E-Paper
Advertisement

సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమరం.. మాటల తూటాలకు రెడీ!

సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమరం.. మాటల తూటాలకు రెడీ!
Advertisement

Telangana Assembly:కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేసిన బీఆర్ఎస్, ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఇతర హామీల అమలుపై సభలో గళమెత్తనుంది. 22A భూముల వ్యవహారాన్ని ప్రధాన అస్త్రంగా మార్చుకుని, విపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ఉమ్మడిగా కాంగ్రెస్‌ను కార్నర్ చేసేందుకు స్కెచ్ వేశాయి.

ఒక్కో అస్త్రం బయటకు..

Advertisement

రైతాంగ సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై సభలో వేడి వేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. వీటితో పాటు నిరుద్యోగ భృతి, కొత్త ఉద్యోగాల భర్తీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు అస్త్రశస్త్రాలతో రెడీగా ఉన్నాయి.

కాంగ్రెస్‌ను చుట్టుముట్టేందుకు విపక్షాల మాస్టర్ ప్లాన్!

Advertisement

ప్రతిపక్షాల దాడిని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ ఎదురుదాడి వ్యూహాన్ని రచిస్తోంది. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనా లోపాలను, వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని భావిస్తోంది. అదే సమయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని, నిధుల కోతను లేవనెత్తుతూ బీజేపీకి కౌంటర్ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇక ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సభకు హాజరుకాకపోవడంపై విమర్శలు గుప్పించి, ప్రతిపక్షాల ఆరోపణల ధాటిని తగ్గించే ఆలోచనలో అధికారపక్షం ఉంది.

Also read :సొంత పార్టీపై సెటైర్లు వేస్తే సీన్ రివర్స్.. కాంగ్రెస్‌లో కొత్త రూల్!

సెప్టెంబర్ 7న అసెంబ్లీలో రచ్చ రచ్చే

సెప్టెంబర్ 7 నుంచి జరిగే సమావేశాల్లో మాటల తూటాలు పేలడం ఖాయంగా కనిపిస్తోంది. వ్యూహాలకు ప్రతివ్యూహాలు సిద్దం చేసుకుంటున్న అధికార, ప్రతిపక్షాల పోరులో ఎవరి ఎత్తుగడలు ఫలించనున్నాయో చూడాలి.

Tags

Related News

ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ లేఆఫ్స్.. లక్ష మంది ఉద్యోగులకు షాక్!

సురేఖకు సవాళ్ల మీద సవాళ్లు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా?

కులాన్ని మార్చేసి మరీ ఏపీ DSC లో ఉద్యోగాలు.. బిగ్ టీవీ ఆపరేషన్‌లో బయటపడ్డ సంచలనాలు

సొంత పార్టీపై సెటైర్లు వేస్తే సీన్ రివర్స్.. కాంగ్రెస్‌లో కొత్త రూల్!

ముఖం బాగ‌లేక అద్దం ప‌గ‌ల గొట్టిన‌ట్టు…! అద్దంలా ఉన్న‌దున్న‌ట్టు చూపితే అంత ఉలుకెందుకు? బిగ్ టీవీ ఇన్‌స్టాగ్రామ్‌ను నిషేధిస్తే నిజాలు ఆగుతాయా?

ఏపీలో DSC స్కాం ఎఫెక్ట్.. బిగ్ టీవీ సోషల్ మీడియా అకౌంట్ బ్లాక్!

అసెంబ్లీని బ‌హిష్క‌రించిన మాజీ సీఎంలు.. ప్ర‌తిన‌ బూని మ‌ళ్లీ సీఎంగానే అడుగుపెట్టి.. ! జ‌య‌లలిత ఎపిసోడ్ టోట‌ల్ డిఫ‌రెంట్‌..

Big Stories

Advertisement
×