Ind vs SA 3rd T20I: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 3rd T20I ) మధ్య ధర్మశాల వేదికగా జరిగిన మూడవ టి20 మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ సేన అదరగొట్టింది. ఈ మ్యాచ్ లో 118 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా చేదించిన టీమిండియా, రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా రెండు విభాగాల్లో అదరగొట్టిన టీమిండియా, దక్షిణాఫ్రికాలో చిత్తు చేసింది. రెండు టి20 లో ఓవర్ కాన్ఫిడెన్స్ తో దిగిన సౌత్ ఆఫ్రికా ప్లేయర్లకు చుక్కలు చూపించింది టీం ఇండియా. 118 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి 15.5 ఓవర్లలో ఛేదించింది సూర్య కుమార్ యాదవ్ సేన . దీంతో మూడవ టి20 మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఈ విక్టరీతో 5 టీ20 ల సిరీస్ లో 2-1 తేడాతో లీడ్ సంపాదించింది టీమిండియా.
టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మూడవ టి20 మ్యాచ్ ధర్మశాల లోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వేదికగా ( Himachal Pradesh Cricket Association Stadium, Dharamsala) జరిగింది. సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో నిర్ణయిత 20 ఓవర్లు వాడిన దక్షిణాఫ్రికా 117 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ మర్కరం 61 పరుగులతో రాణించగా మిగిలిన బ్యాటర్లు చతికెల పడ్డారు. అటు టీమిండియా బౌలర్లలో హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా అలాగే శివం దూబే చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక 118 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా బ్యాటర్లు అటాకింగ్ గానే ఆడారు. సిక్సర్ లో వీరుడు అభిషేక్ శర్మ 18 బంతుల్లో 35 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సిక్సులు పాటు మూడు బౌండరీలు ఉన్నాయి. 28 బంతుల్లో 28 పరుగులకు ఔట్ అయ్యాడు గిల్. చివరలో తిలక్ వర్మ, శివం దూబే మ్యాచ్ ఫినీష్ చేశారు. 118 పరుగుల లక్ష్యాన్ని 15.5 ఓవర్లు ఆడిన టీమిండియా 3 వికెట్లు నష్టపోయి విజయం సాధించింది.
టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మూడవ టి20 మ్యాచ్ లో కూడా శుభ్‌మన్ గిల్ పెద్దగా రాణించలేదు. గిల్ చెల్లెమ్మ షహనీల్ గిల్ ఇవాళ్టి మ్యాచ్ కు హజరయ్యారు. ఈ తరుణంలో తన బ్రదర్ గిల్ బాగా రాణించాలని పొర్లుదండాలు పెట్టింది షహనీల్ గిల్. అయినప్పటికీ గిల్ విఫలం అయ్యాడు. 118 పరుగుల లక్ష్యం చిన్నదైనప్పటికీ, గిల్ భయపడుతూ, కంగారుగా ఆడాడు. ఈ తరుణంలోనే 28 బంతుల్లో 28 పరుగులకు ఔట్ అయ్యాడు గిల్. దీంతో షహనీల్ గిల్ పొర్లుదండాలు పెట్టినా, శుభ్‌మన్ గిల్ ఫెయిల్యూర్ అయ్యారని ట్రోల్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. అటు ఈ మ్యాచ్ కు అభిషేక్ శర్మ కుటుంబ సభ్యులు కూడా వచ్చారు.
Shubman Gill’s sister praying for him 🙏
📸: JioHotstar#INDvSA #ShubmanGill #Dharamsala #CricketTwitter pic.twitter.com/TXP5k0nCAJ
— InsideSport (@InsideSportIND) December 14, 2025