E-Paper
Advertisement

సురేఖకు సవాళ్ల మీద సవాళ్లు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా?

సురేఖకు సవాళ్ల మీద సవాళ్లు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా?
Advertisement

Konda Surekha:హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం.. సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయడం.. కొండా సురేఖ రియాక్ట్ అవడం.. వెంటవెంటనే జరిగిపోయాయ్. ఇప్పుడందరి చూపు.. కొండా సురేఖ తర్వాత అడుగులు ఏంటనే దానిపైనే ఉన్నాయ్.

‘నా అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్‌నే నమ్మండి

Advertisement

ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియాలో కొండా సురేఖ పేరుతో ఉన్న ఫేస్ బుక్ హ్యాండిల్‌లో.. త్వరలోనే కీలక ప్రకటన ఉంటుందనే పోస్ట్.. స్టేట్ పాలిటిక్స్‌ని షేక్ చేసింది. ఈ ప్రచారాన్ని.. సురేఖ ఖండించారు. అదంతా.. అవాస్తవమని ఎక్స్‌లో తన అధికారిక ఖాతా నుంచి పోస్టు చేశారు. తమ పేరుతో ప్రచారమవుతున్న వార్తల్లో గానీ, పోస్టులతో గానీ తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్‌లో వచ్చే సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు.

సురేఖ బర్తరఫ్ బాధాకరమన్న టీపీసీసీ చీఫ్

Advertisement

మరోవైపు.. కొండా సురేఖ బర్తరఫ్ బాధాకరమన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ ఆధారంగానే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సీఎంకు ఎవరిని బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం లేదన్నారు.

క్షమాపణ చెప్పలేదంటూ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఫైర్

సురేఖ బర్తరఫ్ వ్యవహారం.. ఆవిడ చేజేతులా చేసుకున్న వ్యవహారమేనన్నరాు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు. సీఎంని.. కూతురు విమర్శిస్తే కనీసం క్షమాపణ చెప్పకపోవడమేంటన్నారు.

ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానన్న సారయ్య

కొండా సురేఖకు.. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సవాల్ విసిరారు. కొండా ఫ్యామిలీకి నిజంగా బలం ఉంటే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలన్నారు. తాను కూడా స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తానని సవాల్ విసిరారు.

Also read :సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమరం.. మాటల తూటాలకు రెడీ!

తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ

మొత్తంగా కొండా సురేఖ వ్యవహారం.. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి.. కొండా సురేఖను బీఆర్ఎస్‌లో చేర్చుకోబోమని కామెంట్ చేశారు. ఆవిడ నెక్ట్స్ స్టెప్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Tags

Related News

ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ లేఆఫ్స్.. లక్ష మంది ఉద్యోగులకు షాక్!

సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమరం.. మాటల తూటాలకు రెడీ!

కులాన్ని మార్చేసి మరీ ఏపీ DSC లో ఉద్యోగాలు.. బిగ్ టీవీ ఆపరేషన్‌లో బయటపడ్డ సంచలనాలు

సొంత పార్టీపై సెటైర్లు వేస్తే సీన్ రివర్స్.. కాంగ్రెస్‌లో కొత్త రూల్!

ముఖం బాగ‌లేక అద్దం ప‌గ‌ల గొట్టిన‌ట్టు…! అద్దంలా ఉన్న‌దున్న‌ట్టు చూపితే అంత ఉలుకెందుకు? బిగ్ టీవీ ఇన్‌స్టాగ్రామ్‌ను నిషేధిస్తే నిజాలు ఆగుతాయా?

ఏపీలో DSC స్కాం ఎఫెక్ట్.. బిగ్ టీవీ సోషల్ మీడియా అకౌంట్ బ్లాక్!

అసెంబ్లీని బ‌హిష్క‌రించిన మాజీ సీఎంలు.. ప్ర‌తిన‌ బూని మ‌ళ్లీ సీఎంగానే అడుగుపెట్టి.. ! జ‌య‌లలిత ఎపిసోడ్ టోట‌ల్ డిఫ‌రెంట్‌..

Big Stories

Advertisement
×