E-Paper

జాన్వీ కపూర్‌ను టార్గెట్ చేయొద్దు.. ‘పెద్ది’ ట్రోలింగ్‌పై జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు!

జాన్వీ కపూర్‌ను టార్గెట్ చేయొద్దు.. ‘పెద్ది’ ట్రోలింగ్‌పై జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Janhvi Kapoor: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది సినిమా జూన్ 4న రిలీజయ్యాక బాక్సాఫీస్ వద్ద కాకుండా సోషల్ మీడియాలో భారీ వివాదానికి సెంటర్ పాయింట్ అయింది. ఈ సినిమాలో కథానాయిక జాన్వి కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్ర చిత్రణపై తీవ్రస్థాయిలో నెగెటివిటీ, ట్రోలింగ్ నడుస్తోంది. సినిమా చూసిన ప్రేక్షకుల్లో చాలా మంది అలాగే మూవీ క్రిటిక్స్ జాన్వి కపూర్ పాత్రను అతిగా శృంగారంగా చేశారని, ఆమెను కేవలం గ్లామర్ బొమ్మగా మార్చేశారని మండిపడుతున్నారు. జాన్వీ కపూర్ పై తీసిన చాలా సీన్లు అసభ్యకరంగా ఉన్నాయన్న టాక్ బయటకొచ్చింది. ఆ ఇష్యూ చుట్టే ట్రోలింగ్ కూడా ఇప్పటికీ గట్టిగానే నడుస్తోంది.

సీక్రేట్ చాట్ లీకేజ్

Advertisement

ఓ నెటిజన్ అయితే భారతీయ సినిమా చరిత్రలోనే ఒక లీడ్ హీరోయిన్‌కు ఇచ్చిన అత్యంత ఖరీదైన అగౌరవం అని పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్‌ను జాన్వి కపూర్ స్వయంగా లైక్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు స్క్రీన్‌షాట్లు తీసి వైరల్ చేయడంతో ఆమె వెంటనే ఆ లైక్‌ను తొలగించింది. అయితే ఆమె కూడా ఈ పాత్ర చిత్రణ పట్ల అసంతృప్తిగా ఉందనే విషయం ఈ విషయంపై లీకైందన్న టాక్ తెరపైకి వచ్చింది. అంతే కాదు జాన్వి తన ఫ్యాన్ క్లబ్స్‌తో గతంలో చాట్ చేసినట్లుగా చెబుతున్న కొన్ని స్క్రీన్‌షాట్లు కూడా బయటకు వచ్చాయి. అందులో తాను షూటింగ్ సమయంలోనే ఇటువంటి కెమెరా యాంగిల్స్ వద్దని దర్శకుడు, కొరియోగ్రాఫర్లకు చెప్పానని, అప్పుడు రామ్ చరణ్ కూడా తనకు సపోర్ట్ చేస్తూ దర్శకున్ని వారించాడన్న ప్రచారాలు జరుగుతున్నాయ్.

బుచ్చిబాబు Xలో క్షమాపణ పోస్ట్

Advertisement

జాన్వీ పాత్ర చుట్టూ విమర్శలు విపరీతంగా పెరగడంతో డైరెక్టర్ బుచ్చిబాబు X లో సుదీర్ఘమైన క్షమాపణ లేఖను పోస్ట్ చేశారు. సినిమా ఎప్పుడూ ప్రేక్షకులను అలరించాలి, గౌరవించాలి కానీ ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదని, పెద్ది లోని కొన్ని సీన్లపై వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను తాము చాలా సీరియస్‌గా తీసుకున్నామన్నారు. ఆఫ్ స్క్రీన్ అయినా, ఆన్ స్క్రీన్ అయినా మహిళలను గౌరవించడమే తమ బాధ్యత అన్నారు. ఏ మహిళ పాత్రను తక్కువ చేసి చూపించాలనే ఉద్దేశం తమకు లేదని, ఒకవేళ ఆ సీన్లు ప్రేక్షకులను బాధించి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానన్నారు. ప్రేక్షకుల మనోభావాలను గౌరవిస్తూ.. సినిమాలో అభ్యంతరకరంగా ఉన్న ఆయా సీన్లను కట్ చేయాలని నిర్ణయించుకున్నామని బుచ్చిబాబు ప్రకటించారు.

జాన్విని ట్రోల్ చేయడానికి కారణం

నెటిజన్లు జాన్విని ఇంతలా ట్రోల్ చేయడానికి ప్రధాన కారణం ఆమె గతంలో మాట్లాడిన మాటలే. దేవర అలాగే ఇతర బాలీవుడ్ సినిమాల ప్రమోషన్ల సమయంలో జాన్వి మహిళా సాధికారత, సినిమాలో మహిళల ప్రాధాన్యత గురించి గొప్పగా మాట్లాడింది. సినిమాల్లో కెమెరామెన్లు హీరోయిన్లకు ఇష్టం లేని చోట కెమెరా పెడుతుంటారని, అలాంటప్పుడు ప్రొఫెషనలిజం పక్కన పెట్టి.. ఇది నాకు నచ్చలేదు, వద్దు అని గట్టిగా చెప్పే ధైర్యం హీరోయిన్లకు ఉండాలని గత ఇంటర్వ్యూల్లో చెప్పిన మాటలను తాజాగా వైరల్ చేస్తున్నారు.

జాన్వి కపూర్ పై ట్రోలింగ్ ఆపండి.. జగపతి బాబు

మరి అంతలా మహిళల హక్కుల గురించి మాట్లాడి ఇప్పుడు భారీ రెమ్యునరేషన్ గురించి చేసిందేంటంటూ సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు పెడుతున్నారు. అటు జాన్వి కపూర్ పై ట్రోలింగ్ ఆపాలని పెద్దిలో కీలక పాత్ర పోషించిన జగపతి బాబు అన్నారు. సినిమా విషయంలో ఆర్టిస్టులను ట్రోల్‌ చేయొద్దని, పాపం ఆ అమ్మాయి దర్శకుడు చెప్పినట్లు చేసిందన్నారు. కొన్నిసార్లు అది మిస్‌ ఫైర్‌ అవుతుందని, అయితే ఈ విషయంలో తాను జాన్వీకపూర్‌కు సపోర్ట్‌ చేస్తానన్నారు జగపతి బాబు. జాన్వీ కపూర్ ను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేయొద్దని, ట్రోల్‌ చేసి మానసికంగా ఇబ్బంది పెట్టొద్దన్నారు. సో ఇలా ఈ సబ్జెక్ట్ ప్రొలాంగ్ అవుతూనే ఉంది. ఎండ్ కార్డ్ మాత్రం పడడం లేదు.

Also Read: నియంత్రణ తప్పిన రావలకోట్ నిరసన.. 150 మంది మృతి?

Related News

ప్రస్తుత పరిస్థితులే నన్ను రాజకీయాల వైపు నడిపించాయి: రాఘవ లారెన్స్

పెళ్లి రోజున కవల పిల్లల మొదటి ఫోటో షేర్ చేసి ఉపాసన ఎమోషనల్..

‘విశ్వంభర’ సమ్మర్ మిస్.. దసరా రేసులోకి మెగాస్టార్? సస్పెన్స్‌లో ఫ్యాన్స్!

‘లగాన్’ 25 ఏళ్ల వేడుక.. సరికొత్త లుక్‌లో సల్మాన్ ఖాన్.. కరీనా, జూహీ చావ్లా సందడి!

ఆ బుల్లితెర నటికి ఆడపిల్ల.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు!

మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు.. ‘దంగల్’ కంటే రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకే ఎక్కువ ఆదరణ!

‘కాక్‌టెయిల్ 2’ ఈవెంట్‌లో రష్మికకు రక్షణగా నిలిచిన బాలీవుడ్ నటి.. అసలు ఏం జరిగిందంటే?

ప్రతిభావంతులైన విద్యార్థులకు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సత్కారం..

×