E-Paper
Advertisement

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?
Advertisement

Tiger Shroff:బాలీవుడ్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది.ముంబైలోని జుహూ ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తుంది.అది కూడా యాక్షన్ సినిమాలతో ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో టైగర్ ష్రాఫ్‌ పై ఈ కాల్పులు జరగడం ఇపుడు బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.

అయితే అదృష్టం కొద్దీ ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఆయన సురక్షితంగా ఉన్నట్టు సమాచారం. అయితే అసలు అక్కడ ఏం జరిగింది? కాల్పులు జరిపింది ఎవరు? అనే విషయాలపై ఆరాలు తీస్తున్నారు మూవీ లవర్స్.

Advertisement

వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న పుష్ప పార్క్ దగ్గర ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించడంతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఇక ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్‌కు ఎలాంటి గాయాలు కాలేదని కానీ ఆయన డ్రైవర్‌తో పాటు ఓ ఆటో డ్రైవర్ స్వల్పంగా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది .అయితే దీనిపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

మరోవైపు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ,అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ కాల్పులు జరిపిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. నిందితులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపిన తర్వాత అక్కడి నుంచి పారిపోయారా? ఈ ఘటన వెనుక ఏదైనా వ్యక్తిగత కక్ష ఉందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు పోలీసులు.

Advertisement

ఇక టైగర్ ష్రాఫ్ అంటే బాలీవుడ్‌లో యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరన్న సంగతి తెల్సిందే. బాలీవుడ్ లో ‘హీరోపంతి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన టైగర్ ష్రాఫ్ ‘బాఘీ’ సిరీస్‌తో మంచి క్రేజ్ కొట్టేశాడు.ముఖ్యంగా ‘బాఘీ 2’, ‘బాఘీ 3’ సినిమాల్లో ఆయన చేసిన ఫైట్స్, స్టంట్స్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాయి.

ఇక హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన ‘వార్’ సినిమాతోనూ ఆయనకు మంచి క్రేజ్ వచ్చింది. ఇక ‘గణపత్’సినిమాలో టైగర్ యాక్షన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.మొత్తంగా తమ అభిమాన హీరోపై కాల్పులు జరగడంతో షాక్ అవుతున్నారు టైగర్ ఫ్యాన్స్ . చూడాలి మరి టైగర్ ష్రాఫ్ పై కాల్పులు ఎవరు జరిపారు ఏంటి అనే విషయాలు ఎప్పుడు బయటికి వస్తాయో !

ALSO READ :40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

Tags

Related News

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

Big Stories

Advertisement
×