E-Paper
Advertisement

BSNL రూ. 439 vs Jio రూ. 448.. తక్కువ ధర ఎక్కువ రోజుల వ్యాలిడిటీ.. సామాన్యులకు పండగే!

BSNL రూ. 439 vs Jio రూ. 448.. తక్కువ ధర ఎక్కువ రోజుల వ్యాలిడిటీ.. సామాన్యులకు పండగే!
Advertisement

Recharge Plans: చౌకైన రీఛార్జ్ ఆప్షన్లు అనగానే సాధారణంగా చాలా మందికి బీఎస్ఎన్ఎల్ (BSNL), రిలయన్స్ జియో (Reliance Jio) గుర్తుకు వస్తాయి. జియోతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ ధరల పరంగా మరింత తక్కువకే అందుబాటులో ఉన్నాయి. అయితే నెట్‌వర్క్ నాణ్యత, సర్వీసుల విషయంలో మాత్రం జియో మెరుగ్గా ఉంటుందనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో లభించే వాయిస్-కాల్ ఓన్లీ ప్లాన్లపై ఓ లుక్కేద్దాం

బీఎస్ఎన్ఎల్ రూ. 439 ప్లాన్

బీఎస్ఎన్ఎల్ అందించే రూ. 439 ప్రీపెయిడ్ ప్లాన్ ఏకంగా 90 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, మొత్తం 300 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. దీనివల్ల నెలకు దాదాపు రూ. 146 మాత్రమే ఖర్చవుతుంది. అయితే కొన్ని టెలికాం సర్కిళ్లలో ఈ ప్లాన్ వాలిడిటీ 80 రోజులు మాత్రమే ఉంటుందని బీఎస్ఎన్ఎల్ వర్గాలు తెలిపాయి.

రిలయన్స్ జియో రూ. 448 ప్లాన్

Advertisement

మరోవైపు రిలయన్స్ జియో రూ. 448 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల సర్వీస్ వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్ కింద అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు మొత్తం 1000 ఎస్ఎంఎస్‌లు యూజర్ కు లభిస్తాయి. వీటితో పాటు జియోటీవీ (JioTV), జియోఏఐక్లౌడ్ (JioAICloud) యాప్ సబ్‌స్క్రిప్షన్లను కూడా ఈ ప్యాక్ ద్వారా పొందవచ్చు.

Also Read: ఇంటికి కొత్త వైఫై కనెక్షన్ కావాలా? Airtel, Jio, BSNLలో.. అత్యంత చౌకైన ప్లాన్లు ఇవే!

రెండింటిలో ఏ ప్లాన్ బెస్ట్?

Advertisement

ధరలు, వ్యాలిడిటీని పరిశీలిస్తే జియో, బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌లు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఖర్చు పరంగా చూస్తే రెండూ దాదాపు సమానమే. అయితే వినియోగదారుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే.. నెట్‌వర్క్ నాణ్యత, సర్వీస్ అనుభవం చాలా ముఖ్యం. ఈ కోణంలో చూస్తే జియో రూ. 448 ప్లాన్ మెరుగైన ఎంపికగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా జియోకు బలమైన 4G నెట్‌వర్క్ ఉండటం వల్ల నాణ్యమైన కాల్స్ మాట్లాడుకోవచ్చు. లేదంటే మీ ప్రాంతంలో బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ సిగ్నల్ బలంగా ఉంటే రూ. 439 ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ల కోసం ఆయా టెలికాం ఆపరేటర్ల అధికారిక మొబైల్ యాప్‌ల ద్వారా నేరుగా రీఛార్జ్ చేసుకోవచ్చు.

Also Read: విధ్వంసాలు వాళ్లు చేసి.. నిందలు మాపై నెడతారా? వైసీపీపై బొండా ఉమా ఆగ్రహం!

Tags

Related News

ఇంటికి కొత్త వైఫై కనెక్షన్ కావాలా? Airtel, Jio, BSNLలో.. అత్యంత చౌకైన ప్లాన్లు ఇవే!

ఇక నుంచి మీ కిచెన్ పని ఈజీ..డిష్ వాషర్‌పై అదిరిపోయే డిస్కౌంట్!

రూ.646కే పార్టీ వైబ్స్! దీని ఆర్జీబీ లైట్లతో మీ వైబ్ నెక్స్ట్ లెవెల్ అంతే!

గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. 6 కీలక లోపాలకు పరిష్కారం, వెంటనే ఇలా అప్డేట్ చేసుకోండి!

రూ.720కే అదిరిపోయే సౌండ్ బార్‌..ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ!

యాపిల్ ఐప్యాడ్‌కు గట్టి పోటీ ఇచ్చేలా ఒప్పో కొత్త మినీ టాబ్లెట్.. ధర రూ.95,000!

మీ మెయిల్‌లోకి..ఎవరు లాగిన్ అవుతున్నారో చెక్ చేయండిలా!

Big Stories

Advertisement
×