Bigg Boss: 7 ఆర్ట్స్ సరయు.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తనదైన యాస, భాష, బోల్డ్ డైలాగులతో విభిన్నమైన ప్రవర్తనతో ఆడియన్స్ లో విపరీతమైన క్రేజీ సంపాదించుకుంది. ముఖ్యంగా యువతలో ప్రత్యేక గుర్తింపును అందుకున్న సరయు.. ఎప్పటికప్పుడు తన మాటలతో, చేష్టలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా , ట్రోలింగ్ చేసినా లెక్కచేయకుండా తాను చెప్పాలనుకున్నది నిర్మొహమాటంగా చెప్పడం ఆమె ప్రత్యేకత. అలాంటి ఈమె చెప్పా పెట్టకుండా సడన్గా పెళ్లి చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది.
సెవెన్ ఆర్ట్స్ సరయుగా గుర్తింపు తెచ్చుకున్న సరయు రాయ్ తన పెళ్లి విషయాన్ని ఇంస్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ పోస్టులో పెళ్లి కూతురుగా ఉన్న సరయుని ఆమె తల్లి ముద్దాడుతున్న ఫోటోని ఆమె షేర్ చేశారు. ఇక మరో ఫోటోలో ఒక వ్యక్తి చెయ్యి పట్టుకొని నడుస్తూ కనిపించారు. అయితే ఈ ఫోటోలలో ఆమె తన భర్త ముఖాన్ని మాత్రం చూపించలేదు. దీంతో సరయుని పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరు అనే ఆసక్తి నెటిజన్స్ లో మొదలయ్యింది. తన పెళ్లి గురించి ఈమె పెట్టిన పోస్టులో ఆధ్యాత్మికత , తల్లి ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది.
” ఎప్పటికీ అమ్మ కూతురు గానే ఉంటాను. ఇప్పుడు నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఇది సాక్షాత్తు ఆ మహాదేవుడే నాకోసం రాశాడు అని నమ్ముతున్నాను. కొన్ని ఆశీర్వాదాలు మాటల్లో చెప్పలేనంత పవిత్రమైనవి. కొన్ని ఆరంభాలకు ప్రత్యేకమైన ప్రకటనలు అవసరం లేదు. అంతులేని విశ్వాసం, అమ్మ ప్రేమ, మహాదేవుని అనుగ్రహం ఉంటే చాలు.. అన్నీ అలా జరిగిపోతాయి “అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే పెళ్లి చేసుకొని సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన ఈమె.. తన భర్త ఎవరు అన్న విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. ఇకపోతే ఈ విషయం తెలిసిన అభిమానులు, సెలబ్రిటీలు సరయు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
also read:ముఖేష్ ను అడ్డుపెట్టుకొని వర్షిని సర్వైవ్ అవుతోందా? నీతూ షాకింగ్ కామెంట్స్!
సరయు కెరియర్ విషయానికి వస్తే.. 7 ఆర్ట్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి.. బోల్డ్ కామెడీతో, వీడియోలతో యువతకు దగ్గరైన ఈమె.. చూడాలని ఉంది, ఆకలిరాజ్యం, పతివ్రత, సరయు క్లినిక్, డాక్టర్ సరయు, సరయు పెళ్ళాం అయితే వంటి వీడియోలతో సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. ఇందులో సినిమా రివ్యూలను కూడా తన ప్రత్యేకమైన శైలిలో చెబుతూ అభిమానులను సంపాదించుకుంది. నిన్నే పెళ్లాడతా అనే సీరియల్ లో నెగిటివ్ రోల్ పోషించి ఆడియన్స్ను ఆకట్టుకుంది.. ఇక అంతేకాదు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ లో 19 కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఈమె.. మొదటి వారమే హౌస్ నుండి బయటకు వచ్చింది. అలాగే బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా పాల్గొన్న ఈమె అక్కడ కూడా త్వరగానే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. ఇక 18 పేజెస్ సినిమాలో కీలక పాత్ర పోషించి ఇండస్ట్రీలోకి ప్రవేశించింది.