E-Paper
Advertisement

నిజం చెప్పిన జర్నలిజంపై నిషేధమా? ఈ 4 ప్రశ్నలకు సమాధానం చెబుతారా? DSC స్కామ్‌పై జగన్ అస్త్రాలు!

నిజం చెప్పిన జర్నలిజంపై నిషేధమా? ఈ 4 ప్రశ్నలకు సమాధానం చెబుతారా? DSC స్కామ్‌పై జగన్ అస్త్రాలు!
Advertisement

ఏపీ మెగా డీఎస్సీ స్కామ్‌లో మరిన్ని నిజాలతో బయటకొచ్చారు మాజీ సీఎం జగన్‌. ప్రెస్‌మీట్‌లో కీలక ఆధారాలు బయటపెట్టారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి నాలుగు ప్రశ్నలను సంధించారు. ఈ ప్రశ్నలకు సంబంధించిన ఆధారాలను కూడా మీడియా ముందుంచి.. లోతుగా వివరించే ప్రయత్నం చేసిన జగన్‌.. నిజం చెప్పిన జర్నలిజాన్ని నిషేధించేందుకు కూడా వెనుకాడలేదని అన్నారు. అన్ని ఆధారాలతో బయట పెట్టిన మీడియాకు సంబంధించిన సోషల్ మీడియాను బ్లాక్‌ చేశారని బీగ్‌టీవీ గురించి ఆయన పరోక్షంగా ప్రస్తావించారు.

విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేశ్‌ ఈ మెగా డీఎస్సీ కుంభకోణానికి పూర్తి బాధ్యుడని, కొడుకును రక్షించుకునే క్రమంలో చంద్రబాబు చేయాల్సిందంతా చేస్తున్నారని విమర్శించారు జగన్‌. ఆధారాలతో ఒక్కొక్కటి బయటపెడుతున్న మీడియాపైనా, వ్యక్తులపైన ఎంతటి బలవంతానికైనా, బెదిరింపులకైనా దిగేందుకు సిద్దపడ్డారని ధ్వజమెత్తారు. కేసులు పెడ్తామంటున్నారని, జైలుకు పంపుతామంటున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని జగన్‌ విమర్శించారు.

Advertisement

ఈ సందర్భంగా ఆయన డీఎస్సీ కుంభకోణంపై నాలుగు ప్రశ్నలను చంద్రబాబు, లోకేశ్‌లపై సంధించారు. వీటిని సమాధానాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. వీటికి సంబంధించిన ఆధారాలన్నీ మీడియాకు చూపారు. తవ్వినకొద్దీ ఆధారాలు బయటపడుతున్నాయని, ఆ ఆధారాలతో పాటు ఇంకా కొత్త అనుమానాలు కూడా పుట్టుకొస్తున్నాయని, ఇది ఎంత పెద్ద స్కామో.. ఈ ఆధారాలను చూస్తే, తాను సంధించిన ప్రశ్నలను బట్టి ప్రజలందరికీ అర్థమైపోతుందన్నారు జగన్‌.

ప్రశ్న నెం.1
………………
?. ఏపీ రాష్ట్ర చరిత్రలో, డీఎస్సీ చరిత్రలో లేని విధంగా.. ప్రశ్నాపత్రాల తయారీ, డీఎస్సీ పరీక్షల నిర్వహణ (పర్యవేక్షణ) రెండూ ఒకే వ్యక్తికి ఎందుకిచ్చారు?

Advertisement

ప్రశ్న నెం. 2
……………….

?. ప్రశ్నాపత్రాన్ని తయారు చేసే స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ టెక్నాలజీ (scert)లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా చేస్తున్న పురమా నవీన్‌ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంకు ఎలా వచ్చింది?

?. మెరిట్‌ వచ్చిన ఆ వ్యక్తికి మరి ఉద్యోగం ఎందుకివ్వలేదు?
?.  అతని పేరు మీదున్న మెరిట్‌ లిస్టును ఎందుకు తొలగించారు?
?.  నవీన్‌ డీఎస్సీ ఐడీని ఎందుకు బ్లాక్‌ చేశారు?
?. అతని సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎందుకు పిలవలేదు..?
?.  నవీనే స్వయంగా డీఎస్సీ కన్వీనర్‌కు లేఖ రాశాడు.. తనను వెరిఫికేషన్‌ పిలవలేదని, తన ఐడీని బ్లాక్‌ చేశారని. మరి దీనికి బదులెందుకు ఇవ్వలేదు?
?.  అతను కోర్టుకు ఎందుకు పోయాడు? కోర్టుకు పోయిన విషయాన్ని అఫిడవిట్‌ ద్వారా తనే బయటపెట్టాడు. అయినా ఎందుకు స్పందించలేదు..?

?. స్కాంను దాచిపెట్టేందుకు మీరు చేసిన ప్రయత్నంలో ఇది భాగం కాదా?

ప్రశ్న నెం. 3
…………………

?. స్పోర్ట్స్‌ కోటాలో జీవోలను మార్చి ఏకంగా 372 ఉద్యోగాల భర్తీ ఎలా చేస్తారు? మళ్లీ జీవోలను ఎందుకు మార్చారు..?

?. అప్పటి వరకు ఉన్న 2 శాతం ఉన్న స్పోర్ట్స్‌ కోటాను 3 శాతంగా ఎందుకు పెంచారు?

?. ఎలాంటి పరీక్షలు రాసే అవసరం లేదనే విధంగా, నేరుగా రిక్రూట్‌మెంట్‌ చేసుకోవచ్చనే విధంగా జీవో నెం..4, జీవో నెం. 47,లను ఎందుకు తెచ్చారు? అసలు పరీక్షలే నిర్వహించకుండా ప్రభుత్వ ఉద్యోగాలిస్తారా…? దీని కోసం ప్రత్యేకంగా జీవోలు తెచ్చింది.. ఎవరి కోసం?

?. 372 ఉద్యోగాల భర్తీ తరువాత ఆ జీవోలను రద్దు చేసి వీటిని ఉపసంహరించుకుంటూ.. కొత్త జీవోలు.. (23, 25, 56) ఎందుకు తెచ్చారు..? అంటే పరీక్షలు లేకుండా ఉద్యోగాలను భర్తీ చేసుకుని, అప్పుడు గేట్లెత్తి, ఆ తరువాత మీరే పని అయిపోయింది కాబట్టి గేట్లు మూసేశారు… దీని వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయి..?

ప్రశ్న నెం. 4 

?. టీచర్ల పోస్టులకు బహిరంగ మార్కెట్లో రేటు పెట్టి మరీ అమ్మేసుకుంటుంటే.. దీన్ని ఎందుకు పట్టించుకోలేదు.. పైగా నిర్వీర్యం చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యమేమిటీ..?

?. ఫోన్‌ నెం. 9440755843 నుంచి ఫోన్ చేసి 15 లక్షలకు ఉద్యోగం ఇస్తామని చెప్పిన వ్యక్తి ఎవరో తెలుసుకోవడం మీ పోలీస్‌ వ్యవస్థకు అంత కష్టమైందా?
?. అతని పేరును ఎందుకు ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించలేదు..? సస్పెక్ట్‌గా ఎందుకు నమోదు చేశారు? అరెస్టు విషయంలో ఉన్నతాధికారులతో సంప్రదించిన తరువాత అని 8వ కాలమ్‌లో ఎలా పొందుపరిచారు?

?. అరెస్టు చేశాం.. జ్యూడిషియల్ రిమాండ్‌కు పంపామని, అసెంబ్లీ సాక్షిగా లోకేశ్‌ పచ్చి అబద్దాలు చెప్పారు. అరెస్టు చేయలేదు. స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి ఈ కేసును మొత్తం నిర్వీర్యం చేశారు.. ఎందుకు?

Tags

Related News

సంఘాలపై ఉద్యోగుల గుర్రు.. నిరసనలపై సర్కార్‌ నీళ్లు జల్లే ప్రయత్నం.. చీఫ్ సెక్రటరీ రాతపూర్వక హామీతో – ఛలో హైదరాబాద్ తాత్కాలిక వాయిదా..!

ఇక కురుక్షేత్రమే వచ్చే ఎన్నికల్లో నేనేంటో చూపిస్తా: జగన్

సూర్యుడి చుట్టూ భూమి.. కేసీఆర్‌ చుట్టూ చావు రాజకీయాలు! వందేండ్లు బతకాలంటున్నారు… ఆరోగ్యం బాగలేదనీ అంటున్నారు..!

సర్ జాబితా ప్రక్షాళనలో గందరగోళం.. విచారణలతో వృద్ధులకు తప్పని తిప్పలు!

ఓ వీర్ల శంకర్‌.. ఓ తాతా మధు.. ఇద్దరూ నోరు జారారు..! హద్దు మీరారు..! సమర్థించుకోవాలనుకోవడం..  రెండు పార్టీల పొరపాటే..!

దళిత ఇష్యూలో అభాసుపాలైన ఆర్ఎస్‌ స్టాండ్‌.. దళిత స్పీకర్‌పై ప్రవీణ్‌ స్పందించలేదేం..? రాజకీయాలే ప్రాధాన్యమా? దళితుల ఆత్మగౌరవం పట్టదా..?

పాలిటిక్స్ To పర్సనల్.. హద్దులు దాటుతున్న రాజకీయం.. బలవుతున్న కేడర్!

Big Stories

Advertisement
×