E-Paper
Advertisement

Iran Missile Power: ఆకాశంలో ఇరాన్ ‘తాండవం’.. రాడార్ల కళ్లుగప్పి దూసుకెళ్తున్న ‘డ్యాన్సింగ్ మిసైల్’!

Iran Missile Power: ఆకాశంలో ఇరాన్ ‘తాండవం’.. రాడార్ల కళ్లుగప్పి దూసుకెళ్తున్న ‘డ్యాన్సింగ్ మిసైల్’!
Advertisement

Iran Missile Power: అమెరికా, ఇజ్రాయెల్ ఎన్ని రకాలుగా దాడులు చేసినా.. ఇరాన్ లొంగకుండా తన సైనిక శక్తిని ప్రదర్శిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్‌లో అత్యంత భారీ స్థాయిలో మిసైల్ నిల్వలు కలిగిన దేశం ఇరాన్ మాత్రమే అనే విషయం.. అందరికీ ప్రాక్టికల్‌గా అర్థమవుతోంది. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం, ఇరాన్ దగ్గర వేల సంఖ్యలో బాలిస్టిక్, క్రూయిజ్ మిసైళ్లు ఉన్నాయి. వాటిలో.. కొన్ని మిసైళ్ల సామర్థ్యం, వేగాన్ని బట్టి.. వాటిని బ్రహ్మాస్త్రాలుగా చెబుతున్నారు. అలాంటి మిసైళ్లను ఇరాన్ ఫైర్ చేశాక.. అడ్డుకోవడం ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, అమెరికా పేట్రియాట్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వల్ల కూడా కాదంటున్నారు. ఇంత పక్కాగా టార్గెట్లను ఛేదించే మిసైళ్లు తమ దగ్గర ఉన్నాయ్ కాబట్టే.. ఇరాన్ ఇంత పక్కాగా దాడులు చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌కు.. ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూనే ఉంది. దాంతో.. ఇరాన్ దగ్గర ఇలాంటివి ఇంకెన్ని ఉన్నాయనే డిబేట్ మొదలైంది.

ధ్వని వేగాన్ని మించే దూసుకెళ్తున్న ఫతా మిసైల్లు

ఇరాన్ ఆయుధ సంపత్తిలో.. అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తున్న మిసైళ్లు ఏవైనా ఉన్నాయంటే.. అవి ఫతా-1, ఫతా-2. ఇవి.. హైపర్ సోనిక్ మిసైళ్లలో.. ఇవి రెవల్యూషన్ అనే చెప్పాలి. ఈ క్షిపణులు ధ్వని కంటే 12 నుంచి 15 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయ్. వీటిని అడ్డుకోవడం అంటే.. ప్రస్తుతానికి ఎలాంటి మిసైల్ డిఫెన్స్ వ్యవస్థకైనా దాదాపు అసాధ్యమే. ఎందుకంటే.. ఇవి గాల్లోనే వాటి దిశను మార్చుకోగలవు. రాడార్లు కూడా వీటిని ట్రాక్ చేయడం కష్టం.

ఇరాన్ మిసైళ్ల టార్గెట్‌లో ఎవరు?

Advertisement

ఇరాన్ దగ్గరున్న మరో ఖతర్నాక్ మిసైల్.. ఖైబర్ షెకాన్. కోటలను బద్దలు కొట్టేదని దీని అర్థం. దీని పరిధి 1500 కిలోమీటర్లు. అంటే.. ఇరాన్‌ నుంచి ఫైర్ చేస్తే.. నేరుగా ఇజ్రాయెల్‌ని తాకుతుంది. ఇది.. సాలిడ్ ఫ్యూయల్‌తో పనిచేస్తుంది. కాబట్టి, అతి తక్కువ సమయంలోనే.. దీనిని ప్రయోగించొచ్చు. ఇక.. షాహబ్-3 మిసైల్.. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్‌కి వెన్నెముక అని చెప్పాలి. ఇది ఏకంగా 2 వేల కిలోమీటర్ల దూరం దాకా వెళ్లగలదు. దశాబ్దాలుగా ఇరాన్ దీనిని ఆధునీకరిస్తూ వస్తోంది. దీని ఆధారంగానే, ఘద్ర్, ఎమాద్ లాంటి వేరియంట్లు పుట్టుకొచ్చాయ్. ఇవి.. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలవు. ఇరాన్ దగ్గరున్న అత్యంత ప్రమాదకరమైన మిసైళ్లలో.. సెజ్జిల్ ఒకటి. దీనినే.. డ్యాన్సింగ్ మిసైల్ అని పిలుస్తారు. ఇది.. టూ స్టేజ్ సాలిడ్ ప్రొపెల్లింట్ మిసైల్. దీనిని.. మొబైల్ లాంఛర్ల ద్వారా ఎక్కడి నుంచైనా ప్రయోగించొచ్చు. దీని వేగం, పరిధి.. ఇజ్రాయెల్, యూరప్ సరిహద్దుల దాకా పొంచి ఉంది.

అమెరికా, ఇజ్రాయెల్‌కు సవాల్ విసురుతున్న ఇరాన్

ఫతా-2 హైపర్ సోనిక్ మిసైల్, ఖోర్రామ్ షహర్-4 బాలిస్టిక్ మిసైల్, పవేహ్ క్రూయిజ్ మిసైల్, షాహెద్ సూసైడ్ డ్రోన్ లాంటివి.. సుదూర లక్ష్యాలను చాలా కచ్చితత్వంతో ఛేదిస్తాయ్. ఇవే కాదు.. ఇరాన్ దగ్గర ఇలాంటి మిసైళ్లు బోలెడన్ని ఉన్నాయ్. తక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించేందుకు ఒక రకం, సుదూర లక్ష్యాలు ఛేదించేందుకు ఒక రకం, యుద్ధ విమానాలను కూల్చేందుకు, యుద్ధ నౌకలను పేల్చేందుకు, శత్రువుల స్థావరాలపై దాడులు చేసేందుకు, ఇలా.. అనేక రకాల దాడుల కోసం, వివిధ రకాల మిసైళ్లు ఉన్నాయ్. అవన్నీ.. వేటికవే యుద్ధభూమిలో దడ పుట్టిస్తున్నాయ్. అవతలి వైపు నుంచి అమెరికా, ఇజ్రాయెల్ ఎన్ని రకాల మిసైళ్లు ప్రయోగించినా.. ఇరాన్ వెనక్కి తగ్గకుండా తన మిసైళ్లతో సమాధానం చెబుతోంది. సమయానికి తగ్గట్లుగా, పరిస్థితులు మారుతున్నట్లుగా ఇరాన్ తన మిసైళ్లని బయటకు తీస్తోంది. కచ్చితమైన దాడులు చేస్తూ.. అమెరికాకు కొరకరాని కొయ్యగా మారింది. మిసైళ్లతో పాటు ఇరాన్ తన ఆత్మాహుతి డ్రోన్లతో.. శత్రువులని వణికిస్తోంది. ముఖ్యంగా.. షాహెద్ డ్రోన్లు తక్కువ ఖర్చుతో తయారవుతాయ్. కానీ, శత్రువుల రాడార్లకు చిక్కకుండా భారీ నష్టాన్ని కలిగిస్తోంది.

ఇరాన్ రహస్య ఆయుధాల కథ

Advertisement

గడిచిన దశాబ్దాల్లో.. ఇరాన్ తల మిసైల్ టెక్నాలజీని సొంతంగా డెవలప్ చేసుకుంది. శత్రు దేశాల దగ్గర ఎంత ఆయుధ సంపత్తి ఉన్నా.. వాటిని తిప్పికొట్టగలికే మిసైళ్లు, డ్రోన్లు ఇరాన్ దగ్గరున్నాయ్. అందుకే.. అమెరికా మేం విధ్వంసం సృష్టించాం.. ఇరాన్‌ని కోలుకోలేని దెబ్బతీశామని చెబుతున్నా.. వార్ గ్రౌండ్‌లో రియాలిటీ మరోలా ఉంది. అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీల నుంచి ఇరాన్.. నిరంతరం కొత్త ఆయుధాలను బయటకు తీస్తూనే ఉంది. ఇరాన్ ఇంకా ప్రయోగించని మిసైళ్లు, రహస్య క్షిపణులు కూడా ఉండొచ్చని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

రెండు వారాల్లోనే ప్రపంచానికి షాక్ ఇచ్చిన ఇరాన్

రోజులు మారుతున్నకొద్దీ ఆయుధాలు మారాయ్.. దేశాల శక్తి సామర్థ్యాలు మారాయ్.. వాటికి తగ్గట్లుగానే.. యుద్ధాల తీరు కూడా మారింది. దశాబ్దాల కిందట సరిహద్దుల్లో సైన్యం తలపడేవారు. కానీ.. ఇప్పుడలా కాదు. ఉన్న చోటు నుంచే యుద్ధం చేసేస్తున్నారు. డ్రోన్లు, మిసైళ్లతో.. ఎక్కడ అవసరమనుకుంటే అక్కడ దాడులు చేస్తున్నారు. ఆయుధాల్లోకి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వచ్చాక.. యుద్ధాలు ఈజీ అయిపోయాయ్. మిసైళ్లు అప్‌గ్రేడ్ అయ్యాక.. దాడుల తీవ్రత పెరిగింది. ఒక్క మిసైల్ చేసే నష్టం.. ఇప్పుడు ఎవరి ఊహకు అందడం లేదు. అలాంటి.. మిసైళ్లు ఇరాన్ దగ్గర ఎన్నో ఉన్నాయ్. యుద్ధం మొదలై రెండు వారాలు దాటింది. అయినాసరే.. ప్రపంచ దేశాల అంచనాలను తలకిందులు చేస్తూ.. ఇరాన్.. అగ్రరాజ్యం అమెరికాకు, ఇజ్రాయెల్‌కు గట్టి సవాల్ విసురుతోంది. యుద్ధం మొదలైన తొలి రోజే.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించినా.. కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ నాయకత్వంలో.. ఇరాన్ తన పోరాట పటిమను చాటుతూనే ఉంది. ఇందుకు.. ఒకే ఒక్క రీజన్.. ఇరాన్ దగ్గరున్న అత్యాధునిక మిసైళ్లే. ముఖ్యంగా.. సిజ్జిల్‌గా పిలిచే డ్యాన్సింగ్ మిసైల్‌ని ఇరాన్ రంగంలోకి దించడంతో.. అంచనాలు మారిపోయాయ్. ఇది గాల్లో తన దిశను మార్చుకుంటూ, శత్రు రాడార్లకు చిక్కకుండా.. లక్ష్యాలను ఛేదిస్తుంది. అందుకే.. దీనిని డ్యాన్సింగ్ మిసైల్ అని పిలుస్తోంది ఇరాన్.

ఇరాన్ వ్యూహం ప్రపంచాన్ని ఆశ్చర్య పరుస్తోందా

డ్రోన్ల మాదిరిగా.. ఒకేసారి భారీ సంఖ్యలో కాకుండా.. సమయాన్ని బట్టి ఒక్కో మిసైల్‌ని సంధిస్తోంది ఇరాన్. దాంతో.. ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అయిన ఐరన్ డోమ్, ఆరో లాంటి రక్షణ వ్యవస్థలను కన్ఫ్యూజ్ చేస్తోంది. ఇరాన్‌ని నిలువరించేందుకు.. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా, ఇరాన్ దగ్గరున్న వేలాది మిసైళ్ల నిల్వని సమర్థవంతంగా వాడుకుంటోంది. టెక్నాలజీ పరంగా, ఆయుధాల పరంగా.. అమెరికా, ఇజ్రాయెల్ ముందున్నా.. ఇరాన్‌ని పూర్తి స్థాయిలో ఓడించడం, ఆ దేశాన్ని లొంగదీసుకోవడం అంత సులభం కాదని నిపుణులు భావిస్తున్నారు. ఇందుకు.. కొన్ని భౌగోళిక పరిస్థితులు సవాళ్లు విసురుతున్నాయ్. ఇరాన్.. విస్తీర్ణంలో చాలా పెద్ద దేశం. కేవలం, వైమానిక దాడులు, మిసైల్ ఎటాక్స్‌తో ఆ దేశాన్ని లొంగదీసుకోవడం అసాధ్యమంటున్నారు. అలాగని.. క్షేత్రస్థాయిలో సైన్యాన్ని పంపాలంటే లక్షలాది మంది సైనికులు కావాలి. ఇది.. అమెరికాకు భారీ వ్యయంతో కూడుకున్న పని. ఇప్పటికే.. ఇరాన్‌ని ఓడించేందుకు అమెరికా వాడుతున్న ఆయుధాలు చూశాక.. వేల కోట్ల రూపాయలు వృథా అవుతున్నాయనే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో.. యుద్ధం మరోలా చేసే సాహసం అమెరికా దాదాపుగా చేయదనే వాదన వినిపిస్తోంది.

మౌలిక సదుపాయాలపై భారీ దెబ్బలు

ఇప్పటికే ఇప్పటికే ఇరాన్ దాడులతో.. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలకు, ఇజ్రాయెల్‌లో మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లింది. ఇరాన్ హర్మూజ్ జలసంధిని కూడా మూసేయడంతో.. ప్రపంచ చమురు సప్లై చైన్ డిస్టర్బ్ అయింది. ఇది.. భారత్ లాంటి అనేక దేశాలపై ప్రభావం చూపుతోంది. అయితే.. అమెరికా, ఇజ్రాయెల్ ప్రధానంగా రెండు లక్ష్యాలతో ఉన్నాయ్. ఒకటి.. ఇరాన్‌లో అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేసి, న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ నాశనం చేయడం, మరొకటి.. ఇరాన్‌లో ఇస్లామిక్ పాలనని కూల్చి.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. అలీ ఖమేనీ మరణం.. ఇరాన్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బే అయినా, అది ఇరాన్ సైన్యాన్ని బలహీనపర్చలేదు. పైగా, విరామం లేని దాడుల వల్ల.. ఇరాన్ ప్రజల్లో దేశభక్తి పెరిగి.. ప్రభుత్వానికి మద్దతు పెరుగుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. కాబట్టి, ఇజ్రాయెల్ అనుకున్నట్లుగా కంప్లీట్ విక్టరీ అనేది.. ఇప్పట్లో సాధ్యమయ్యే ఛాన్స్ లేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, ఇది సుదీర్ఘ యుద్ధంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయ్.

మిసైళ్లు ఉన్నంత వరకు యుద్ధం ఆగదా?

ఇజ్రాయెల్ తన ఉనికి కోసం యుద్ధం చేస్తుంటే, ఇరాన్ తన మనుగడ కోసం పోరాడుతోంది. ఆత్మరక్షణ కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. కానీ.. అమెరికాకు అలా కాదు. ప్రెసిడెంట్ ట్రంప్.. ఈ యుద్ధాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. త్వరగా ముగించాలని చూస్తున్నా.. ఇరాన్ వేస్తున్న ఎత్తుగడలు యుద్ధాన్ని మరింత సాగదీస్తున్నాయ్. అందువల్ల.. శాంతి చర్చలు ప్రస్తావనే రావట్లేదు. ఇరాన్, అమెరికా ఏదో ఒకటి తేల్చుకుందామనే ఆలోచనతోనే ఉన్నాయ్. దాంతో.. ఈ పోరులో ఎవరు గెలుస్తారన్నది ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. ఒకవేళ.. ఇరాన్ దగ్గర మిసైల్ నిల్వలు అయిపోయినా, రష్యా, చైనా లాంటి దేశాలు జోక్యం చేసుకొని చర్చలు జరిపితేనే.. యుద్ధం ఆగే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ దగ్గర మిసైళ్లు ఉన్నంతవరకు ఈ ఉద్రిక్తతలు కొనసాగుతాయంటున్నారు.

Also Read: యువతకు నీతులు.. ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీలు.. మన నేతల అసలు రంగు ఇదేనా?

Story by: Anup, Big Tv

Related News

QR కోడ్‌లో మూడు బాక్స్‌లు ఎందుకుంటాయో తెలుసా ?

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!

నిరుద్యోగ పెయిడ్ ఆర్టిస్ట్స్! యువ సంగ్రామ సదస్సు పై సెటైర్లు! ఎఫెక్ట్ ఎవరికి!?

చైన్ స్నాచర్లుగా మారండి! స్కూటీలు ఎత్తుకెళ్లండి..! జ‌నాల‌ను దోపిడీ చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే ..

ఒక్కో పార్టీకి రెండేసి సార్లు అధికారం.. ఇది ధీమానా, జోస్యమా? చరిత్ర ఇదేననే మైండ్ గేమా!?

సీసీటీవీ ఫుటేజ్ భయమేనా? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆత్మహత్యాయత్నం వెనుక అసలు నిజాలు!

మితిమీరిన కేటీఆర్ భాష‌! చిచోర‌, బేకార్‌.. స‌న్నాసీ..! సీఎంపై ప‌రుష‌ ప‌ద‌జాల ప్ర‌యోగం..!

రేవంత్ రెడ్డి సీక్రెట్ స్కెచ్.. దారికి రాకుంటే టికెట్ కట్! హస్తం పార్టీలో మొదలైన బిగ్ యాక్షన్ ప్లాన్

Big Stories

Advertisement
×