E-Paper
Advertisement

రేవంత్ నాయకత్వాన్ని బలపరిచేలా అధిష్టానం అడుగులు! ఢిల్లీ పెద్ద‌ల‌తో స‌త్సంబంధాల సంకేతాలు..!

రేవంత్ నాయకత్వాన్ని బలపరిచేలా అధిష్టానం అడుగులు! ఢిల్లీ పెద్ద‌ల‌తో స‌త్సంబంధాల సంకేతాలు..!
Advertisement

కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత‌ .. సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించినప్ప‌టి నుంచి రేవంత్‌పై ఓ ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనికి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆరెస్‌తో పాటు.. పార్టీలోని కొంత మంది పెద్ద‌లు కూడా విస్తృతంగా బ‌ల‌ప‌రుస్తూ వ‌చ్చారు. అదేమిటంటే.. ఢిల్లీ పెద్ద‌ల‌తో రేవంత్‌కు స‌త్సంబంధాలు లేవ‌ని, అక్క‌డికి వెళ్తే క‌నీసం రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కూడా దొర‌క‌డం లేద‌ని.

సీఎం రేవంత్‌రెడ్డిని నిర్వీర్యం చేయ‌డానికి, ప్ర‌జ‌ల్లో సీఎం అంటే ఓ చుల‌క‌న భావం ఏర్ప‌డాల‌ని ప్ర‌ధానంగా కేటీఆర్ ఈ వ్యూహానికి తెర‌లేపారు. ఇన్ని సార్లు ఢిల్లీ వెళ్తున్నాడు.. ఒక్క‌సారి కూడా రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు ప‌దే ప‌దే చేస్తూ వ‌చ్చారు కేటీఆర్‌. ఢిల్లీతో సంబంధాలున్న కాంగ్రెస్ నేత‌లు కొంద‌రు.. దీనికి ప‌రోక్షంగా మ‌ద్ద‌తు తెలుపుతూ వ‌చ్చారు.

Advertisement

సీఎం కాంగ్రెస్ లీడ‌రే కాద‌ని, అత‌న్ని ఎప్పుడు త‌ప్పిస్తారో అనే అనుమానం వ‌చ్చేలా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కామెంట్స్ చేసింది. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డిలాంటి నేత‌లు బాహాటంగానే సీఎంను విమ‌ర్శించారు. కానీ తాజాగా కొండా సురేఖ పై చ‌ర్య‌లు తీసుకునే ఉదంతంలో రేవంత్‌రెడ్డి సూచ‌న‌కే అధిష్టానం అత్యంత ప్ర‌యార్టీ ఇచ్చిన‌ట్టుగా జ‌రిగిన ప‌రిణామాల‌ను బ‌ట్టి తెలుస్తోంది.

వాస్త‌వానికి, రేవంత్‌.. అస‌మ్మ‌తి తాకిడిని పెంచుకోవాల‌ని అనుకోలేదు. కొండా సురేఖ‌.. నాగార్జున కుటుంబ వ్య‌వ‌హారంలో నోరు జారిన అంశంలో కాపాడింది కూడా రేవంతే. అందరినీ క‌లుపుకుపోవాల‌నుకున్నారు. అస‌లే ప‌రిపాల‌న కొత్త‌. ఇక్క‌డ అంతా అప్పుల మ‌యం.. ఇచ్చిన హామీలు బోలెడు. అందుకే అంత‌ర్గ‌త పోరుకు ఏమాత్రం అవ‌కాశం ఇవ్వొద్ద‌ని రేవంత్ భావించారు.

Advertisement

పూర్తిగా పాల‌న‌పై ప‌ట్టు సాధించ‌డంతో పాటు.. బ‌లంగా ఉన్న ప్ర‌తిప‌క్షాన్ని ఢీకొట్టే నేత త‌ను త‌ప్ప పార్టీలో మ‌రెవ్వ‌రూ లేర‌నే విష‌యం గ్ర‌హించి.. రెండింటి మీద దృష్టి పెట్టారు. కానీ కొండా సురేఖ ఫ్యామిలీ వివాదం ఆయ‌నకు చిరాకును తెప్పించింది. మళ్లీ క్షమాభిక్ష పెడ‌దామ‌నుకున్నా.. సురేఖ పంపిన లేఖ అగ్నికి ఆజ్యం పోసింది.

బిడ్డ మాట్లాడిన దానికి త‌న‌ను బ‌లి చేయ‌వ‌ద్ద‌ని, అస‌లు అది త‌న ప‌రిధిలోకి రాద‌ని చెప్ప‌డమే కాదు.. క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ త‌న‌కు ఎలా నోటీసులు ఇస్తుంద‌ని ఉల్టా ద‌బాయించ‌డంతో పాటు… వెంట‌నే నోటీసును ఉప సంహ‌రించుకోవాల‌ని ఓ ఉచిత స‌ల‌హా కూడా ఇవ్వ‌డంతో అగ్గిమీద గుగ్గిల‌మ‌య్యారు సీఎం.

అందుకే ఇక ఉపేక్షించేది లేద‌ని డిసైడ్ అయ్యారు. ఇప్ప‌ట్లో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ వ‌ద్ద‌నే భావ‌న‌లో ఉన్న సీఎంకు.. కొండా ఉదంతం.. దానిపై క‌ద‌లిక తెచ్చిన‌ట్ట‌య్యింది. దీంతో అధిష్టానానికి స్ప‌ష్ట‌మైన సూచ‌న‌లు చేయ‌డంతో.. రేవంత్ కోరిక మేర‌కే నిర్ణ‌యం మేర‌కే కొండాపై వేటు ప‌డిన‌ట్టు తెలుస్తోంది.

Tags

Related News

రహస్య మిత్రుల మధ్య గ్యాప్‌ పెంచిన బాబు! ఎస్‌ఐఆర్‌పై జగన్‌ నిరసన గళం.. సీఈసీ నియామకం సరికాదని పశ్చాత్తాపం…

బతుకమ్మ కుంటకు జీవం పోసిన సీఎం.. సిటీ జనం చిరస్థాయిగా రేవంత్‌ను గుర్తు పెట్టుకునేలా! ఆంక్షలు చేధించుకుని మరీ ఈసారి ఘనంగా సద్దుల బతుకమ్మ!

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

ఎల్‌నినో ఎఫెక్ట్.. ఉచిత చేపపిల్లల పంపిణీకి కొత్త కష్టాలు.. చనిపోలాల్సిందేనా..?

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఇద్దరూ పోటీ..! మహేశ్‌కు వరించిన అధ్యక్ష పీఠం..! లేటుగానైనా జాతీయ స్థాయి కీలక పదవిలో యాష్కీ!

కాంగ్రెస్‌..కోదండరాం మంత్రం! ఆయనే ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రం..? రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు!

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

కృష్ణా-గోదావరి ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్.. నిజాంసాగర్‌లో పడిపోయిన నీటి నిల్వలు!

Big Stories

Advertisement
×