E-Paper
Advertisement

పాలపిట్ట దర్శనం.. విజయానికి సంకేతం! పాలపిట్టతో తెలంగాణకు విడదీయలేని అనుబంధం..! పురాణాలేం చెబుతున్నాయి?

పాలపిట్ట దర్శనం.. విజయానికి సంకేతం! పాలపిట్టతో తెలంగాణకు విడదీయలేని అనుబంధం..! పురాణాలేం చెబుతున్నాయి?
Advertisement

తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే దసరా పండుగకు, పాలపిట్ట దర్శనానికి విడదీయరాని అనుబంధం ముడిపడి ఉంది. ఈ రోజున పాలపిట్టను చూడటం వల్ల తాము చేపట్టిన పనుల్లో తిరుగులేని విజయం సిద్ధిస్తుందని, అంతా శుభం కలుగుతుందని ప్రజలు బలంగా నమ్ముతారు. ప్రకృతిని పూజించే సంప్రదాయం ఉన్న తెలంగాణలో బతుకమ్మ పండుగను ఘనంగా చేసుకుంటాం. పూలనే దేవుడిగా పూజిస్తూ దసరా ముందు చేసుకునే ఈ బతుకమ్మ పండుగ తెలంగాణలో ఘనంగా జరుపుకుంటారు మహిళలు.

దసరాకు ముందు ఆయుధ పూజ, పండుగ రోజు జమ్మీపూజ, పాలపిట్ట దర్శనం ఇక్కడ వందల ఏండ్లుగా ఆనవాయితీగా ఉంది. ఈ ఆనవాయితీ సంప్రదాయాలను ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా పాటిస్తున్నారా? ఈ పాలపిట్ట దర్శనం అనే సెంటిమెంట్‌ ఎందుకు వచ్చింది? ఇది తెలంగాణకే ప్రత్యేకమా? జనంలో బలంగా ఉన్న ఆ నమ్మకం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఏంటీ? పురాణాలు ఏం చెబుతున్నాయి..? పండుగ వేళ దేశ ప్రజల సంస్కృతీ, సంప్రదాయాలు ఎలా ఉన్నాయి? తెలుసుకుందాం.

Advertisement

హిందూ సాంప్రదాయం, పురాణాల ప్రకారం కాలచక్రాన్ని కృత యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం, కలి యుగం.. అని నాలుగు యుగాలుగా విభజించారు. శ్రీరాముడి అవతారం, రామాయణ ఘట్టాలన్నీ త్రేతాయుగంలో జరిగాయి. రామాయణ గాథ ప్రకారం.. శ్రీరాముడు రావణాసురుడిని వధించడానికి లంకకు బయలుదేరే ముందు ఆకాశంలో పాలపిట్టను చూశాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ పక్షిని చూసిన తర్వాతే రాముడు యుద్ధంలో విజయం సాధించాడనే నమ్మకంతో, విజయదశమి రోజు పాలపిట్టను చూస్తే విజయానికి సంకేతంగా భావిస్తారు.

శ్రీకృష్ణుడి అవతారం, కురుక్షేత్ర యుద్ధం.. మహాభారత ఘట్టాలన్నీ ద్వాపరయుగంలో జరిగాయని పురాణాలు చెబుతున్నాయి. మహాభారత గాథ ప్రకారం.. పాండవులు తమ పన్నెండేళ్ల అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు, జమ్మి చెట్టుపై దాచిన తమ ఆయుధాలను తీసుకుంటారు. ఆ సమయంలో పాలపిట్ట వారికి దర్శనమిచ్చిందని, ఆ తర్వాతే వారు కౌరవులపై విజయం సాధించారని చెబుతారు. అందుకే పాలపిట్టను విజయదశమి రోజున చూడటాన్ని తమకు అన్ని విధాలుగా విజయం వరిస్తుందని ప్రజలు బలంగా నమ్ముతారు.

Advertisement

భారతదేశమంతటా దసరా జరుపుకున్నప్పటికీ, తెలంగాణ సంస్కృతి, జీవన విధానంతో పాలపిట్టకు ప్రత్యేక అనుబంధం ఉంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, ప్రకృతితో ముడిపడిన పండుగలు ఎక్కువ. దసరా నాడు సాయంత్రం గ్రామ సరిహద్దులు దాటి జమ్మి పూజ చేయడం, పాలపిట్ట కోసం పొలాల్లో వెతకడం ఇక్కడి శతాబ్దాల ఆచారం. వెతికి వెతికి మరీ పాలపిట్టను చూసిగాని ఇంటికి వెళ్లరు. ఈ పాలపిట్ట తెలంగాణ అస్తిత్వానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే.. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం పాలపిట్టను అధికారిక రాష్ట్ర పక్షిగా గుర్తించింది.

దసరా పండుగను భారతదేశ వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అయితే ప్రాంతాన్ని బట్టి ఆచారాలు మారుతుంటాయి. ఉత్తర భారతదేశంలో ఈ రోజున రావణ దహనాన్ని నిర్వహించడాన్ని ప్రాధాన్యంగా జరుపుకుంటారు. తెలంగాణ, ఏపీల్లో జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం, ఆయుధ పూజ జరుపుకోవడం ఆనవాతీగా వస్తోంది. ఆంధ్రతో పోల్చితే తెలంగాణలోనే దసరా అతిపెద్ద పండుగగా జరుపుకుంటారు.

తెలంగాణలో ప్రత్యేకంగా బతుకమ్మ ఉత్సవాలు ముగింపుగా దసరా జరుగుతుంది. పశ్చిమ బెంగాల్ తో పాటు తూర్పు రాష్ట్రాల్లో దుర్గా పూజగా 10 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. కర్ణాటకలోని మైసూరులో దసరా ప్రపంచ ప్రసిద్ధి గాంచింది.

పాలపిట్టను దసరా రోజున చూడాలనే సంప్రదాయం ప్రధానంగా తెలంగాణ,ఆంధ్రప్రదేశ్.. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో బలంగా ఉంది.ఒడిశా, కర్ణాటక, బీహార్‌లోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ పక్షిని చూడటం శుభప్రదంగా భావిస్తారు. తెలంగాణతో పాటు ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలు కూడా ‘ఇండియన్ రోలర్’గా చెప్పుకునే పాలపిట్టను తమ అధికారిక రాష్ట్ర పక్షిగా గుర్తించాయి. ఈ రాష్ట్రాల్లో కూడా ఈ పక్షిని సంరక్షించడానికి ప్రాధాన్యత ఇస్తారు.

గతంలో కొందరు దసరా పండగ వేళ పాలపిట్టలను పంజరాల్లో బంధించి ప్రదర్శించేవారు. అయితే, ఇది తీవ్రమైన నేరంగా పరిగణించిన ప్రభుత్వం .. 1972లో పాలపిట్ట వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని తెచ్చింది. వీటిని పంజరాల్లో బంధిస్తే ఆహారం తీసుకోలేక చనిపోతాయి. అందుకే, పక్షులను హింసించకుండా కేవలం ప్రకృతిలో స్వేచ్ఛగా ఎగిరే పాలపిట్టలను చూడటమే నిజమైన సంప్రదాయమని అటవీ శాఖ, పర్యావరణ సంస్థలు అవగాహన కల్పిస్తున్నాయి.

Tags

Related News

జగన్ హామీతోనే.. అంబటి ఆ వ్యాఖ్యలు? రివేంజ్ ప్లాన్ సిద్ధం!

అటు చెల్లి.. ఇటు లొల్లి.. జగన్ దారి ఎటు?

వారసత్వం కొనసాగిస్తున్న రాధా! నిలకడలేని రాజకీయమే రాధకు మైనస్‌.. తండ్రి నేపథ్యం, సామాజికవర్గమే కొండంత బలం…!

రహస్య మిత్రుల మధ్య గ్యాప్‌ పెంచిన బాబు! ఎస్‌ఐఆర్‌పై జగన్‌ నిరసన గళం.. సీఈసీ నియామకం సరికాదని పశ్చాత్తాపం…

బతుకమ్మ కుంటకు జీవం పోసిన సీఎం.. సిటీ జనం చిరస్థాయిగా రేవంత్‌ను గుర్తు పెట్టుకునేలా! ఆంక్షలు చేధించుకుని మరీ ఈసారి ఘనంగా సద్దుల బతుకమ్మ!

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

ఎల్‌నినో ఎఫెక్ట్.. ఉచిత చేపపిల్లల పంపిణీకి కొత్త కష్టాలు.. చనిపోలాల్సిందేనా..?

Big Stories

Advertisement
×