TDP Vs YCP: టోటల్‌గా ఫ్లాప్ అంటారు వైసీపీ వారు.. కాదు గ్రాండ్ సక్సెస్ అంటారు టీడీపీ వారు.. ఎవరి మాట వారిదే. ఎవరి లెక్కలు వారివే. డాలస్‌లో అంబరాన్నంటుతుందనుకున్న ఈవెంట్.. అనుకున్నట్టుగా జరగలేదనేది మరో చర్చ. ఇంతకీ లోకేష్ డాలస్ తెలుగు డయాస్పోరా హిట్టా? ఫట్టా? ఎవరి వాదనలేంటి? అసలు నిజాలేంటి?
ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌డాలస్‌లో పర్యటించారు. ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగించారు.. కానీ ఈ మీటింగ్ ఇప్పుడు అనేక విమర్శలకు కారణమైంది. ముఖ్యంగా లోకేష్‌కు విదేశాల్లో ఫాలోయింగ్ లేదు అనేలా కొందరు వైసీపీ నేతలు సరికొత్త ప్రచారానికి తెరలేపడానికి ఊతమిచ్పింది. ప్రస్తుతం ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. డాలస్‌లో తెలుగు డయాస్పోరాకు సంబంధించిన విజువల్స్ ఇవి. లోకేష్ మీటింగ్‌కు అసలు ఎవరూ హాజరుకాలేదని.. అసలు జనాలే రాలేదని.. విదేశాల్లో లోకేష్‌ను పట్టించుకునే వారే లేరంటూ వైసీపీ సోషల్ మీడియా ఊదరగొడుతోంది.
లోకేష్‌ను టార్గె్ట్ చేస్తున్నారంటూ కంటర్ అటాక్
అయితే ఇదంతా తప్పుడు ప్రచారమని ఖండిస్తున్నారు టీడీపీ నేతలు. మీటింగ్ ప్రారంభం కాకముందు తీసిన వీడియోను వైరల్ చేస్తున్నారని.. అనవసరంగా లోకేష్‌ను టార్గెట్ చేస్తున్నారని కౌంటర్ అటాక్ ప్రారంభించారు. మరి ఏది నిజం? ఏది అబద్ధం? అనే దానిపై ఇప్పుడు పెద్ద డిబేట్ నడుస్తోంది.
డాలస్.. ఓ మినీ తెలుగు స్టేట్స్..
నిజానికి డాలస్ అనేది తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే సిటీ. ఇదో మినీ తెలుగు స్టేట్స్ అని చెప్పుకోవచ్చు. అంతలా ఉంటుంది ఇక్కడ తెలుగువారి జనాభా. అందుకే ఎలాంటి తెలుగు ప్రజల ఈవెంట్‌కు అయినా తరలివస్తారు అక్కడివారు. అలాంటిది టీడీపీ అభిమానులు ఎక్కువగా ఉండే డాలస్‌లో లోకేష్‌కు సభకు జనాలు రాలేదు అనేది కాస్త నమ్మబుల్‌గా లేదు. కానీ వైసీపీ ఆరోపణలు, టీడీపీ కౌంటర్‌లో ఏదీ పూర్తి నిజం కాదనేది అసలు నిజం.
10 వేల మంది కెపాసిటీ స్టేడియం..
వైసీపీ చెబుతున్నట్టు లోకేష్ సభ పూర్తిగా అట్టర్‌ఫ్లాప్ కాదు.. అలాగని టీడీపీ చెబుతున్నట్టు పూర్తిగా గ్రాండ్ సక్సెస్ కాదు. ఎందుకంటే లోకేష్ మీటింగ్‌కు బుక్ చేసిన స్టేడియం 10 వేల మంది కెపాసిటీ. కానీ ఇందులో సగం కూడా నిండలేదు. కేవలం 2 వేల నుంచి 2 వేల 500 మంది వరకు మాత్రమే వచ్చారన్న చర్చ డాలస్‌లో కాస్త గట్టిగానే జరుగుతోంది. ఎప్పటి నుంచో టీడీపీని నమ్ముకుని ఉన్నవాళ్లే ఈ సారి దూరంగా ఉన్నారంటూ ప్రవాసాంధ్రులు ఫైర్ అవుతున్నారు. ఎంతో గ్రాండ్ సక్సెస్ అవ్వాల్సిన నారా లోకేష్ డాలస్ టూర్.. కేవలం ఇద్దరి వ్యక్తుల వల్లే తేలిపోయిందన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. రవి వేమూరి, రాజా పిల్లి. వీరిద్దరు టీడీపీ NRI వింగ్ లీడర్లు. వీరిద్దరి కారణంగానే లోకేష్ సభ అనుకున్నంతగ్రాండ్ సక్సెస్ కాలేదనే చర్చ మొదలైంది. అందులో ఒకరు APNRTS చైర్మన్ వేమూరి రవి అయితే.. ఇంకొకరు టెక్సాస్‌లో టీడీపీ వ్యవహరాలు చూస్తున్న పిల్లి రాజా అంటున్నారు. ఎప్పటినుంచో టీడీపీకి అండగా ఉంటున్న వారందర్నీ పక్కన పెట్టి.. వీళ్లిద్దరే పెత్తనం చెలాయించడం వల్లే డాలస్ మీటింగ్‌కు జనం పెద్దగా రాలేదంటున్నారు.
NRI నేతలను కలుపుకుపోవడం లేదనే చర్చ
టీడీపీ NRI వింగ్ చాలా స్ట్రాంగ్. ముఖ్యంగా అమెరికాలో.. మరీ ముఖ్యంగా తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే డాలస్‌లో. కానీ ఎప్పుడైతే వీరిద్దరి చేతికి బాధ్యతలు వచ్చాయో.. అప్పటి నుంచి ఏకఛత్రాధిపత్యం పెరిగిందనే ఆరోపణలు వినిపించడం మొదలైంది. ఇతర NRI నేతలను కలుపుపోవడం అనే ఆలోచనే కూడా లేదు అనేది వినిపిస్తోంది. ఎవరినీ లెక్కచేయకపోవడం, అంతా మా ఇష్టం అన్నట్లు ఇద్దరూ వ్యవహరించడం వల్లే చాలామంది టీడీపీ అభిమానులు, ప్రవాసాంధ్రులు ఈ మీటింగ్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఏర్పాట్లతో పాటు వచ్చిన వారికి భోజన ఏర్పాట్లు కూడా సరిగా లేవనే ఆరోపణలు వినిపించాయి. దానికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.
Also Read: అధికారం ఉంటే నై.. కోల్పోయాక సై.. కేటీఆర్‌కు మరో దెబ్బ
మొత్తానికి ఇద్దరు వ్యక్తుల వల్ల విదేశాల్లో టీడీపీ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనేది ఇప్పుడు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Story By Vamshi Krishna, Bigtv