E-Paper
Advertisement

Lionel Messi: ఇండియాలో మెస్సీ మ్యాచ్ ఆడకపోవడానికి కారణం ఇదేనా ? ఆ రూ.8 వేల కోట్ల భ‌యంతోనే!

Lionel Messi:   ఇండియాలో మెస్సీ మ్యాచ్ ఆడకపోవడానికి కారణం ఇదేనా ? ఆ రూ.8 వేల కోట్ల భ‌యంతోనే!
Advertisement

Lionel Messi:  అర్జెంటీనాకు చెందిన ప్రముఖ దిగ్గజ ఫుట్ బాల్‌ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ( Lionel Messi ) మన ఇండియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 13వ తేదీన ఇండియాలో అడుగుపెట్టిన లియోనెల్ మెస్సీ, ఆదివారం రోజున ముంబైలో కూడా పర్యటించారు. ఈ సందర్భంగా లియోనెల్ మెస్సీ ఎక్కడికి వెళ్ళినా ప్రజా ధారణ ఎక్కడ తగ్గడం లేదు. ఆయనను చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. అయితే, ఫుట్ బాల్ దిగ్గజం అయిన లియోనెల్ మెస్సీ ఇండియాలో అధికారిక, పూర్తి స్థాయిలో మ్యాచ్‌ మాత్రం ఆడలేదు. ఫ్రెండ్లీ మ్యాచ్ అంటూ ఐదు లేదా పది నిమిషాలు ఆడి, సమర్పయామి అనిపించాడు లియోనెల్ మెస్సీ. అయితే లియోనెల్ మెస్సీ ఫుల్ మ్యాచ్ ఆడక పోవడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయట. అదే అతని లెగ్ ఇంజురీ ఇన్సూరెన్స్.

Also Read: Lionel Messi private jet: మెస్సీ ఇండియాకు వ‌చ్చిన‌ ఈ విమానం ధ‌ర ఎంతో తెలుసా..దీని ఫీచ‌ర్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

ఇండియాలో లియోనెల్ మెస్సీ మ్యాచ్ ఆడక పోవడానికి కారణం ఇదే

Advertisement

మన ఇండియాలో లియోనెల్ మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ ఆడకపోవడానికి కారణం అతడు చేయించుకున్న ఇన్సూరెన్స్ పాలసీ అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మూడు రోజుల ఇండియా పర్యటనలో లియోనెల్ మెస్సీ, పూర్తి స్థాయిలో ఫుట్ బాల్ మ్యాచ్ అస్సలు ఆడలేదు. కేవలం హైదరాబాద్, కోల్ క‌తాలో ఐదు నిమిషాలు అలా మెరిశాడు. అయితే ఫుల్ మ్యాచ్ ఆడక పోవడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. లియోనెల్ మెస్సీ ఎడమ కాలుకు 900 మిలియన్ డాలర్ల ఇన్సూరెన్స్ ఉందట. అంటే మన ఇండియన్ రూపాయలలో 8 వేల కోట్ల విలువచేసే ఇన్సూరెన్స్ అన్నమాట. ఈ ఇన్సూరెన్స్ కారణంగానే ఇండియాలో మ్యాచ్ ఆడలేదట లియోనెల్ మెస్సీ.

దేశం తరఫున, లేదా ఫ్రాంచైజీ లీగ్ మ్యాచ్ లలో ఆడే సమయంలో మాత్రము కాలికి ఏదైనా గాయం జరిగితే ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుందట. కోల్ క‌తా, హైద‌రాబాద్ త‌ర‌హాలో ఎగ్జిబిషన్, ఫ్రెండ్లీ పేరుతో నిర్వహించే మ్యాచ్ లకు ఈ ఇన్సూరెన్స్ అస్సలు చెల్లుబాటు కాదని తెలుస్తోంది. అందుకే ఇండియాలో పర్యటించిన లియోనెల్ మెస్సీ, పూర్తిస్థాయి మ్యాచ్ ఎక్కడ ఆడలేదు. పైన పైన ఐదు నిమిషాల పాటు ఆడి వెళ్ళిపోయారు. అలా కాదని ఇండియాలో ఫుల్ మ్యాచ్ ఆడి గాయాల పాలు అయితే, ఆ ఇన్సూరెన్స్ అస్స‌లు చెల్లుబాటు కాదని తెలుస్తోంది. దానివల్ల లియోనెల్ మెస్సీకి తీవ్ర నష్టం వాటిలో ప్రమాదం ఉందట. అతని కెరీర్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది అంట. లియోనెల్ మెస్సీతో పాటు అతని క్లబ్, స్పాన్సర్లకు కూడా నష్టమే. క‌ట్టిన ఇన్సూరెన్స్ పాల‌సీ డ‌బ్బులు వృథా అవుతాయ‌ట‌. అందుకే రిస్క్ తీసుకోకుండా ఐదు నిమిషాల ఆట ఆడి వెళ్ళిపోయాడు లియోనెల్ మెస్సీ.

మెస్సీకి స‌చిన్ గిఫ్ట్‌

Advertisement

ముంబైలో ప‌ర్య‌టించిన లియోనెల్ మెస్సీకి అరుదైన గిఫ్ట్ ఇచ్చారు స‌చిన్ టెండూల్క‌ర్‌. త‌న 10వ నంబ‌ర్ జెర్సీని లియోనెల్ మెస్సీకి అందించారు స‌చిన్‌.

Also Read: U19 Asia Cup 2025: పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించిన టీమిండియా..పాయింట్ల ప‌ట్టిక‌లో మ‌నోళ్లే టాప్‌

Related News

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

రీ-ఎంట్రీపై ప‌గ‌టి క‌ల‌లు వ‌ద్దు..ఇక‌ రిటైర్మెంట్ ఇచ్చేసి, స‌న్యాసం తీసుకో !

Big Stories

Advertisement
×