E-Paper
Advertisement

Best AC under Rs 35,000: ఈ ఏసీలు ఉన్నాయ్ మామ.. నా భూతో నా భవిష్యత్.. నెక్ట్స్ లెవల్ అంతే!

Best AC under Rs 35,000: ఈ ఏసీలు ఉన్నాయ్ మామ.. నా భూతో నా భవిష్యత్.. నెక్ట్స్ లెవల్ అంతే!
Advertisement

Best AC under Rs 35,000: సమ్మర్ నేపథ్యంలో ఏసీలకు భారీగా డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. ఉక్కపోత నుంచి తప్పించుకునేందుకు పెద్ద ఎత్తున వినియోగదారులు.. ఎయిర్ కండిషనర్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే మీడియం బడ్జెట్ లో మంచి కోసం చాలా మంది వెతుకుతున్నారు. అటువంటి వారి కోసం రూ.35,000 బడ్జెట్ లో అత్యుత్తమ ఫీచర్లను కలిగిన ఏసీలను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. ఆయా ఏసీల ఫీచర్లు, ధర వంటి విశేషాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

క్యారియర్ ఎస్టర్ నియో ప్లస్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ

ఇందులో Flexicool 6-ఇన్-1 కన్వర్టబుల్ టెక్నాలజీ ఉంటుంది. దీని సాయంతో గది అవసరాన్ని బట్టి కూలింగ్ సామర్థ్యాన్ని మార్చుకోవచ్చు. ఇందులో PM 2.5 ఫిల్టర్, ఆటో క్లెన్సర్ ఫీచర్లు ఉన్నాయి. రూ.34,000 బడ్జెట్ లో లభించే ఈ ఏసీ.. విద్యుత్తును ఆదా చేయడమే కాకుండా పరిశుభ్రమైన చల్లటి గాలిని అందిస్తుంది.

లాయిడ్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్

Advertisement

లాయిడ్ కంపెనీకి చెందిన ఈ ఏసీ 5-ఇన్-1 కన్వర్టబుల్ మోడ్‌తో వస్తుంది. గాలిని శుభ్రపరిచేందుకు ఇందులో యాంటీ-వైరల్, PM 2.5 ఫిల్టర్లు అమర్చారు. దీని ఇండోర్ యూనిట్ స్టైలిష్‌గా ఉండటం వల్ల.. ఇంటికి మోడరన్ లుక్ వస్తుంది. గదిలోని అన్ని మూల మూలలకు కూలింగ్ అందేలా ఇది మంచి ఎయిర్ త్రో (Air Throw) కలిగి ఉంది. రూ.32,500 ధర కలిగిన ఈ ఏసీ.. ఈ బడ్జెట్ లో మంచి ఛాయిస్ గా నిలుస్తోంది.

క్రోమా 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ ఏసీ

క్రోమా కంపెనీకి చెందిన ఈ సరికొత్త 2026 మోడల్ ఏసీ.. 7-ఇన్-1 కన్వర్టబుల్ కూలింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. 4-వే ఆటో స్వింగ్ వంటి అత్యాధునిక ఫీచర్లు దీనిలో ఉన్నాయి. ఇది గదిని అత్యంత వేగంగా చల్లబరుస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. మార్కెట్లోని ఇతర బ్రాండ్లతో పోలిస్తే.. ఇది తక్కువ బడ్జెట్ లో ఉండటంతో పాటు అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంది. ప్రస్తుతం ఇది రూ.28,000 నుంచి రూ.30,000 మధ్య సేల్ అవుతోంది.

పానాసోనిక్ 1 టన్ 3 స్టార్ స్మార్ట్ ఏసీ

Advertisement

రూ.35,000 బడ్జెట్ లో అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్న ఏసీని కోరుకుంటే ఇది బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. దీనిని MirAie యాప్ ద్వారా ఫోన్ నుండే కంట్రోల్ చేయవచ్చు. ఇందులో వాయిస్ కంట్రోల్ (Alexa/Google Assistant) సదుపాయం కూడా ఉంది. చిన్న గదులకు ఈ ఏసీ సరిగ్గా సరిపోతుంది. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఏసీ రూ.30,250 అందుబాటులో ఉంది.

Also Read: Mosquito Machines: దోమలతో అల్లాడుతున్నారా? ఈ మస్కిటో మిషన్లు ట్రై చేయండి.. ఒక్క దోమ కనిపించదు!

వోల్టాస్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్

వోల్టాస్ కంపెనీకి చెందిన ఈ స్ప్లిట్ ఏసీ.. మోడల్ 4-ఇన్-1 అడ్జస్టబుల్ కూలింగ్ టెక్నాలజీతో పనిచేయనుంది. ఇందులో 100% కాపర్ కండెన్సర్, యాంటీ-డస్ట్ ఫిల్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది 52°C ఎండలో కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. దీని ధర సుమారు రూ.31,000 లోపే ఉండటం వల్ల మిడిల్ క్లాస్ వారికి కూడా బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. దీని నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ.

Also Read: Philips vs Samsung: టీవీ బ్రాండ్ చూసి మోసపోతున్నారా? శాంసంగ్, ఫిలిప్స్‌లో ఏది వాల్యూ ఫర్ మనీ?

Related News

బెస్ట్ వాషింగ్ మెషీన్ కొనాలా? అమెజాన్‌లో ఫుల్ డిమాండ్ ఉన్న మోడల్స్!

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

Big Stories

Advertisement
×