E-Paper
Advertisement

ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ లేఆఫ్స్.. లక్ష మంది ఉద్యోగులకు షాక్!

ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ లేఆఫ్స్.. లక్ష మంది ఉద్యోగులకు షాక్!
Advertisement

Volkswagen Layoffs:జర్మనీ కార్ల తయారీ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ భారీ సంఖ్యలో ఉద్యోగులను తగ్గించుకోనుంది. ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా.. ఈ దశాబ్దం చివరినాటికి లక్ష ఉద్యోగాలకు కోత పెట్టనుంది. ఈ మేరకు యాజమాన్యం, కార్మిక సంఘాలు అంగీకారానికి వచ్చాయని కంపెనీ ప్రకటించింది.

కార్ల దిగ్గజానికి కష్టకాలం.. ఉద్యోగులపై వేటు!

మొదట 50 వేల మందిని తొలగించాలని భావించినా.. మరో 50 వేల మంది తగ్గింపు ప్రణాళికను కూడా ఆమోదించారు. ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్‌లో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల 67 వేల మంది పనిచేస్తున్నారు. వీరిలో ఒక్క జర్మనీలోనే.. 43 శాతం మంది పనిచేస్తున్నారు. తాజా నిర్ణయంతో.. దాదాపు 15 శాతం మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు.

నాలుగు ప్లాంట్లు క్లోజ్.. లక్ష ఉద్యోగాలు కట్

Advertisement

ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అవుతున్న భారీ ఖర్చు, చైనా కంపెనీల నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీ, అంతర్జాతీయ టారిఫ్‌ల ఒత్తిళ్లను తట్టుకునేందుకే.. ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఉద్యోగాల కోతతో పాటు జర్మనీలోని నాలుగు ప్రధాన ప్లాంట్లను దశలవారీగా మూసివేయనున్నారు.

also read:సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమరం.. మాటల తూటాలకు రెడీ!

కార్మిక సంఘాలతో రాజీకి వచ్చి మరీ

Advertisement

గతంలో దివాలా సమయంలో జనరల్ మోటార్స్ సంస్థ తీసుకున్న నిర్ణయాల రికార్డులను సైతం ఫోక్స్‌వ్యాగన్ లేఆఫ్‌లు అధిగమించాయి. తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు కార్మిక సంఘాలతో రాజీకి వచ్చి మరీ.. ఈ భారీ కోతలకు సిద్ధమవ్వడం ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఆసక్తిగా మారింది.

Tags

Related News

అందరు బాగుండాలి.. అందులో నేనుండాలి! ‘బంగారం’ పరమార్థం ఇదే! తెలంగాణ ప్రజల ‘బంగారు’ సందేశం..! ఆనవాయితీకి ఆధారమైన ఆ పురాణగాథలేమిటీ?

నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీల కోసం బీఆర్ఎస్ నయా స్కెచ్.. ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యేనా..?

పాలపిట్ట దర్శనం.. విజయానికి సంకేతం! పాలపిట్టతో తెలంగాణకు విడదీయలేని అనుబంధం..! పురాణాలేం చెబుతున్నాయి?

జగన్ హామీతోనే.. అంబటి ఆ వ్యాఖ్యలు? రివేంజ్ ప్లాన్ సిద్ధం!

అటు చెల్లి.. ఇటు లొల్లి.. జగన్ దారి ఎటు?

వారసత్వం కొనసాగిస్తున్న రాధా! నిలకడలేని రాజకీయమే రాధకు మైనస్‌.. తండ్రి నేపథ్యం, సామాజికవర్గమే కొండంత బలం…!

రహస్య మిత్రుల మధ్య గ్యాప్‌ పెంచిన బాబు! ఎస్‌ఐఆర్‌పై జగన్‌ నిరసన గళం.. సీఈసీ నియామకం సరికాదని పశ్చాత్తాపం…

బతుకమ్మ కుంటకు జీవం పోసిన సీఎం.. సిటీ జనం చిరస్థాయిగా రేవంత్‌ను గుర్తు పెట్టుకునేలా! ఆంక్షలు చేధించుకుని మరీ ఈసారి ఘనంగా సద్దుల బతుకమ్మ!

Big Stories

Advertisement
×