BoAt Wave Fury smartwatch: ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్ వాచ్ కేవలం టైం చూసే సాధనం మాత్రమే కాదు, అది నేటి యువత స్టైల్ స్టేట్‌మెంట్, హెల్త్ ట్రాకర్! తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్, మెటాలిక్ గ్రే స్ట్రాప్, అదిరిపోయే ఫీచర్లు కోరుకునే వారికి మార్కెట్లో బోట్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ వేరు. రూ.1,549 అంచనా ధరకే లభిస్తూ యూత్ ను తెగ ఆకట్టుకుంటున్న ‘బోట్ వేవ్ ఫ్యూరీ’ స్మార్ట్ వాచ్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. బడ్జెట్‌లో లగ్జరీ లుక్ ఇస్తూ మీ ఫిట్‌నెస్‌ను పర్ఫెక్ట్‌గా ట్రాక్ చేసే ఈ అద్భుతమైన గ్యాడ్జెట్ గురించిన పూర్తి ఫీచర్లు, ధరకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ స్మార్ట్ వాచ్ మెటల్ గ్రే స్ట్రాప్‌తో వస్తుంది. కాబట్టి ఇది మీకు చాలా ప్రీమియం, రాయల్ లుక్‌ను ఇస్తుంది. సాధారణ ప్లాస్టిక్ వాచ్‌లతో పోలిస్తే.. మెటాలిక్ ఫినిషింగ్ దీనికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. అంతే కాకుండా ఇందులో పెద్ద హెచ్‌డీ డిస్‌ప్లే ఇవ్వడం వల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. క్యాజువల్ వేర్ లేదా అఫీషియల్ లుక్.. రెండింటికీ ఈ వాచ్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.
ఈ ప్రైస్ రేంజ్‌లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉండటం దీని ప్రధాన ప్లస్ పాయింట్. వాచ్‌లోనే మైక్ , స్పీకర్ ఉండటం వల్ల ఫోన్ తీయకుండానే.. నేరుగా కాల్స్ మాట్లాడొచ్చు. క్విజ్ డయల్ ప్యాడ్, కాల్ హిస్టరీ , కాంటాక్ట్స్ సింక్ చేసుకునే అవకాశం కూడా ఇందులో ఉంది. అలాగే సోషల్ మీడియా నోటిఫికేషన్స్, వాట్సాప్ మెసేజ్‌లు అన్నీ రిస్ట్ పైనే ఈజీగా చెక్ చేసుకోవచ్చు.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేవారికి ఈ వాచ్ ఒక పర్ఫెక్ట్ హెల్త్ కంపానియన్. ఇందులో హార్ట్ రేట్ మానిటర్, SpO2 (బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్) సెన్సార్, స్లీప్ మానిటరింగ్ ఫీచర్లు ఉన్నాయి. రోజువారీ వ్యాయామాలు, రన్నింగ్, వాకింగ్ వంటి వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్స్‌ను ఇది కచ్చితంగా ట్రాక్ చేస్తుంది. ఫిట్‌నెస్ ఫ్రీక్స్‌కి ఇది తక్కువ ఖర్చుతో కూడిన బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. ఈ వాచ్ సాధారణ వాడకంలో కొన్ని రోజుల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా పని చేస్తుంది. మాగ్నెటిక్ ఛార్జింగ్ అవకాశం ఉండటం వల్ల త్వరగా ఛార్జ్ అవుతుంది. అలాగే.. ఇది IP రేటెడ్ వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. కాబట్టి చిన్నపాటి వర్షం కురిసినా లేదా చెమట పట్టినా వాచ్‌కు ఎలాంటి డ్యామేజ్ కాదు.
Also Read: అమెజాన్‌లో హాట్ కేకులా.. అమ్ముడవుతున్న ఫ్రెంచ్ డోర్ ఫ్రిడ్జ్‌లు!
అన్ని అద్భుతమైన ఫీచర్లు కలిగిన.. ఈ బోట్ వేవ్ ఫ్యూరీ స్మార్ట్ వాచ్ అసలు ధర మార్కెట్లో ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఇది కేవలం రూ. 1,549 ధరకే లభిస్తోంది. బడ్జెట్ ధరలో బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ కొనాలనుకునే… వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.
తక్కువ బడ్జెట్‌లో స్టైలిష్ లుక్, బ్లూటూత్ కాలింగ్ , హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు కోరుకునే వారికి ఈ మోడల్ ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు. కొనే ముందు ఆన్‌లైన్ స్టోర్స్‌లో లభించే.. బ్యాంక్ డిస్కౌంట్లు లేదా క్యాష్‌బ్యాక్ ఆఫర్లను గమనించడం మంచిది. ఆఫర్లను బట్టి ధరల్లో మార్పులు ఉండొచ్చు.