Bigg Boss 10:బిగ్ బాస్ సీజన్ 10 లో గత వారం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ను మూడు జోన్స్ గా బిగ్ బాస్ డివైడ్ చేశారు. అందులో వారి ఆట పర్ఫామెన్స్, ఆడియన్స్ మద్దతును బట్టి ఈ లెవెల్స్ డిసైడ్ చేయడం జరిగింది. అలా రెడ్,ఎల్లో, గ్రీన్ లెవెల్స్ గా డిసైడ్ చేశారు. రెడ్ జోన్ లో ఉన్న వారికి టాస్క్ నిర్వహించగా.. అందులో రాంప్రసాద్ ఆటలో నెగ్గి యెల్లో లెవెల్ కి వెళ్లారు. యెల్లో లెవెల్ లో ఉన్నవారు తమదైన ఆటతో ప్రేక్షకులను మెప్పించి, ఆటలో నెగ్గి గ్రీన్ లెవెల్ కి వెళ్లారు. అయితే గ్రీన్ లెవెల్ లోకి 5 మంది (త్రిగుణ్ , అమన్, ముఖేష్, దెబ్జానీ, నీతూ నటరాజ్) అడుగుపెట్టగా.. వీరు రెండు వారాల నామినేషన్ నుండి తప్పించుకోవడమే కాకుండా ఈ వారం హౌస్ మేట్స్ ను నామినేట్ చేసే అవకాశాన్ని కూడా పొందారు.
ఇకపోతే ఎనిమిదవ వారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. 50వ రోజుకు సంబంధించి మొదటి ప్రోమోను నిర్వాహకులు విడుదల చేయగా.. అందులో నామినేషన్ వార్ మొదలయ్యింది. అయితే ఈసారి నామినేట్ చేసే అవకాశం గోట్స్ కి లభించడం గమనార్హం. ప్రోమో విషయానికి వస్తే.. ఈ గోట్ అవతారంలో తదుపరి ఘట్టం ది అల్టిమేట్ గోట్. ఈవారం నామినేషన్ ప్రక్రియను గ్రీన్ లెవెల్ లో ఉన్న సభ్యులే ముందుండి నడిపించబోతున్నారు అంటూ గ్రీన్ లెవెల్ లో ఉన్న త్రిగుణ్ , అమన్, ముఖేష్, దెబ్జానీ, నీతూ నటరాజ్ లకు మిగిలిన వారిని నామినేట్ చేసే అవకాశం కల్పించారు.
also read:తెలుగు డబ్బింగ్ కి సిద్ధమైన ఒడిస్సా హిట్ మూవీ..ఏదో తెలుసా?
గ్రీన్ లెవెల్ సభ్యుల కోసం ఏడు స్లిప్స్ ఉంచబడ్డాయి. ఒక్కో స్లిప్ .. ఒక్కో సభ్యుడిని నామినేట్ చేయగల అధికారాన్ని అందిస్తుంది అంటూ నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు బిగ్ బాస్. మొదట నీతూ ఝాన్సీ ని నామినేట్ చేస్తూ .
టాస్కులన్నీ బాగా ఆడుతున్నావు. అన్నిట్లో స్ట్రాంగ్ గా ఉన్నావు. కానీ ఓన్ ఐడెంటిటీ మిస్ అయ్యింది అని నీతూ చెప్పగా.. టాస్కులన్నీ బాగానే ఆడుతున్నాను కదా అంటూ ఝాన్సీ అడిగింది. కానీ సపోర్ట్ లేకుండా ఆడట్లేదు అంటూ నీతూ తన వెర్షన్ వినిపించింది. బయట జరిగిన ముచ్చట్లు లోపల చెప్పడం అది నీ ఆట అంటూ ఝాన్సీ ప్రశ్నించింది. అలా ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచింది. ఆ తర్వాత ముఖేష్ రామకృష్ణను నామినేట్ చేయగా.. త్రిగుణ్ రాంప్రసాద్ ను నామినేట్ చేశారు. మొత్తానికైతే ఈ నామినేషన్ వార్ కాస్త గట్టిగానే సాగుతోంది.