E-Paper
Advertisement

భారీగా పెరిగిన సోనా మసూరి, బీపీటీ బియ్యం ధరలు.. క్వింటల్ ఎంతో తెలుసా?

భారీగా పెరిగిన సోనా మసూరి, బీపీటీ బియ్యం ధరలు.. క్వింటల్ ఎంతో తెలుసా?
Advertisement

Rice Prices: స్వేచ్చ బ్యూరో: బియ్యం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి.మొన్నటి వరకు రీజనబుల్ ధరకు లభించిన సోనా మసూరి, బీపీటీ, తెలంగాణ సోనా వంటి ప్రముఖ రకాలు ఇప్పుడు సామాన్యుడికి అందుబాటులో లేవు. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం గడిచిన కొద్ది వారాల్లోనే బియ్యం ధరలు 35 శాతం నుండి 45 శాతం వరకు అనూహ్యంగా పెరిగాయి. గతంలో రకాన్ని బట్టి క్వింటాల్ సగటున రూ. 4,500 నుంచి 6500 వరకు పలికిన బియ్యం, ప్రస్తుతం రూ. 8వేల నుంచి 12వేల వరకు పెరిగింది.కొంత మంది వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలు వసూలు చేస్తున్నారని పబ్లిక్ లో టాక్.వాస్తవ ఈ ఏడాది ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల వర్షపాతం తగ్గింది.భవిష్యత్తులో కరువు రాబోతోంది, దిగుబడులు పడిపోతాయంటూ సోషల్ మీడియా, అధికారిక వర్గాల్లో నూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.ఈ ప్రచారాన్ని ఆసరాగా చేసుకుని రైస్ మిల్లుల యజమానులు, పెద్ద వ్యాపారులు ఒక సిండికేట్‌గా ఏ ర్పడి నిల్వలను గోదాములకు పరిమితంచేస్తున్నారు.మార్కెట్లోకి రావాల్సిన సరుకును తక్కువ మోతాదు లో విడుదల చేస్తూ, కొరత ఉందనేభయాన్ని వినియోగదారుల్లో నూరిపోస్తున్నారు.

ఇప్పటికిప్పుడు ప్రభావం లేకపోయినా..

వాస్తవాన్ని ఎల్ నినో ఎఫెక్టివ్ తో ఇప్పటికిప్పుడు వరి పంట ఉత్పత్తి లో పెద్దగా ఇబ్బంది లేకపోయినా వ్యాపారులు కొరత సృష్టించి అధిక ధరలు వసూలు చేస్తున్నారు. పైగా గతంలో రైతుల వద్ద ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసిన వ్యాపారులు ఇప్పుడు ఎల్ నినో భయాలను చూపిస్తూ సామాన్యుడి జేబులు గుల్ల చేస్తున్నారు. మిల్లుల్లో వేల క్వింటాళ్ల సరుకు ఉన్నప్పటికీ, మార్కెట్లో మాత్రం సరుకు లేదనే భ్రమలు కల్పిస్తున్నారు. ఈ నేపధ్యంలో సామాన్యుడి నెలవారీ ఖర్చుల్లో అత్యంత వ్యత్యాసం కనిపిస్తుంది. బియ్యం ధరలు ఇలా ఒకేసారి 40 శాతానికి పైగా పెరగడంతో మధ్యతరగతి, పేద కుటుంబాల బడ్జెట్ తలకిందులైంది.నలుగురు ఉన్న ఒక సాధారణ కుటుంబానికి నెలకు కనీసం 25 నుంచి 30 కిలోల బియ్యం అవసరం అవుతాయి.అయితే గడిచిన నెల వరకు బియ్యం కోసం రూ. 2 వేల నుండి రూ. 2500 వరకు ఖర్చు చేసిన కుటుంబం, ప్రస్తుతం రూ. 3 వేల నుండి రూ. 4 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది.ఒక్క బియ్యం మీదనే నెలకు దాదాపు వెయ్యు కి పైగా అదనపు భారం పడుతుండటంతో ఇతర అత్యవసర ఖర్చులను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ అవసరం..

Advertisement

మార్కెట్ లో బహిరంగంగా కృత్రిమ కొరత సృష్టిస్తున్నప్పటికీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పెద్ద రైస్ మిల్లులు, వ్యాపారుల గోదాములపై పౌరసరఫరాల శాఖ, లీగల్ మెట్రాలజీ అధికారులు వెంటనే దాడులు నిర్వహించి అక్రమ నిల్వలను బయటకు తీయాలనీ పబ్లిక్ కోరుతున్నారు.ఇక పెరిగిన ధరలను అదుపు చేయడానికి ప్రభుత్వం నేరుగా రైతు సరఫరా కేంద్రాలు , ప్రత్యేక కౌంటర్ల ద్వారా తక్కువ ధరకు బియ్యాన్ని విక్రయించాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది.ఎల్ నినో పేరుతో అక్రమ నిల్వలు చేపట్టి రూమర్లు వ్యాప్తి చేసే వ్యాపారులపై పిడి యాక్ట్, నిత్యావసర వస్తువుల చట్టం కింద కేసులు నమోదు చేయాలని పబ్లిక్ కోరుతున్నారు.

Also Read: యాదగిరిగుట్టలో తీవ్ర విషాదం.. పుష్కరిణిలో నీరు త్రాగి చిన్నారి మృతి!

Tags

Related News

తెలంగాణలో సోలార్ గ్రామాల ప్రాజెక్ట్ సిద్దం.. ఇందులో మీఊరి పేరు ఉందా..?

రేవంత్ సర్కార్‌పై BRS కరెంట్ వార్.. క్షేత్రస్థాయిలోకి హరీష్ రావు టీమ్!

అందరు బాగుండాలి.. అందులో నేనుండాలి! ‘బంగారం’ పరమార్థం ఇదే! తెలంగాణ ప్రజల ‘బంగారు’ సందేశం..! ఆనవాయితీకి ఆధారమైన ఆ పురాణగాథలేమిటీ?

నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీల కోసం బీఆర్ఎస్ నయా స్కెచ్.. ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యేనా..?

పాలపిట్ట దర్శనం.. విజయానికి సంకేతం! పాలపిట్టతో తెలంగాణకు విడదీయలేని అనుబంధం..! పురాణాలేం చెబుతున్నాయి?

జగన్ హామీతోనే.. అంబటి ఆ వ్యాఖ్యలు? రివేంజ్ ప్లాన్ సిద్ధం!

అటు చెల్లి.. ఇటు లొల్లి.. జగన్ దారి ఎటు?

Big Stories

Advertisement
×