E-Paper
Advertisement

Osmania University: ఓయూకు రావాలంటే ధైర్యం కాదు.. అభిమానం ఉండాలి, ఉస్మానియాలో రెండోసారి సీఎం రేవంత్

Osmania University: ఓయూకు రావాలంటే ధైర్యం కాదు..   అభిమానం ఉండాలి,  ఉస్మానియాలో రెండోసారి సీఎం రేవంత్
Advertisement

Osmania University: తెలంగాణ భవిష్యత్‌కు పునాది వేసేది ఓయూ అని  అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.  ఇక్కడికి రావాలంటే ధైర్యం కాదని, అభిమానం ఉండాలన్నారు. ఓయూపై తను చెప్పలేనంత  అభిమానం ఉందన్నారు. దేశంలోని అతి పురాతనమైన చరిత్ర కలిగినది ఉస్మానియా యూనివర్సిటీ అని, 108 ఏళ్లు చరిత్ర ఉందన్నారు.

Advertisement

ఉస్మానియా యూనివర్సిటీలో రెండోసారి ముఖ్యమంత్రి

ఓయూకు వెళ్లే ముందు పుస్తకాలు చదవాలని కొంతమంది తనతో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అది చదివి ప్రిపేరై మాట్లాడలని సలహా ఇచ్చారన్నారు. కానీ ఆ అవసరం లేదని, ఈ వర్సిటీ గురించి తన మనసులో అనుకున్నదే చెప్పాలనుకున్నట్లు వివరించారు. ప్రజావారోత్సవాల్లో భాగంగా బుధవారం ఉస్మానియా యూనివర్సిటీని రెండోసారి సందర్శించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. 

Advertisement

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నా తమ్ముళ్లున్న యూనివర్సిటీకి రావడానికి తనకు ధైర్యం ఉందన్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమం నడపడంలో ఓయూ కీలకపాత్ర పోషించిందన్నారు. ఫామ్ హౌస్‌లో సంపాదించుకున్న వాటాలను విద్యార్థులు అడగడం లేదని, సమాన అవకాశాలు ఇవ్వాలని మాత్రమే కోరారన్నారు.

ప్రజావారోత్సవాల్లో ఉస్మానియాకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

ఈ వర్సిటీని కాలగర్భంలో కలపాలని కొంతమంది ప్రయత్నించారని తెలిపారు. పేదరికం చూడటానికి మెర్సిడెస్ బెంజ్ కారులో రాలేదన్నారు. తాను గుంటూరులో చదువుకోలేదని, తెలంగాణలోని మారుమూల పల్లెటూరులో చదువుకున్నానని గుర్తు చేశారు.

నల్లమల్ల అటవీ ప్రాంతంలో దళిత, బహుజన వర్గాలతో కలిసి పెరిగానని, తాను ప్రభుత్వం పాఠశాల, కాళాశాలల్లోనే చదువుకున్నారని వివరించారు. తనకు గొప్ప భాష రాకపోవచ్చు.. ప్రజల మనసు చదవడం తనకు వచ్చన్నారు. తెలంగాణ వస్తే స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు వస్తాయని విద్యార్థులు భావించారని అన్నారు.

ALSO READ: మా టార్గెట్ 100 యూనికార్న్ సంస్థలు-సీఎం రేవంత్‌రెడ్డి

విద్యార్థులు రాజకీయ పార్టీలో ఉచ్చులో పడొద్దని, మంచిగా చదువుకోవాలన్నారు. నాయకుల మోచేతి నీళ్లు తాగే ఆలోచనలు చేయవద్దన్నారు. వ్యవసాయం తెలిసినవాడిని ఉత్తమాటలు చెప్పనన్నారు. తెలంగాణకు పట్టిన చీడకు ఏ మందు కొట్టలో తనకు తెలుసన్నారు.

తనకు ఇంగ్లీష్ రాదని అనుకుంటున్నారని.. చైనా, జర్మనీ, జపాన్ వాళ్లకు ఇంగ్లీష్ రాదన్నారు. మానవత్వం, మనసు ఉండాలని, అందుకు ఇంగ్లీష్ అవసరం లేదన్నారు. భాష అనేది కమ్యూనికేషన్ కోసం మాత్రమేనని, నాలెడ్జ్ కాదన్నారు. ఇంగ్లీష్ రాదని ఎవరూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదన్నారు. యూనివర్సిటీలో నైపుణ్యం ఉన్నవారికే ఉద్యోగాలన్నారు. 

ఉస్మానియా అంటే క్వాలిటీ విద్యకు అడ్రస్ గా ఉండాలన్నారు. ఓయూ అభివృద్ధికి ఇప్పుడు వెయ్యి కోట్లు కేటాయించామన్నారు. గ్రామీణ ప్రాంతాల సమస్యలను తాను అర్థం చేసుకున్నానని, మా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏదైనా పేదలు, నిస్సహాయుల్ని దృష్టిలో పెట్టుకుని ఉంటుందన్నారు.జయ జయహే గీతాన్నని గతంలో తొక్కిపెట్టాలని చూస్తే, మేం వచ్చాక రాష్ట్ర గీతంగా ప్రకటన చేశామన్నారు.

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ. 1000 కోట్లు విడుదల చేసింది. వాటిలో విశాల రోడ్స్, పార్క్స్ , వాకింగ్, సైకలింగ్ ట్రాక్స్, కాలేజ్, హాస్టల్ , బోజనశాల, జిమ్, క్రీడా ప్రాంగణాలు నిర్మాణాలు జరగనున్నాయి. హెరిటేజ్ పార్క్, బహుళ జీవ వైరుధ్య పార్క్, శిల్పాలు ఏర్పాటు చేయనుంది. అలాగే అమర వీరల స్మారక జ్యోతి ఏర్పాటు‌కు ప్రతిపాదన వచ్చింది. దీనిపై విద్యార్థులతో చర్చించి వారి సలహా మేరకు ఫైనల్ చేయనుంది ప్రభుత్వం.

 

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×