డ్రిబ్లింగ్, అసిస్ట్, షాట్స్, గోల్.. వీటన్నింటిలో మెస్సీ ఎక్స్‌పర్ట్. ఎస్పెషల్లీ మెస్సీ డ్రిబ్లింగ్‌కు ఫ్యాన్ కానీ వారు ఉండరనే చెప్పాలి. ఇవన్నీ కూడా మెస్సీ తన పదాలతోనే చేస్తాడు. అందుకే ఆ కాళ్లకు ఉండే విలువ అంతా ఇంతా కాదు. ఆ విలువ కారణంగానే ఇండియాలోనే మెస్సీ ఎక్కడా కూడా ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అసలు కాళ్లకు విలువేంటి? దానికి ఇండియాలో ఆడకపోవడానికి కారణమేంటి? ఇవే కదా మీ డౌట్స్. అయితే చూసేయండి.
ఫుట్‌బాట్ దిగ్గజం లియోనెల్ మెస్సీ.. ఇండియాలో అడుగుపెడుతున్నాడన్న సమాచారం ఎప్పుడైతే బయటికి వచ్చిందో.. అప్పటి నుంచి ఇండియా మొత్తం అతని రాకకోసం ఎదురుచూసుంది. ముఖ్యంగా ఫుట్‌బాల్ ప్రియులు, మెస్సీ ఫ్యాన్స్ అయితే కళ్లల్లో వత్తులు వేసుకొని మరీ ఎదురు చూశారు. అలాంటి మెస్సీ గ్రౌండ్‌లో అడుగులు పెట్టగానే ఒక్కొక్కరిలో పునకాలు మొదలయ్యాయి. అతని పేరుతో మారుమోగిపోయాయి స్టేడియాలు.
మెస్సీ కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో పర్యటించాడు. కానీ ఎక్కడా కూడా ఎక్కువ సేపు ఉండలేదు.. ఎక్కడా ఫుల్‌గా ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడలేదు. గ్రౌండ్‌లో కాసేపు పరుగులు.. కొన్ని ఫ్రీ కిక్స్ మాత్రమే కనిపించాయి. మెస్సీ ఇండియాలో ఫుల్ ఫ్లెడ్జ్‌లో ఆడాలని.. అతని ఆటను ప్రత్యక్షంగా చూడాలని ఏ ఫ్యాన్‌కు ఉండదు. అందుకే చాలా మంది ఒక్క మ్యాచ్ అయినా ఆడకపోడా అని ఎదురు చూశారు. అయితే దీనికి ఓ ప్రత్యేక కారణం ఉందని లెటెస్ట్‌గా బయటికి వచ్చింది. మెస్సీ ఇక్కడే కాదు.. ప్రపంచంలో ఏ దేశంలో పర్యటించినా ఇవే సీన్స్ కనిపిస్తాయి. అయితే మెస్సీ గ్రౌండ్‌లో ఫుల్ మ్యాచ్‌లు ఆడకపోవడానికి కొన్ని లీగల్ చిక్కులే కారణం. ఎందుకంటే అతని కాలు చాలా విలువైనది. కాలుకు విలువేంటి అనుకుంటున్నారా.. అవును వరల్డ్ నెంబర్ వన్ ఫుట్‌బాల్ ప్లేయర్ అయిన మెస్సీకే కాదు.. ఎన్నో గోల్స్‌కు కారణమైన అతని కాలు కూడా చాలా విలువైనదే. అందుకే ఆ కాలుకు ప్రపంపంలోనే అత్యంత విలువైన ఇన్సూరెన్స్ ఉంది. దాని కారణంగానే ఇండియాలో ఫుల్ మ్యాచ్ ఆడలేకపోయాడు మెస్సీ.
మనం మాములుగానే ఇన్సూరెన్స్‌లు చేసుకుంటుంటాం. అయితే అథ్లెట్లు స్పెషల్‌గా ఇన్సూరెన్స్‌లు చేయించుకోవడం చాలా రోజులుగా వస్తున్నది. లియోనెల్ మెస్సీ కూడా తన అత్యంత విలువైన ఆస్తి అయిన ఎడమ కాలికి ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు. మెస్సీ డ్రిబ్లింగ్, షాట్స్, గోల్స్, అసిస్ట్.. ఇలా అన్నింటికి ఎడమ కాలి పాదాన్నే ఉపయోగిస్తాడు. అందుకే దానికి ఏకంగా 900 మిలియన్ డాలర్ల విలువైన ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు. ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఇది 7 వేల కోట్లకు పైమాటే. మనిషి బాడీ పార్ట్స్‌కు చేసిన ఇన్సూరెన్స్‌లో ఇదే అత్యంత ఖరీదైనదిగా భావిస్తారు. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ కాదు.. కేవలం బాడీ పార్ట్ ఇన్సూరెన్స్ మాత్రమే అని గుర్తుంచుకోవాలి.
ఒకవేళ మెస్సీ ఎడమకాలుకి కానీ.. ఎడమ కాలి పాదానికి ఏదైనా గాయమైతేనే ఇది వర్తిస్తుంది. మెస్సీ ఎడమ కాలికి ఏదైనా తీవ్ర ప్రమాదం జరిగితే.. దాని వలన అతని కెరీర్‌కి ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ గాయం కారణంగా మెస్సీ చాలా కాలం పాటు ఆటకు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి టైమ్‌లో ఈ ఇన్సూరెన్స్ పని చేస్తుంది. నార్మల్‌గా అయితే ఇలాంటి ఇన్సూరెన్స్‌లు అతడిని స్పాన్సర్ చేసే క్లబ్బులు చేస్తాయని తెలుస్తోంది. అయితే ఈ ఇన్సూరెన్స్ మెస్సీ సొంతంగా చేయించుకున్నాడా? లేక క్లబ్ చేసిందా? అనే విషయంలో సీక్రెసి మెయింటేన్ చేస్తున్నారు.
మెస్సీ అంటేనే సాకర్ వరల్డ్‌లో ఓ స్టార్. అలాంటి స్టార్ ప్లేయర్‌పై నేషనల్ టీమ్ కావొచ్చు.. క్లబ్‌లు కావొచ్చు వందల మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతాయి. ఒకవేళ అతను ఆడలేకపోతే అది తీవ్ర నష్టం అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అలాంటి సమయంలో ఈ ఇన్సూరెన్స్ ఓ సెక్యూరిటీలా పనిచేస్తుంది. డేవిడ్ బెకహమ్, క్రిస్టియానో రొనాల్డో వంటి ఇతర ఫుట్‌బాల్ దిగ్గజాలు కూడా తమ కాళ్లకు భారీ మొత్తంలో ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. అయితే వీటన్నింటి కంటే మెస్సీ ఎడమ పాదం విలువ కాస్త ఎక్కువ.
ఇప్పుడీ ఇన్సూరెన్స్ కారణంగానే ఇండియాలో ఫుల్ ఫుట్‌బాల్ మ్యాచ్ మెస్సీ ఆడలేకపోయాడని తెలుస్తోంది. మెస్సీ కేవలం తన సొంతదేశమైన అర్జెంటీనా, క్లబ్ ఇంటర్ మయామి తరుపున ఆడుతున్నాడు. ఈ రెండు టీమ్స్ అధికారికంగా షెడ్యూల్ చేసిన మ్యాచ్‌ల సమయంలోనే ఈ పాలసీ వర్తిస్తుంది. అంటే మెస్సీ వీటి తరుపున ఆడుతూ గాయపడితేనే ఆర్థిక పరిహారం అందుతుంది. అలా కాకుండా ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడుతూ గాయపడితే వర్తించదు. అప్పుడు అతడు భారీ మొత్తంలో నష్టపోవాల్సి ఉంటుంది. అందుకనే మెస్సీ భారత్‌తో పాటు.. ఇతర దేశాల్లో ఎలాంటి పూర్తి స్థాయి మ్యాచ్‌లు ఆడడం లేదు.
కేవలం ఫుట్‌బాల్ ప్లేయర్స్ మాత్రమే కాదు.. బాస్కెట్‌బాల్‌లోనూ ఇలాంటి పాలసీలు ఉన్నాయి. దిగ్గజ బాస్కేట్‌బాల్ ప్లేయర్ మైఖేల్ జోర్డాన్‌కు కూడా ఇలాంటి పాలసీ ఉంది. కానీ తన కాంట్రాక్ట్‌లో లవ్ ఆఫ్ ది గేమ్ అనే ప్రత్యేక నిబంధన ఉండేది. దాని ప్రకారం ఆయన ఎక్కడైనా, ఎవరితోనైనా ఆడేందుకు స్వేచ్ఛ ఉండేది. కానీ మెస్సీ ఇన్సూరెన్స్‌లో అలాంటి లవ్ ఆఫ్ ది గేమ్ క్లాజ్ లేదు. ఇది మెస్సీ ఫ్యాన్స్‌కు అస్సలు డైజెస్ట్ కాని విషయం.
అందుకే మెస్సీ కోల్‌కతాకు వెళ్లినా.. హైదరాబాద్‌కు వచ్చినా.. ముంబైలో సందడి చేసినా.. కాసేపు ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేశాడు.. ఫ్రీ కిక్స్ ఇచ్చాడు కానీ ఎక్కడా కూడా ఫుల్ గేమ్ ఆడలేదు. ఒక పాలసీకే దాదాపు 900 మిలియన్ డాలర్ల కవరేజీ ఉంటే.. అసలు మెస్సీ సంపాదన ఎంత? ఆ సంపాదన ఎలా వస్తుంది? ఆ వస్తున్న సంపాదనను అతను ఏం చేస్తున్నాడు?
మెస్సీ.. ఫుట్‌బాల్ వరల్డ్‌లో ఓ మకుటం లేని మహారాజు. అందుకే ఇండియాలో అడుగుపెట్టగానే అపూర్వ స్వాగతం పలికారు అతనికి. మరి ఆటతో పాటు అడ్వర్‌టైజ్‌మెంట్లు, డీల్స్‌తో అతను ఎంత సంపాదిస్తున్నాడు? ఆ సంపాదించినదంతా ఏం చేస్తున్నాడు?
లియోనెల్ మెస్సీ.. అతని పేరే ఫ్యాన్స్‌కు ఓ కిక్కు. మన ఇండియాలో క్రికెట్ అంటే ఓ మతం. అందులో సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీ ఆరాధ్య దేవుళ్లు. సంపాదనలో కూడా వీరే టాప్. కానీ మెస్సీతో కంపేర్ చేస్తే వీరేవ్వరూ కూడా అతని దరిదాపుల్లోకి రారు. దీనికి ఓ కారణం ఉంది. క్రికెట్‌కు కొన్ని దేశాల్లో మాత్రమే ఆదరణ. ఫుట్‌బాల్ అలా కాదు. ప్రపంచంలోని అనేక ధనవంతమైన దేశాల్లో విపరీతంగా ఆదరిస్తారు. అందుకే సంపాదనలో కూడా మెస్సీ టాప్‌లోనే ఉన్నాడు.
కొన్ని రికార్డుల ప్రకారం మెస్సీ సంపాదన 7 వేల 700 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో క్లబ్స్ నుంచి వచ్చే ఆదాయంతో పాటు.. ఫుట్‌బాట్ అగ్రిమెంట్స్, ఎండార్స్‌మెంట్‌లు అనేక వ్యాపారాలు ఉన్నాయి. కేవలం ఎండార్స్‌మెంట్‌ల ద్వారానే 70 మిలియన్ డాలర్లు సంపాదిస్తారని తెలుస్తోంది. అడిడాస్, ఆపిల్, పెప్సీ, మాస్టర్ కార్డ్‌లాంటి గ్లోబల్ బ్రాండ్స్‌తో ఒప్పందాలు ఉన్నాయి మెస్సీ. ఇందులో అడిడాస్ డీల్ కాస్త స్పెషల్. ఎందుకంటే ఇది లైఫ్‌టైమ్ డీల్.
బార్సిలోనా, మియామి, అండోరా, లండన్‌లో అనేక ప్రాపర్టీలు మెస్సీ పేరుతో ఉన్నాయి. వీటితో పాటు మెస్సీ స్టోర్ పేరుతో వ్యాపారం కూడా చేస్తున్నాడు. దీని వాల్యూ 150 నుంచి 200 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. ఇక ఓ ప్రైవేట్ జెట్, హై ఎండ్ కార్లు, లగ్జరీ హోటళ్లు ఉన్నాయి మెస్సీకి. ఒక్కనెలలోనే మెస్సీ దాదాపు 42 కోట్ల వరకు సంపాదిస్తాడని తెలుస్తోంది.
ఇక ఇంటర్ మయామి క్లబ్ తరుపున ఆడుతున్న మెస్సీ.. ఏడాది 60 మిలియన్ డాలర్ల వరకు చార్జ్ చేస్తున్నాడు. అంతేకాదు 5 నుంచి 10 శాతం ఈక్విటీ షేర్ హోల్డర్ కూడా సొంతం చేసుకున్నాడు. ఒక్క ఏడాదిలోనే 200 మిలియన్ డాలర్ల వరకు అతని సంపాదన పెరిగింది.
మెస్సీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 510 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇందులో ఒక కమర్షియల్ పోస్ట్‌కు 2.7 మిలియన్ డాలర్లు చార్జ్ చేస్తాడు మెస్సీ. అతని ఇన్‌కమ్‌లో ఇన్‌స్టాగ్రామ్ నుంచి వచ్చే ఆదాయమే మెయిన్ అని చెప్పవచ్చు. ఈ సంపాదనకు తగ్గట్టుగానే చాలా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంటాడు మెస్సీ.
సంపాదించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటాడు మెస్సీ. యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్నాడు మెస్సీ. అంతేకాదు లియో మెస్సీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. చిన్నారులకు విద్య, వైద్యం, ఆటలు.. ఈ మూడింటి కోసం ఈ ఫౌండేషన్ పనిచేస్తూ ఉంటుంది.
11 ఏళ్ల వయసులో మెస్సీ గ్రోత్ హర్మోన్ డెఫిషియన్సీ కండిషన్‌తో బాధపడ్డాడు. ఆ సమయంలో FC బార్సిలోనా క్లబ్ అతడికి అండగా నిలిచింది. ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు తను. ఈ ఘటన అతడిలో ఓ మార్పును తీసుకొచ్చిందనే చెప్పాలి. అతని క్యారెక్టర్‌ను మెరుగుపర్చింది. అప్పటి నుంచి ఆ క్లబ్‌ను ఎప్పుడూ మర్చిపోలేదు మెస్సీ. 2007లో ఫౌండేషన్ ఏర్పాటు చేసిసప్పటి నుంచి క్యాన్సర్‌తో పోరాడే అనేక మంది చిన్నారులకు అండగా నిలిచాడు. ఇప్పటి వరకు 30 మిలియన్ యూరోలను పెడియాట్రిక్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లకు డోనేట్ చేశాడు మెస్సీ. క్యాన్సర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లకు కూడా తన వంతు సహాయం చేశాడు మెస్సీ. అతను మ్యాచ్‌లు ఆడే సమయంలో గోల్ చేసినప్పుడు కూడా సెలబ్రేషన్స్ కూడా అవెర్‌నెస్ పెంచేందుకు కేటాయించడం అనేకసార్లు చూశాం. అందుకే మెస్సీ కేవలం గోల్డ్‌న్ ఫుట్ ప్లేయర్ మాత్రమే కాదు.. గోల్డెన్ హార్ట్ ప్లేయర్ అంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే.. మెస్సీ ఓ సూపర్ స్టార్. అందుకే ఇంత క్రేజ్.
Story By Vamshi, Big Tv