Telangana Congress:తెలంగాణ కాంగ్రెస్‌లో హైకమాండ్ సంచలన నిర్ణయాలతో రాజకీయంగా కలకలం సృస్టించింది. ఎంతటి సీనియర్ లీడరైనా, ఎంత పెద్ద పదవిలో ఉన్నా.. పార్టీ గీత దాటితే వేటు తప్పదనే క్లియర్ కట్ మెసేజ్ పంపింది. కొండా సురేఖపై యాక్షన్, చిన్నారెడ్డి పదవికి ఎసరు పెట్టడం ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్‌లో బిగ్గెస్ట్ డిబెట్‌గా మారింది. ఈ కఠిన చర్యలతో ఇంటర్నల్ పాలిటిక్స్ కంట్రోల్ లోకి వస్తాయా..? లేక గ్రూప్ వార్ మరింత ముదురుతుందా..?
కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక్కటే ట్రెండ్ నడుస్తోంది.. అదే స్ట్రిక్ట్ డిసిప్లిన్. కొండా సురేఖ ఎపిసోడ్‌తో హస్తం పార్టీలో కలవరం మొదలైంది. ఒకవైపు ఆమెపై వేటు వేయడం, మరోవైపు చిన్నారెడ్డి పోస్ట్‌కు ఎసరు పెట్టడం పాలిటిక్స్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. హైకమాండ్ తీసుకున్న ఈ డెసిషన్‌తో పార్టీలో ఎవరికి వారు ఇష్టానుసారంగా మాట్లాడటానికి వీల్లేదనే కఠిన హెచ్చరికలు జారీ అయ్యాయి. పదవులొస్తాయి, పోతాయి.. కానీ పార్టీ లైన్ క్రాస్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదని ఢిల్లీ పెద్దలు సంచలన సంకేతాలు పంపారు. స్వపక్షంలోనే గళం విప్పే లీడర్లకు ఈ పరిణామాలు గట్టి వార్నింగ్‌లా మారాయి.
అసమ్మతి నేతల బహిరంగ విమర్శలకు చెక్ పెట్టడమే టార్గెట్‌గా హైకమాండ్ ఈ మాస్టర్ ప్లాన్ వేసింది. మీడియా ముందుకు వచ్చి సొంత పార్టీ లీడర్లపైనే సెటైర్లు వేసే వాళ్లకు ఈ యాక్షన్‌తో మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇప్పటివరకు గ్రూప్ పాలిటిక్స్‌తో ఇష్టానుసారంగా వ్యవహరించిన సీనియర్లకు ఇప్పుడు ఫుల్ స్టాప్ పడినట్టే. ఎవరికి ఏ కంప్లైంట్ ఉన్నా పార్టీ ఫోరమ్‌లో చెప్పాలి తప్ప.. రోడ్డున పడి రచ్చ చేస్తే మాత్రం పరిణామాలు వేరేలా ఉంటాయని ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. ఇకపై కాంప్రమైజ్ అనే మాటే లేదనే సంకేతాలు రావడంతో అసంతృప్త నేతలు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది.
Also read :సీఎం సెక్యూరిటీ సమాచారం లీక్ చేసింది ఎవరు..?
ఇంతటి స్ట్రిక్ట్ యాక్షన్స్ తర్వాతైనా కాంగ్రెస్ లీడర్లు గాడిలో పడతారా..? లేక పాత పద్ధతే కొనసాగిస్తారా..? అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది. ఎన్నికల వేళ సమన్వయంతో ముందుకు వెళ్లాలని.. ఎక్కడ తేడా వచ్చినా సీరియస్ యాక్షన్ ఉంటుందని హైకమాండ్ అల్టిమేటమ్ ఇచ్చింది. రెబల్ వాయిస్‌లకు బ్రేక్ పడితేనే లీడర్లంతా కలిసికట్టుగా పనిచేసే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఈ ఇంటర్నల్ లొల్లి పార్టీకి బిగ్ మైనస్‌గా మారడం పక్కా. రానున్న రోజుల్లో ఈ కఠిన సూత్రాలు పార్టీని గెలుపు బాట పట్టించేలా చేస్తాయా..? లేక సొంత కుంపట్లతో నేతలు మళ్లీ రోడ్డెక్కుతారా..? కాలమే ఆన్సర్ చెప్పాలి.