎలా దెబ్బతిందనేదే.. అందరిలోనూ మెదులుతున్న డౌట్. కానీ.. స్టెల్త్ టెక్నాలజీ అనేది ఉత్తిదే అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. ఈ యుద్ధ విమానం రాడార్‌కు కనిపించదని అమెరికా చెప్పినా.. అది పట్టుబడేందుకు ఇంకొన్ని మార్గాలున్నాయంటున్నారు. అందులో, ఒకటి హీట్. ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్స్ కూల్చడానికి.. మేజర్ రీజన్ అదే అంటున్నారు. జెట్ హీట్‌ని గుర్తించాక.. ఇన్‌ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాక్ వ్యవస్థని ఉపయోగించి టార్గెట్ చేసి ఉండొచ్చంటున్నారు. ఇది చాలా కీలక విషయం.

గ్లోబల్ డిఫెన్స్‌లో కొత్త చాప్టర్!

ఎఫ్-35 రాడార్‌కు కనిపించకపోయినా, ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రమ్‌కు ఈజీగా దొరికిపోయే అవకాశం ఉందని అర్థమవుతోంది. అడ్వాన్స్‌డ్ ఫైటర్ జెట్లు చాలా వేడిని ఉత్పత్తి చేస్తాయ్. ఎఫ్-35 కూడా విపరీతమైన వేడిని పుట్టించే ఇంజిన్ ఉన్న యుద్ధ విమానం. IRST సిస్టమ్స్.. ఈ వేడిని గ్రహించి, రాడార్‌ని వాడకుండానే విమానాన్ని ట్రాక్ చేయగలవు. ఇరాన్‌లోనూ బహుశా ఇదే జరిగి ఉంటుందంటున్నారు. ఏదేమైనా.. భూమిపై అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల్లో ఒకటైన ఇరాన్.. అమెరికా ఎఫ్-35ని గుర్తించి, దాన్ని గురిపెట్టి కూల్చేయడం సంచలనంగా మారింది. ఈ దెబ్బతో.. ప్రపంచం మారిందనే విషయం చాలా మందికి ఇప్పుడిప్పుడే అర్థమవుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

అగ్రరాజ్యం అమెరికాకు షాక్

అమెరికా రక్షణ రంగానికి తలమానికం, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆయుధ వ్యవస్థ, శత్రువుల రాడార్లకు చిక్కని అదృశ్య యోధుడు లాంటి ఎలివేషన్లు.. ఎఫ్-35 లైట్నింగ్‌ ఫైటర్ జెట్‌కి ఉన్నాయ్. అలాంటి.. యుద్ధ విమానాన్ని ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చేసిందనే వార్త.. పెను సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్ లాంటి దేశం ఈ ఘనత సాధించడం అగ్రరాజ్యం అమెరికాకు అస్సలు మింగుడుపడటం లేదు. దీని నుంచి.. యూఎస్ ఇప్పట్లో కోలుకోవడం కష్టమనే అంటున్నారు.

ఎఫ్-35 విమానం కూలిపోతే ఇంత చర్చ ఎందుకు?

ఒక్క ఎఫ్-35 యుద్ధ విమానం కూలిపోతే.. ఇంత చర్చ ఎందుకు జరుగుతుందో తెలియాలంటే.. దానికున్న క్రేజ్ ఏంటో తెలియాలి. అమెరికాలోని లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ రూపొందించిన ఈ విమానం, కేవలం ఓ ఫైటర్ జెట్ మాత్రమే కాదు. ఓ ఫ్లయింగ్ మాన్‌స్టర్. దీని ఆకారం, దానిపై వాడే పెయింట్ వల్ల, శత్రువుల రాడార్లకు ఇదొక చిన్న పక్షిలా కనిపిస్తుంది తప్ప, యుద్ధ విమానంలా గుర్తుపట్టడం అసాధ్యం. ఇందులో ఉన్న స్టెల్త్ టెక్నాలజీ వల్ల.. ఎఫ్-35 శత్రు రాడార్లకు చిక్కదనే పేరుంది. అంతేకాదు.. సెన్సార్ ఫ్యూజన్ టెక్నాలజీ వల్ల.. పైలట్‌కు యుద్ధ రంగంలో ఏం జరుగుతుందో.. 360 డిగ్రీల కోణంలో సమాచారాన్నిస్తుంది. ఇది.. మల్టీరోల్ ఫైటర్ జెట్. ఎయిర్ టు ఎయిర్ కాంబాట్‌లోనూ, ఎయిర్ టు గ్రౌండ్ టార్గెట్లను కూడా ఛేదించగలదు. ఇలాంటి.. మోస్ట్ అడ్వాన్స్‌డ్ ఫైటర్ జెట్‌ని.. యుద్ధంలో ఇరాన్ కూల్చేసిందనే వార్త అమెరికా రక్షణ రంగ నిపుణులను షాక్‌కి గురిచేస్తోంది. మొత్తం ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది.

అత్యాధునిక టెక్నాలజీకి ఇరాన్ సవాల్

కోట్లాది డాలర్లు ఖర్చు చేసి తయారు చేసిన స్టెల్త్ టెక్నాలజీని, ఇరాన్ ఎలా కనిపెట్టింది? శత్రు లక్ష్యాలను దెబ్బతీయడం తప్ప, కూలిపోవడం తెలియని ఎఫ్-35ని.. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎలా పడగొట్టాయనేదే ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. అయితే, యుద్ధరంగంలో ఆయుధాల కంటే, వాటి బ్రాండ్ వాల్యూ, నమ్మకం చాలా ముఖ్యం. ప్రపంచ దేశాలన్నీ తమ రక్షణ కోసం అమెరికా నుంచి ఎఫ్-35 విమానాలను కొనుగోలు చేసేందుకు క్యూ కడుతుంటాయ్. కానీ, ఇప్పుడు ఇరాన్‌ని ఓ అత్యల్ప దేశమని భావించే అమెరికా యుద్ధ విమానాన్నే కూల్చేయడంతో.. యుద్ధ రంగంలో లెక్కే మారిపోయింది. ఇది, అమెరికా ఆయుధాల మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు.

ప్రపంచ శక్తుల సమీకరణల్లో షాక్!

అమెరికా ఎఫ్-35ని.. ఇరాన్ కూల్చేసిందనే వార్తతో.. ప్రపంచ దేశాల వాదనలు రెండుగా చీలిపోయాయ్. అమెరికా అనుకూల దేశాలు.. ఇదంతా టెక్నాలజీ లోపంతో జరిగిన ప్రమాదం కావొచ్చని, పైలట్ తప్పిదం కావొచ్చని అంటున్నారు. కొందరైతే.. ఎఫ్-35ని ఇరాన్ కూల్చిందనే వార్తలో.. వాస్తవం లేదని వాదిస్తున్నారు. యూఎస్ వ్యతిరేక వర్గం మాత్రం.. అమెరికా అజేయమనేది.. ఓ భ్రమ మాత్రమేనని, అత్యాధునిక టెక్నాలజీని కూడా సామాన్య పద్ధతులతో ఎదుర్కోవచ్చని ఇరాన్ నిరూపించిందని చెబుతున్నారు. నిజానికి, ఎఫ్-35 కూలిపోవడం అనేది, కేవలం ఓ యుద్ధ విమానం కోల్పోవడం కాదు. అమెరికా సైనిక, ఆయుధ ఆధిపత్యంపై జరిగిన దాడిగా దీనిని చూడాల్సి ఉంటుంది. ఇన్నాళ్లూ.. తమనెవరూ తాకలేరన్న అహంకారానికి ఇదొక చెక్ అని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఘటన తర్వాత.. రాబోయే రోజుల్లో ప్రపంచంలో యుద్ధ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశాలున్నాయ్.

ఎఫ్-35 కూల్పు కొత్త సమస్యలు సృష్టిస్తోంది

ఇరాన్ గతంలో అమెరికన్ MQ-9 రీపర్ డ్రోన్లని టార్గెట్ చేసేందుకు.. 358 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిసైల్‌ని వాడింది. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా 12కి పైగా MQ-9 రీపర్ డ్రోన్‌లను కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు.. ఎఫ్-35ని ఇరాన్ కూల్చిన ఘటన.. యుద్ధంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేదే ఇప్పుడు మేజర్ ఇష్యూ. 3 వారాల పోరాటం తర్వాత.. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని పూర్తిగా నాశనం చేశామని అమెరికా, ఇజ్రాయెల్ చెబుతున్నాయ్. అమెరికా కూడా స్టెల్త్ టెక్నాలజీ లేని బీ1, బీ2 బాంబర్లను మోహరించింది. శత్రుదేశం గగనతలంపై అమెరికాకు ఆధిపత్యం ఉందని నిర్ధారణ అయినప్పుడు మాత్రమే వీటిని మోహరిస్తారు. అయితే, ఎఫ్-35 జెట్‌ని కూల్చేసిన ఘటన, ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్స్.. ఇంకా సమర్థవంతంగానే పనిచేస్తున్నాయని సూచిస్తోంది. ఇది.. ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా తమ ఆపరేషన్‌ని రివ్యూ చేసుకునేలా ప్రెజర్ పెంచుతోంది. ఇరాన్ రక్షణ వ్యవస్థను గుర్తించేందుకు, అమెరికా, ఇజ్రాయెల్ ఇంకా చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే.. యుద్ధంలో ఇదో కీలక మలుపుగా కనిపిస్తోంది. కూలింది.. ఒక్క యుద్ధ విమానమే కావొచ్చు. కానీ, యుద్ధంపై.. దీని ప్రభావం చాలా ఉంటుంది.

Also Read:  మీ జేబు ఖాళీ అవ్వకముందే ఇది చదవండి.. యుద్ధం తెస్తున్న ధరల సునామీ

Story by: Anup, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×