E-Paper
Advertisement

ఏపీలో ఎంపీటీసీ, జెడ్సీటీసీల ఎన్నికల ప్రకటన.. బుధవారం నుంచి నామినేషన్లు, అభ్యర్థుల ఖర్చు ఎంతంటే..

ఏపీలో ఎంపీటీసీ, జెడ్సీటీసీల ఎన్నికల ప్రకటన.. బుధవారం నుంచి నామినేషన్లు, అభ్యర్థుల ఖర్చు ఎంతంటే..
Advertisement

Vijayawada:  ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ప్రకటన వచ్చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. అక్టోబర్ 21న నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. నవంబర్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. 659 మండలాలు, జెడ్పీటీసీ, 9829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ కలిపి 10,488 స్థానాలకు ఎన్నికలు జరగనుంది. ఎన్నికల్లో ఎంపీటీసీకి రూ.4 లక్షలు, జెడ్పీటీసీకి రూ.8 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు.

ఎంపీటీసీ-జెడ్పీటీసీల నోటిఫికేషన్ విడుదల

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ప్రకటన వచ్చేసింది. మొత్తం 28 జిలాల్లో 659 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. 9859 ఎంపీటీసీ స్థానాలకు 9829 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జెడ్పీటీసీకి 28 మంది, ఎంపీటీసీలకు 687 ఆర్వోలుగా ఉన్నట్లు ఎస్ఈసీ వెల్లడించారు. 35333 పోలింగ్ స్టేషన్ లు వున్నాయి. అందులో 9186 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఎన్నికలకు దాదాపు 2,81,34, 518 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అక్టోబర్‌ 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది.

బుధవారం నుంచి నామినేషన్లు, నవంబర్ ఐదున ఓట్ల లెక్కింపు

Advertisement

నామినేషన్ల దాఖలు చేసేందుకు మూడు రోజులు అవకాశం ఇచ్చారు. అక్టోబర్‌ 24న నామినేషన్‌ పత్రాల పరిశీలన, తిరస్కరించిన నామినేషన్లపై గడువు 25న వరకు ఉంటుందన్నారు. 26న అప్పీళ్లను పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. 27న నామినేషన్ల ఉపసంహరణకు గడువు కాగా, ఉపసంహరణల తర్వాత ఆ రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నట్లు తెలిపారు. నవంబర్‌ 3న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. అనివార్య కారణాల ఏమైనా జరిగితే నవంబర్‌ 4న తిరిగి పోలింగ్‌ ఉంటుందన్నారు. నవంబర్‌ 5న ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ALSO READ: మైదుకూరు మున్సిపాలిటీ ఎన్నిక వాయిదా, అక్కడ ఏం జరిగింది? మళ్లీ నోటిఫికేషన్ ఇస్తామన్నఎస్ఈసీ

Advertisement

అక్టోబర్ 21న ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 వరకు పార్టీల అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
అక్టోబర్ 23న నామినేషన్ల స్వీకరణకు ఆఖరు తేదీ
అక్టోబర్ 24న ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన
అక్టోబర్ 25న తిరస్కరించబడిన నామినేషన్లపై అప్పీలు చేయడానికి ఆఖరు తేదీ
ఎంపీటీసీ అప్పీళ్లను ఆర్‌డీఓ-RDO, జెడ్పీటీసీ అప్పీళ్లను జిల్లా కలెక్టర్ పరిధిలో దాఖలు చేయాలి
అక్టోబర్ 26న అధికారులతో అప్పీళ్ల పరిష్కారం
అక్టోబర్ 27న అభ్యర్థిత్వాల ఉపసంహరణకు ఆఖరు తేదీ, మధ్యాహ్నం 3:00 గంటల తర్వాత అభ్యర్థుల తుది జాబితా
నవంబర్ 3న పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.
నవంబర్ 4న రీ-పోలింగ్ ఏదైనా ఉంటేనే
నవంబర్ 5న ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి మొదలవుతుంది. లెక్కింపు పూర్తికాగానే ఫలితాలు ప్రకటన

Related News

రోడ్లు ధ్వంసంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం, ఎమ్మెల్యేల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తాం

మైదుకూరు మున్సిపాలిటీ ఎన్నిక వాయిదా, అక్కడ ఏం జరిగింది? మళ్లీ నోటిఫికేషన్ ఇస్తామన్నఎస్ఈసీ

ఉమ్మడి విజయనగరం జిల్లాలో ‘స్థానిక’ రచ్చ.. మేయర్-మున్సిపాలిటీల్లో మూడు పార్టీల అభ్యర్థుల నామినేషన్లు

బస్సు సీటు కోసం కుమ్మేసుకున్నారు.. ఆసుపత్రిలో ఓ కుటుంబం, ఏపీలో షాకింగ్ ఘటన

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. 8 ఛైర్‌పర్సన్లు కూటమి ఏకగ్రీవం! కూలిన దశాబ్దాల నాటి కంచుకోటలు

విశాఖలో డేటా సెంటర్ల నీటి వినియోగంపై గూగుల్-అదానీ కీలక నిర్ణయం, అలా చేస్తారట!

భవానీ భక్తులతో ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి… మహిషాసురమర్ధిని దేవి రూపంలో అమ్మవారు దర్శనం

Big Stories

Advertisement
×