E-Paper
Advertisement

బీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేస్తానని పదే పదే శపథం! అధికార పార్టీకన్నా ప్రతిపక్ష పార్టీపైనే ఎక్కువ ఫోకస్!

బీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేస్తానని పదే పదే శపథం! అధికార పార్టీకన్నా ప్రతిపక్ష పార్టీపైనే ఎక్కువ ఫోకస్!
Advertisement

ఊరందరిదీ ఒకదారైతే.. ధర్మపురి అర్వింద్‌ది మరోదారి. ఆయనంతే. కొంచెం డిఫరెంట్‌. కొంచెమంటే మరీ కొంచెమేమి కాదు. బాగానే డిఫరెంట్‌. ఆ పార్టీ నేతలకే మింగుడు పడని, జీర్ణంకాని, అర్థంకాని క్యారెక్టర్‌ అన్నమాట. అంతిమంగా తన వ్యూహం తనది. బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే తపన బాగా ఉన్నవాడే. కానీ సీనియర్ కాషాయులు పోయే దారి కాకుండా తను ఎంచుకున్న భిన్నమైన మార్గంలో పోయేందుకు ట్రై చేస్తాడు. వైరల్‌ కంటెంట్ ఎంచుకుంటాడు. బాడీ షేమింగుకూ వెనుకాడాడు. వెటకారాలకు కొదవే ఉండదు. తిట్లు, శాపనార్దాలు కోకొల్లలు. ఇప్పుడు మళ్లీ అర్వింద్‌ గురించి ఇదంతా ఎందుకంటే..?

పదే పదే ఈ మధ్య బీఆర్‌ఎస్‌ను బొందపెడతానని శపథం చేస్తున్నాడు. గులాబీ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమంటున్నాడు. అంతా అధికార పార్టీ పాలనపై.. నేతల తీరుపై , అవినీతి ఆరోపణలపై భగ్గుమంటారు. విరుచుకుపడతారు. చీల్చి చెండాడుతారు. ఆ రకంగా తాము మరింత బలంగా ఉనికిలోకి రావడం, తమ పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ఓ వ్యూహంగా ఉంటుంది.

Advertisement

కానీ ఇక్కడ అర్వింద్‌ వ్యూహం.. బీఆర్‌ఎస్‌ను బొందపెట్టడమే. ఇదేందీ? అంటే.. అవును. అధికార పార్టీనీ తిడతాడు. సీఎంను బాడీ షేమింగ్‌ చేయడానికి వెనుకాడడు. టీిజింగ్‌కు కొదవుండదు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడి అవతలి వ్యక్తి హర్ట్‌ అయ్యేలా చేసి.. తద్వారా రాజకీయంగా తనకు మైలేజీ రావాలని బాగా తండ్లాడే క్యారెక్టర్‌ అన్నమాట.

సరే, ఇది అట్లుంచితే.. బీఆర్‌ఎస్‌ పని ఇక ఖతం.. ఖతం..! అని కలవరించినట్టే అంటున్న అర్వింద్‌ మాటల వ్యూహం వెనుక.. బీజేపీనే ఇక ప్రత్యామ్నాయ పార్టీ అని ప్రజలకు చేరవేయడమేనంటున్నారు. అంతా అధికార పార్టీని తిడితే తాము బలపడతామని అనుకుంటారు. కానీ ఇక్కడ అర్వింద్‌ అధికార పార్టీని ఎంత తిట్టి, ఎంత డ్యామేజీ చేసినా.. అది బీఆర్ఎస్‌కే ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టున్నాడు.

Advertisement

అందుకే ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆరెస్‌ను .. ఇంకా ఇంకా తిట్టి.. చచ్చిన పామును ఇంకా పూర్తిగా చంపేస్తేగానీ, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఆల్టర్నేట్ ఇక బీజేపీనే అని జనం అనుకునేదాకా కొట్టి కొట్టి చంపాలనేది అతగాడి వ్యూహమని అనుకుంటున్నారట. ఎన్నికల సమయం నాటికి బీఆరెస్‌ను మూడో స్థానానికి నెట్టేసి.. తాము రెండో ప్లేస్‌లో ఉంటే.. అయితే కాంగ్రెస్‌.. లేకపోతే బీజేపీ అనే ముచ్చటే ప్రజల్లో బలంగా నానేలా చేయడం ద్వారా అధికారంలోకి రావడం ఈజీ అవుతుందనేది అర్వింద్‌ శపథం వెనుక ఉన్న మతలబట.

పనిలో పని కవిత కొత్త పార్టీ పెట్టడాన్ని కూడా తన వ్యూహానికి వాడేసుకుంటున్నాడు. కవిత ఆ పార్టీ నుంచి విడిపోయి.. కొత్తగా తనదారి తాను చూసుకోవడమే బీఆరెస్‌ పతనానికి నాంది అని కూడా పదే పదే కామెంట్లు చేస్తున్నాడు. ఓవైపు బీఆరెస్‌, బీజేపీ ఒక్కటి కాబోతున్నాయి.. లోపాయికారి పొత్తులుంటాయనే ప్రచారాలకు అర్వింద్ ఈ విధంగా చెక్‌ పెట్టడమే కాదు.. ఫలితాల తరువాత కలిస్తే కలుస్తుండొచ్చు.. కానీ, పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగే సమయం ఉన్నప్పుడు ఆ వ్యూహాలు ఇలా అమలు చేయడంలో తప్పేముంది? అనే ఎత్తుగడ కూడా ఇందులో దాగుందటండోయ్‌!

Tags

Related News

జగన్ దూకుడు.. ఏ ధైర్యంతో అలా చేస్తున్నారు?

తెలుగు రాష్ట్రాల్లో సన్నవడ్లకు రికార్డు గిరాకీ.. ఎన్నడూ లేనంతగా ధర ఇచ్చి కొంటున్న పొరుగు రాష్ట్రాల దళారులు..!

భారీగా పెరిగిన సోనా మసూరి, బీపీటీ బియ్యం ధరలు.. క్వింటల్ ఎంతో తెలుసా?

తెలంగాణలో సోలార్ గ్రామాల ప్రాజెక్ట్ సిద్దం.. ఇందులో మీఊరి పేరు ఉందా..?

రేవంత్ సర్కార్‌పై BRS కరెంట్ వార్.. క్షేత్రస్థాయిలోకి హరీష్ రావు టీమ్!

అందరు బాగుండాలి.. అందులో నేనుండాలి! ‘బంగారం’ పరమార్థం ఇదే! తెలంగాణ ప్రజల ‘బంగారు’ సందేశం..! ఆనవాయితీకి ఆధారమైన ఆ పురాణగాథలేమిటీ?

నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీల కోసం బీఆర్ఎస్ నయా స్కెచ్.. ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యేనా..?

Big Stories

Advertisement
×