E-Paper
Advertisement

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొత్తు వద్దే వద్దు..! అతన్ని చూసి ఇక్కడ ఓట్లేసే సీన్ లేదు..!?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొత్తు వద్దే వద్దు..! అతన్ని చూసి ఇక్కడ ఓట్లేసే సీన్ లేదు..!?
Advertisement

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండింట్లో ఒక సీటును కచ్చితంగా గెలవాలని గట్టి ప్రయత్నం మీదున్న బీజేపీకి.. జనసేనతో పొత్తు అంశం పంటికింద రాయిలా మారింది. ఎన్డీయేలో భాగంగా ఉన్న జనసేన పార్టీతో పొత్తులు, పవన్‌తో ఎన్నికల ప్రచారాలకు సంబంధించి ఓ వ్యూహంతో ఉండేది తెలంగాణ బీజేపీ.

కానీ దీన్ని పవన్‌ తన చేజేతులా చెడగొట్టి కూర్చున్నాడు. అతిగా స్పందించి తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేసే ప్రయత్నం చేశాడు. తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం రోజునే పనిగట్టుకుని మరీ ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’ అని పేరుతో రచ్చ రచ్చ చేసుకున్నాడు.

Advertisement

ఇది చాలదంటూ మమ్మల్ని అడుగు పెట్టనీయరా…? ఎవడబ్బ జాగీరు తెలంగాణ..? అని రెచ్చగొట్టే కామెంట్‌ చేసి మళ్లీ ఇక్కడ తెలంగాణవాదాన్ని తట్టిలేపాడు. దీన్ని కాంగ్రెస్‌ అందిపుచ్చుకున్నది. తెలంగాణ సెంటిమెంట్‌ను రాజేసింది. దీంతో పవన్‌ తోక ముడవక తప్పలేదు. పైగా అప్పటికే ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో పెట్టుకున్న గొడవ కూడా పవన్‌ను తెలంగాణ వ్యతిరేకి అని ముద్రవేసే ప్రయత్నం చేశారు చాలా మంది.

ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం వేసుకున్న ప్రణాళికలకు తూట్లు పడినట్టయ్యాయి. వాస్తవానికి ప్రధాని మోడీ హైదరాబాద్‌ వచ్చినప్పుడు పవన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణ ఎన్నికల్లో పవన్‌ పట్ల ఇక్కడ యువతలో ఉన్న అభిమానాన్ని పార్టీ ఎదుగుదలకు, అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగించుకోవాలనే ప్లానింగ్‌ చేశారు.

Advertisement

కానీ పవన్‌ తన వీరావేశంతో అంతా చెడగొట్టి కూర్చున్నాడనే కామెంట్స్‌ తెలంగాణ బీజేపీ నుంచి వినిపిస్తున్నది. అందుకే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనతో పొత్తుగానీ, మిత్రధర్మాన్ని అనుసరించి.. ప్రచారం చేయించుకునే అంశాన్ని గానీ కనీసం పరిగణలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది.

తాజాగా తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంచార్జి సునీల్‌ బన్సల్‌తో జరిగిన తెలంగాణ నేతల భేటీలో ఈ విషయం కీలకంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. మెజారిటీ నేతలంతా పవన్‌ ముచ్చట, పొత్తు, ప్రచారం అంతా బీజేపీని చెడగొట్టే వ్యవహారమే తప్ప మరోటి కాదని తేల్చేశారు. దీంతో రెండు సీట్లలో బీజేపీ అభ్యర్థులను పెట్టేందుకు డిసైడ్‌ అయ్యారు.

హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆ పార్టీ చీఫ్‌ రాంచంద్రరావు పోటీ చేసే అవకాశం కనిపిస్తున్నది. నల్లగొండ- వరంగల్‌- ఖమ్మం నియోజకవర్గం నుంచి ఇంకా పేరు ఖరారు కాలేదు. కానీ గ్రేటర్‌ ఎమ్మెల్సీపైనే బన్సల్‌ ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అన్ని ప్రధాన పార్టీలకు ఈ నియోజకవర్గంలో గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది.

ఇప్పటికే జనసేన నుంచి నల్లగొండ-ఖమ్మం నుంచి గడల శ్రీనివాసరావును బరిలోకి దింపాడు పవన్‌. ఖమ్మంలో కొంత పట్టు ఉండి.. అక్కడ ఓట్లు వస్తాయనే భావన ఓవైపు.. ఇలా శ్రీనివాస్‌ ద్వారా తెలంగాణలో తన పార్టీ ప్రచారానికి బీజం పడుతుందనే అంశాన్ని పవన్‌ ప్రయార్టీగా తీసుకున్నట్టుగా కనిపిస్తున్నది.

ఇక హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి అభ్యర్థిని పెట్టే ఆలోచనలో పవన్‌ ఉన్నట్టు కనిపించడం లేదు. జీహెచ్‌ఎంసీలో కొన్ని స్థానాల్లో పోటీకి రెడీగా ఉన్న ఆ పార్టీ .. ఇక్కడ ఇప్పుడు పోటీ చేయడం ద్వారా తమ బలం ఏపాటితో ముందే చెప్పినట్టయి.. గ్రేటర్‌లో మరింత పలుచనయ్యే అవకాశం ఉందనే వ్యూహాన్ని ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది.

తెలంగాణకు మేమే ఆల్టర్నేట్‌ అని రొమ్ము విరుచుకు చెబుతున్న బీజేపీకి.. ఇలాంటి సమయంలో పవన్‌ను చేరదీయడమంటే చంకలో పిల్లిని పెట్టుకుని ప్రయాణం చేసినట్టేనని భావిస్తున్నారు.

Tags

Related News

ఆకాశంలో రెక్కలు విప్పి ఎగిరే చేప.. దీని వెనుక ఉన్న అద్బుత రహస్యం ఇదే?

కూటమిలో కుమ్ములాట.. బరిలోకి దిగేదెవరు? ఇంకా క్లారిటీ ఇవ్వని పెద్దలు!

స్వేచ్ఛ చెప్పిందే నిజమైందా.. హెచ్‌సీఏ కుంభకోణంలో షాకింగ్ నిజాలు!

సంక్రాంతి తర్వాత గ్రామాల బాట.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్?

రాజకీయంగా చర్చకు వస్తున్న తెలుగు రాష్ట్రాలు! కరువు భయభ్రాంతులకు గురవుతున్న తెలంగాణ..! హింసాత్మక ఘటనలతో పరువు రచ్చకెక్కిన ఏపీ!

ఒక ఎమ్మెల్సీ సీటు గెలుపే లక్ష్యం.. నల్లగొండపై ఆశలు వదిలేసిన వైనం.. బన్సల్‌ రీ ఎంట్రీతో బీజేపీలో జోష్‌..!

టీడీపీని కలవరపెడుతోన్న ఆ సెంటిమెంట్.. విశాఖ మేయర్ మళ్లీ పీఠం కలేనా?

Big Stories

Advertisement
×