E-Paper
Advertisement

Fuel Crisis: మీ జేబు ఖాళీ అవ్వకముందే ఇది చదవండి.. యుద్ధం తెస్తున్న ధరల సునామీ

Fuel Crisis: మీ జేబు ఖాళీ అవ్వకముందే ఇది చదవండి.. యుద్ధం తెస్తున్న ధరల సునామీ
Advertisement

Fuel Crisis: ఇండియాపై యుద్ధం తాలూకూ ఎఫెక్ట్ మొదలై చాలా రోజులవుతోంది. అక్కడెక్కడో మిడిల్‌‌ఈస్ట్‌లో వేల కిలోమీటర్ల దూరంలో యుద్ధం జరుగుతున్నా.. దాని సెగ మాత్రం నేరుగా మన జేబులకు తగులుతోంది. ఇప్పటికే.. యుద్ధం మొదలైన మొదటి వారంలోనే డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర 60 రూపాయలు పెరిగింది. కమర్షియల్ సిలిండర్ల ధర అయితే, ఏకంగా 115 రూపాయలు పెరిగింది. ఇప్పటికే.. గ్యాస్ సిలిండర్ కొరత రూపంలో సామాన్య భారతీయుల వంటిళ్లపై తీవ్ర ప్రభావం మొదలైంది. యుద్ధం మొదలైన కొద్ది రోజుల్లోనే సిలిండర్ ధరలు పెరగడం, ఇప్పుడు పెట్రోల్ వంతు రావడం, దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.

భారత్‌లో పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు

ఫిబ్రవరి చివర్లో మొదలైన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌ని అతలాకుతలం చేసేసింది. చమురు సప్లై చైన్ దెబ్బతినడంతో ఇండియాపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇంధన కొరత తీవ్రమవుతున్న క్రమంలో.. ఆయిల్ కంపెనీలు వాత పెట్టడం మొదలుపెట్టాయ్. ప్రీమియం పెట్రోల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయ్. స్పీడ్, పవర్ పెట్రోల్‌పై లీటరుకు 2 రూపాయలు పెంచాయ్. ప్రాంతాన్ని బట్టి.. లీటరుకు 2 రూపాయల నుంచి 2 రూపాయల 35 పైసలు పెంచారు.

Advertisement

రోజురోజుకు ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రమవుతున్న క్రమంలో.. ఏదో ఒక రోజు కచ్చితంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే అంచనాలున్నాయ్. దీనిని నిజం చేస్తూ.. ఆయిల్ కంపెనీలు ప్రీమియం పెట్రోల్ రేట్లు పెంచేశాయ్. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 115 డాలర్లు దాటింది. ఆ భారాన్ని తగ్గించుకునేందుకు.. ఆయిల్ కంపెనీలు ఇలా రేట్లు పెంచినట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతానికి సాధారణ పెట్రోల్ ధరలను పెంచకపోవడమే పెద్ద ఉపశమనంగా కనిపిస్తోంది. కానీ, ప్రీమియం పెట్రోల్ ధరలు పెరిగిన క్రమంలో.. ఇతర ఇంధన రేట్లని కూడా పెంచుతారనే ఆందోళనలున్నాయ్. ఇప్పటికే, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు పెరగడంతో.. విమాన టికెట్ల ధరలు కూడా పెరిగాయ్.

చమురు ధరలు పెరిగితే… మీ జేబుపై ఎంత భారం?

3 వారాలుగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర బ్యారెల్‌ 120 డాలర్లు దాటిపోయింది. అయినప్పటికీ, కేంద్రం ధరలను కొంతవరకు నియంత్రించినా.. పవర్ పెట్రోల్ ధరలు అప్పుడే పెరగడం సామాన్యుల్లో గుబులు రేపుతోంది. యుద్ధ భయంతో విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గడంతో.. రూపాయి విలువ రికార్డు స్థాయిలో 93 రూపాయలకు పడిపోయింది. రూపాయి పడిపోతే, మనం దిగుమతి చేసుకునే ప్రతి లీటర్ చమురుకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. పశ్చిమాసియాలో యుద్ధం ఇలాగే కొనసాగితే, భారతీయుల పర్సులకు భారీ చిల్లు పడటం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే.. రవాణా ఛార్జీలు పెరుగుతాయ్. అప్పుడు.. కూరగాయలు, నిత్యవసర వస్తువుల రవాణా భారమై.. వాటి ధరలు కూడా ఆకాశాన్ని తాకుతాయంటున్నారు. ముడి చమురు ధర పది శాతం పెరిగితే.. దేశంలో ద్రవ్యోల్బణం 0.2 శాతం పెరుగుతుందనే అంచనాలున్నాయ్. దీనివల్ల.. మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులవుతుంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ ప్రభావం

Advertisement

యుద్ధం అనేది కేవలం సరిహద్దులకే పరిమితం కాదని, అది ఎక్కడ మొదలైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాడి చేస్తుందని.. అందరికీ ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. పశ్చిమాసియాలో శాంతి నెలకొనకపోతే, భారతీయులకు ధరల యుద్ధం తప్పేలా కనిపించడం లేదు. ప్రస్తుతానికి రష్యా నుంచి వస్తున్న చమురు భారత్‌కు కొంత ఊరటనిచ్చే విషయమే అయినప్పటికీ, భారత్ దగ్గరున్న ఆయిల్ నిల్వలు ఎంతకాలం వరకు కాపాడతాయనేదే.. బిగ్ క్వశ్చన్. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా.. సామాన్యులపై భారం పడకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.

సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్!

ముందు సిలిండర్ పెరిగింది.. ఇప్పుడు పవర్ పెట్రోల్ పెరిగింది.. యుద్ధం ఇలాగే సాగితే.. మన పని అంతేనా? ఈ బాదుడు చూస్తుంటే.. సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కాకపోతే.. ఇదంతా ఆరంభమే! ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాలు, నిపుణుల అంచనాలు చూస్తుంటే.. అసలు యుద్ధం ముందుందనే విషయం చాలా మందికి అర్థమవుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం.. ప్రపంచ ఇంధన మార్కెట్‌ను కుదిపేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ రేట్లు కూడా పెరిగిపోతున్నాయ్. ఆ ఎఫెక్ట్.. మనపై పడుతోంది.

భారత్ తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం, గ్యాస్ అవసరాల్లో 50 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. అందుకే, అక్కడ రాజుకున్న నిప్పుతో.. సెగ, పొగ మనకు తగులుతోంది. ఇక్కడ, మన జేబులకు చిల్లు పడుతోంది. పెరిగిన పవర్ పెట్రోల్ ధరలు.. లగ్జరీ కార్లు, హై-ఎండ్ బైక్‌లు వాడే వారిపై ప్రభావం చూపుతాయ్. కానీ, ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు పెరగడమే ఆందోళనకు గురిచేస్తున్నాయ్. బల్క్ డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీకు 20కి పైగా పెంచాయ్. దాంతో పరిశ్రమలు, రైల్వేలు, భారీ మాల్స్ నిర్వహణ ఖర్చు పెరుగుతుంది. దీనివల్ల.. వస్తువుల తయారీ వ్యయం పెరిగి, అంతిమంగా వినియోగదారుడిపైనే ఆ భారం పడుతుంది.

త్వరలోనే పెట్రోల్, డీజిల్ షాక్?

ఇప్పుడు, సాధారణ పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరగక తప్పదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. ప్రభుత్వం ప్రస్తుతం వీటి ధరలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధరలు పెరగడంతో.. చమురు కంపెనీలు భరించలేకపోతున్నాయ్. దాంతో.. నష్టాలు రాకముందే, ఆ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే, యుద్ధం గనక ముదిరితే.. చమురు సరఫరా మరింత దెబ్బతినే అవకాశం ఉంది. అప్పుడు, సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాంటున్నారు. ఇదే గనక జరిగితే.. నిత్యవసర సరుకుల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతాయనే అంచనాలున్నాయ్. ఎందుకంటే.. చమురు ధరల పెరుగుదల అనేది.. ఒక చైన్ రియాక్షన్ లాంటిది. రవాణా ఖర్చులు పెరిగితే.. కూరగాయలు, పాలు, బియ్యం, పప్పుల ధరలు ఆటోమేటిక్‌గా పెరుగుతాయ్. యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే, ద్రవ్యోల్బణం పెరిగి.. సామాన్యుల కొనుగోలు శక్తిని దెబ్బతీసే ప్రమాదముంది. అప్పుడు.. పరిస్థితులన్నీ గందరగోళంగా మారిపోయే అవకాశాలున్నాయ్.

నగరాల్లో సిలిండర్ కోసం క్యూ

ఇప్పటికే.. గ్యాస్ కొరతతో చాలా నగరాల్లో క్యూ లైన్లు కనిపిస్తున్నాయ్. భారత్‌లో వాడుతున్న వంట గ్యాస్‌లో దాదాపు 60 శాతం మధ్యప్రాచ్యం నుంచే వస్తుంది. యుద్ధం వల్ల హర్మూజ్ జలసంధి మూతపడటంతో.. నౌకల రాక ఆలస్యమవుతోంది. కొరత వస్తుందేమోనన్న భయంతో.. అంతా ఒకేసారి సిలిండర్లు బుక్ చేయడం వల్ల పంపిణీ వ్యవస్థపైనా ఒత్తిడి పెరిగింది. ఇప్పటికే.. గ్యాస్ బుకింగ్ గడువుని కూడా బాగా పెంచారు. ప్రస్తుతానికి, సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నా, భవిష్యత్తులో పెరిగే అవకాశం లేకపోలేదు. యుద్ధం ఇలాగే కొనసాగితే, సాధారణ పెట్రోల్ ధరలు కూడా పెరుగుతాయ్. అప్పుడంతా.. బంకుల ముందు క్యూ కట్టాల్సి వస్తుంది. పెట్రోల్ మళ్లీ దొరుకుతుందో, లేదోనన్నట్లుగా ఊహించనంతగా రద్దీ పెరిగిపోతుంది.

యుద్ధం ముదిరితే పరిస్థితి ఏంటి?

ఈ ఆందోళనకర పరిస్థితుల నుంచి బయటకు రావాలంటే.. యుద్ధం ఆగడం గానీ, హర్మూజ్ జలసంధి తెరచుకోవడం గానీ చాలా ముఖ్యం. యుద్ధం కొనసాగినా, ఆయిల్ ఉత్పత్తి, సప్లైకి ఎలాంటి ఆటంకం లేకపోతే.. ఇబ్బందులు కొంతవరకు తగ్గుతాయ్. భారత్ కూడా గల్ఫ్ దేశాల ఆయిల్‌పైనే ఆధారపడటం తగ్గించి.. రష్యా లాంటి దేశాల నుంచి గ్యాస్, చమురు దిగుమతిని పెంచింది. దేశంలోనూ ఎల్‌పీజీ గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం.. మన దగ్గురున్న వ్యూహాత్మక చమురు నిల్వలు.. కొంతకాలం వరకు ఆదుకోగలవు. కానీ, రాబోయే రోజుల్లో యుద్ధం తీవ్రమైతే.. పరిస్థితులు మరింత దిగజారతాయ్. అప్పుడేంటి.. పరిస్థితి? అనేదే.. మేజర్ క్వశ్చన్. వాస్తవానికి.. దేశమంతా ఇప్పుడొక క్లిష్టమైన దశలో ఉంది. ధరల పెరుగుదల అనేది.. కేవలం అంకెలకు సంబంధించింది కాదు. సామాన్యుడి ఆకలికి, పొదుపునకు సంబంధించింది. ప్రస్తుతానికి భయపడాల్సిన పని లేకపోయినా, రాబోయే పరిస్థితులకు తగ్గట్లుగా సిద్ధంగా ఉండటం మంచిదనే సూచనలు వినిపిస్తున్నాయ్.

Also Read:ఇండియన్ ఆర్మీలో ‘కిల్లర్ రోబోలు’.. శత్రువు కనిపిస్తే ఇక అంతే సంగతులు!

Story by: Anup, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×