Ahmed Shahzad On Imam-ul-Haq: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ ( Pakistan vs England) మధ్య టెస్ట్ సిరీస్ ( Pakistan tour of England 2026) జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ టోర్నమెంటులో ఇప్పటికే రెండు టెస్టులు ఓడిపోయిన పాకిస్తాన్ సిరీస్ కూడా చేజేతులా మిస్ చేసుకుంది. మరో టెస్ట్ మిగిలి ఉన్నప్పటికీ అందులో కూడా పాకిస్తాన్ ను ఓడించి వైట్ వాష్ చేస్తామని ఇంగ్లాండ్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ గాయం పై (Imam-ul-Haq Injury) తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. అతనిపై రెండు సంవత్సరాల పాటు బ్యాన్ విధించే ఛాన్సులు కూడా కనిపిస్తున్నాయి.
పాకిస్తాన్ డేంజర్ ఆటగాడు ఇమామ్ ఉల్ హక్ (Imam-ul-Haq Injury) గాయం గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో… పాకిస్తాన్ మాజీ ఆటగాడు అహ్మద్ షెహజాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యాక్టింగ్ లో ఇమామ్ ఉల్ హక్ కు ఆస్కర్ అవార్డు ఇవ్వాల్సిందేనని పరువు తీశారు. గాయం పేరుతో నాటకాలు ఆడుతున్నాడని సెటైర్లు పేల్చారు. ఇంగ్లండ్ మైదానాలు, బౌలర్లను చూసి, ఇమామ్ భయపడిపోయాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ల భయానికి ఇమామ్ ప్యాంట్ తడిపేసుకున్నాడని ఆరోపణలు చేశారు.
ఇమామ్ ఉల్ హక్ గాయం పేరుతో నాటకాల ఆడుతున్నాడు తప్ప… అతడికి ఏమీ కాలేదని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. అందరూ జాలి చూపాలని మైదానంలో కుంటుకుంటూ ఇమామ్ వచ్చాడని పేర్కొన్నారు. ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయని షాకింగ్ ఆరోపణలు చేశారు. ఇలాంటి దద్దమ్మల కారణంగానే పాకిస్తాన్ పరువు గంగలో కలుస్తోందని వెల్లడించారు. ఇతనిపై రెండు సంవత్సరాల కాలం పాటు బ్యాన్ కాకుండా పర్మనెంట్గా సరిపోయి వెయిట్ వేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఇలాంటి వెధవలకు బుద్ధి వస్తుందని హెచ్చరించారు పాకిస్తాన్ మాజీ ఆటగాడు అహ్మద్ షెహజాద్.
పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండవ టెస్టు ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. లండన్ లోని లార్డ్స్ వేదికగా జరిగిన ఈ టెస్ట్ సందర్భంగా పాకిస్తాన్ ఆటగాడు ఇమామ్ ఉల్ హక్ కాలికి గాయమైంది. అయితే ఈ గాయం ఎలా అయిందో తెలియదు కానీ… మొదటి రోజు ఫీల్డింగ్ చేసి… మనోడు సైడ్ అయిపోయాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ కూడా చేయలేదు. మొదటి ఇన్నింగ్స్ వదిలేసిన సెకండ్ ఇన్నింగ్స్ సమయానికి ఇమామ్ సెట్ అవుతాడని అందరూ భావించారు. కానీ అక్కడ కూడా దెబ్బేశాడు. దీంతో పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయింది.