E-Paper
Advertisement

ఎన్ హెచ్ఎం ఉద్యోగుల జీతాల్లో కోత సమంజసమా? సీఎం రేవంత్ కు కవిత సవాల్!

ఎన్ హెచ్ఎం ఉద్యోగుల జీతాల్లో కోత సమంజసమా? సీఎం రేవంత్ కు కవిత సవాల్!
Advertisement

NHM Employees: స్వేచ్ఛ బ్యూరో: నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ఎం) ఉద్యోగుల జీతాలు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో 1195 తేవడం అన్యాయమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఎన్ హెచ్ఎం ఉద్యోగుల జేఏసీ నాయకులతో కలిసి ఆదివారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల ఉద్యోగులుంటే వారిలో కొంతమంది వేతనాలు రూ.4వేల నుంచి రూ.5 వేలు తగ్గించారన్నారు. ఒక వైపు ధరలు పెరుగుతూ, కరువు పరిస్థితులు నెలకొని ఉన్నాయని.. ద్రవ్యోల్బణం నానాటికి పెరుగుతూ ఉంటే ఉద్యోగుల జీతాలు తగ్గిస్తారా అని ప్రశ్నించారు. కొందరు ఉద్యోగుల జీతాలు తగ్గించి మరికొందరి వేతనాలు మాత్రం  పెంచారని, ఉద్యోగుల పట్ల ఇంత వివక్ష ఎందుకని ప్రశ్నించారు. ఉద్యోగుల వేతనాల కోసం కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సమయానికి ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం లేదన్నారు. ఎన్ హెచ్ఎం ఉద్యోగుల శ్రమను దోచుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఎన్ హెచ్ఎం ఉద్యోగుల విషయంలో ఏం జరిగిందో రివ్యూ చేసి ఉద్యోగుల జీతాలు పెంచాలని హెల్త్ మినిస్టర్ కు ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఏటా 5 శాతం జీతాలు పెంచాలని కేంద్ర నిబంధనల్లో ఉన్నప్పటికీ జీతాలు తగ్గించడం ఏమిటని ప్రశ్నించారు.

7 రాష్ట్రాల్లో లేని కోతలు ఇక్కడే ఎందుకు?

Advertisement

ఎన్ హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వారికి న్యాయం చేయడం లేదన్నారు. దేశంలోని 7 రాష్ట్రాల్లో ఎన్ హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారని, అందులో కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ కూడా ఉందన్నారు. ఏపీలో 30 శాతం జీతాలు పెంచడంతో పాటు రెగ్యులరైజ్ చేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో ఎన్ హెచ్ఎం ఉద్యోగులకు ఇవ్వాల్సిన నిధులను పక్క దారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఉద్యోగులందరి జీతం పెంచి.. రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగుల జీతాల తగ్గింపుపై మండిపడ్డ కవిత

Advertisement

గ్రామీణ ఆరోగ్య వ్యవస్థకు ఎన్ హెచ్ఎంలు ఎంతో కీలకమన్నారు. వ్యాక్సినేషన్ తో పాటు రాష్ట్ర ప్రజలకు స్థానికంగా వైద్య సేవలు అందిస్తున్నామని గుర్తు చేశారు. ఎన్ హెచ్ఎం ఉద్యోగులు ఒక్క రోజు పని మానేస్తే గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ దెబ్బ తింటుందనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. వేతనాల తగ్గింపు పై ఉద్యోగుల ధర్నా చేస్తామని కోరినా పర్మిషన్ ఇవ్వడం లేదన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారికి  అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకపోవడం దారుణం అన్నారు. ఉద్యోగుల  సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము రంగంలోకి దిగి పెద్ద ఎత్తున వారి తరఫున ప్రజా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

Also Read: టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

Tags

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×