E-Paper
Advertisement

వారసత్వం కొనసాగిస్తున్న రాధా! నిలకడలేని రాజకీయమే రాధకు మైనస్‌.. తండ్రి నేపథ్యం, సామాజికవర్గమే కొండంత బలం…!

వారసత్వం కొనసాగిస్తున్న రాధా! నిలకడలేని రాజకీయమే రాధకు మైనస్‌.. తండ్రి నేపథ్యం, సామాజికవర్గమే కొండంత బలం…!
Advertisement

దివంగత కాపు నేత వంగవీటి మోహన రంగాను పేద, బడుగు బలహీన వర్గాలు ముద్దుగా ‘రాబిన్‌ హుడ్’ అని పిలుచుకునే వారు. నిరుపేదలకు, నిరాశ్రుయులకు ఆయన పెద్ద దిక్కుగా ఉండేవాడనే పేరుంది. ఆయనను పేదల పెన్నిధిగా భావించే రోజులవి. విజయవాడ నగరంలో అణగారిన వర్గాల, పేద ప్రజల గొంతుకగా ఉండేవారు రంగా అన్న వంగవీటి రాధాకృష్ణ.

ప్రత్యర్థుల ఘర్షణల్లో అన్న హత్యకు గురైన తరువాత ఆ నాయకత్వ బాధ్యతలను మోహన్‌ రంగా స్వీకరించి తనదైన పంథాలో రాజకీయాలను నడిపాడు. ఆయన కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. తొలిసారిగా ఆయన విజయవాడ మున్సిపల్‌ ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాపు సామాజికవర్గం అండగా నిలవడం, తనదైన స్టైల్‌లో రాజకీయాలను నడిపి అందరినీ ఆకర్షించిన మోహన రంగా 1985లో విజయవాడ తూర్పు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.

Advertisement

అప్పటికే టీడీపీ కి చెందిన దేవినేని నెహ్రూ గ్రూపుతో తీవ్రమైన రాజకీయ వర్గపోరు నడిచింది. 1988లో పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీ, గిరిపురం ప్రాంత వాసుల భూ సమస్యలపై, ప్రభుత్వ విధానాలపై విజయవాడలోని రాఘవయ్య పార్కు సమీపంలో రంగా నిరాహారదీక్ష చేప్టటారు. ఈ దీక్షా శిబిరంలోనే ప్రత్యర్థి వర్గాలు దాడి చేసి దారుణంగా రంగాను హతమార్చారు.

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను ఈ హత్య కుదిపేసింది. అల్లర్లు, హింస చెలరేగాయి. దాదాపు 40 రోజుల పాటు కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. ఎన్టీఆర్‌ పాలనలోనే ఇది జరగడంతో టీడీపీ తీవ్ర విమర్శలెదుర్కున్నది. అప్పటి హోం మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని వంగవీటి రాధా రాజకీయ ఆరంగేట్రం చేశాడు. జూనియర్‌ రాధాగా పిలుస్తారితన్ని.

Advertisement

కాంగ్రెస్‌ తరుపున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి అతిచిన్న వయస్సులోనే ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు నెలకొల్పాడాయన. తండ్రి ఇమేజీ బాగా పనికి వచ్చింది. కానీ తండ్రిలా తనదైన పంథాను కొనసాగించలేకపోయాడు రాధా. నిలకడలేని రాజకీయాలు కూడా ఆయన అస్థిరతను చాటాయి.

2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌ సీపీ చేరాడు. 2019 ఎన్నికల సమయంలో టికెట్ కేటాయింపుల వివాదంతో ఆ పార్టీని వీడి.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరాడు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలుపుకు ప్రచారం చేశారే తప్ప.. పోటీ చేయలేదు.

విజయవాడ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు జనసేన పార్టీలో చేరి విజయవాడ మేయర్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు. ఆయన నామినేషన్‌ వేసిన సందర్భంలో అసంఖ్యాకంగా హాజరైన జనం… నాటి రంగా రాజకీయ రోజులను గుర్తు తెచ్చాయంటున్నారు ఆయన అభిమానులు. రంగా అంతటి నేతగా పేరు సంపాదించకపోయినా.. ఆయన వారసత్వం, కాపు సామాజికవర్గం కొండంత అండగా రాధను రాజకీయాల్లో ప్రత్యేకంగా నిలబెడుతోంది.

Tags

Related News

రహస్య మిత్రుల మధ్య గ్యాప్‌ పెంచిన బాబు! ఎస్‌ఐఆర్‌పై జగన్‌ నిరసన గళం.. సీఈసీ నియామకం సరికాదని పశ్చాత్తాపం…

బతుకమ్మ కుంటకు జీవం పోసిన సీఎం.. సిటీ జనం చిరస్థాయిగా రేవంత్‌ను గుర్తు పెట్టుకునేలా! ఆంక్షలు చేధించుకుని మరీ ఈసారి ఘనంగా సద్దుల బతుకమ్మ!

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

ఎల్‌నినో ఎఫెక్ట్.. ఉచిత చేపపిల్లల పంపిణీకి కొత్త కష్టాలు.. చనిపోలాల్సిందేనా..?

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఇద్దరూ పోటీ..! మహేశ్‌కు వరించిన అధ్యక్ష పీఠం..! లేటుగానైనా జాతీయ స్థాయి కీలక పదవిలో యాష్కీ!

కాంగ్రెస్‌..కోదండరాం మంత్రం! ఆయనే ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రం..? రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు!

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

Big Stories

Advertisement
×