E-Paper
Advertisement

ట్రైన్ కాదు.. నడిచే 5-స్టార్ హోటల్.. ఈ రష్యా రైలును చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ట్రైన్ కాదు.. నడిచే 5-స్టార్ హోటల్.. ఈ రష్యా రైలును చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Advertisement

Russian Train: సాధారణంగా భారతీయ రైల్వే అనగానే నిత్యం రద్దీతో ఉండే కంపార్ట్ మెంట్లు, అపరిశుభ్రమైన టాయిలెట్స్ చాలా మందికి గుర్తుకు వస్తాయి. అయితే విదేశాల్లోనూ రైళ్లు ఇదే విధంగా ఉంటాయా? లేదా? అన్నది చాలా మంది ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలోనే భారత్ కు చెందిన ఓ ఇన్ ఫ్లూయెన్సర్.. రష్యా రైలులోని సౌకర్యాలను కళ్లకు కడుతూ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ దేశానికి చెందిన డబుల్ డెక్కర్ రైలు ఎక్కిన ఆమె.. అందులోని విశేషాలను చూపిస్తూ చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

వీడియోలో ఏముందంటే?

‘ఈరోజు నేను రష్యాలో రైళ్లు ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను, రండి’ అంటూ ఆ ట్రావెలర్ తన టూర్‌ను ప్రారంభించారు. మొదట రైలులోని కింద అంతస్తును చూపించిన ఆమె.. ఆ తర్వాత పై అంతస్తు (సెకండ్ డెక్కర్)ను వీక్షకులకు పరిచయం చేశారు. బోగీ మధ్యలో పొడవైన లాబీ, ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రైవేట్ కంపార్ట్‌మెంట్లు ఆకట్టుకున్నాయి. అలాగే సదరు యువతి తన సీటును వీడియోలో స్పష్టంగా చూపించారు. రైలు లోపలి భాగం చాలా శుభ్రంగా, అత్యాధునికంగా ఉండటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

మైక్రోవేవ్ నుండి వెండింగ్ మెషిన్ వరకు..

Advertisement

రష్యన్ రైలులో ప్రయాణికుల కల్పించిన అదనపు సౌకర్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. రైలులోనే తాగునీరు, వేడి నీటి కోసం కేటిల్, ఆహారం వేడి చేసుకోవడానికి మైక్రోవేవ్ ఓవెన్ (Microwave), స్నాక్స్ కోసం వెండింగ్ మెషిన్ (Vending Machine) ఉన్నాయి. ప్రయాణికులు అక్కడే ఉండే రైలు సిబ్బందికి డబ్బులు చెల్లించి, వెండింగ్ మెషిన్ ద్వారా తమకు నచ్చిన స్నాక్స్ లేదా పానీయాలను తీసుకోవచ్చని సదరు యువతి వివరించారు.

Also Read: ఏటీఎం కీప్యాడ్ ప్లాస్టిక్‌లో కాకుండా.. మెటల్‌‌ లోనే ఎందుకు? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి?

నెటిజన్ల రియాక్షన్ ఇదే..

Advertisement

మరోవైపు రైలులోని విలాసవంతమైన వసతులను చూసి నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘రైలులో ఇవన్నీ కూడా ఉంటాయా?’ అని ఓ నెటిజన్ ఆశ్చర్యపోగా.. ‘మన దేశంలో కూడా ఇలాంటి సదుపాయాలు ఉంటే ఎంత బాగున్నో’ అని కొందరు అభిప్రాయపడ్డారు. ‘ఈ రైళ్లలో జనరల్ కాంపాక్ట్‌మెంట్లు ఉండవా?’ అని ఒక నెటిజన్ సందేహం వ్యక్తం చేయడం గమనార్హం. మెుత్తం మీద రష్యన్ రైలులోని సకల సౌకర్యాలు భారతీయ నెటిజన్లను ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్నాయని చెప్పవచ్చు.

?utm_source=ig_embed&ig_rid=A4SEPkI84-r8wp6quTqrBiI">

?utm_source=ig_embed&ig_rid=A4SEPkI84-r8wp6quTqrBiI

Also Read: జియో బంపరాఫర్.. ఈ ప్లాన్లతో అమెజాన్ ప్రైమ్ ఉచితం.. ఇంకా మరెన్నో బెనిఫిట్స్!

Tags

Related News

టోకెన్ ఉన్నా లేకపోయినా రూ. 10 లక్షల ఇన్సూరెన్స్.. టీటీడీ సంచలన నిర్ణయం!

మళ్లీ పట్టాలెక్కనున్న భారత్-బంగ్లాదేశ్ రైళ్లు.. 2 ఏళ్ల తర్వాత ఇరు దేశాల కీలక నిర్ణయం!

నల్లగొండలో హైటెక్ బస్టాండ్.. ఏకంగా రూ. 54 కోట్లతో నిర్మాణం!

హోస్టెస్, వైఫై, టాయిలెట్.. ఈ ఆర్టీసీ బస్సును చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

బెంగళూరు–విజయవాడ ప్రయాణానికి కొత్త దారి.. ఏకంగా 110 కి.మీ తగ్గనున్న దూరం!

మగ జీవులను నీచంగా చూసే.. భయంకరమైన ఆడ జంతువులు.. ఇవి చాలా డేంజర్ భయ్యా!

ఇండియన్ బుల్లెట్ రైల్ రెడీ.. ఇక పట్టాలు ఎక్కుడే తరువాయి..

Big Stories

Advertisement
×