E-Paper
Advertisement

సీఎం సెక్యూరిటీ సమాచారం లీక్ చేసింది ఎవరు..?

సీఎం సెక్యూరిటీ సమాచారం లీక్ చేసింది ఎవరు..?
Advertisement

CM Security: సీఎం భద్రత అంటే.. సాధారణ ప్రభుత్వ సమాచారం కాదు. అలాంటి సమాచారంలో సీఎం పర్యటన షెడ్యూల్‌, సెక్యూరిటీ ఏర్పాట్లు, సీఎస్‌వో ఫోన్‌ నంబర్‌, అత్యవసర అవసరాల కోసం బ్లడ్‌ గ్రూప్‌ వంటి వివరాలు ఉంటే.. అవి బయటకు రావడం సహజంగానే తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. జులై 13న సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించి వచ్చిన ఈ వైర్‌లెస్‌ సందేశాన్ని తెలుగు స్క్రైబ్‌ సోషల్‌ మీడియా ఖాతాలో ప్రచురించడంపై కేసు నమోదైంది. ఆ సమాచారం స్క్రైబ్‌ చేతికి ఎలా వచ్చింది..? అధికారిక వ్యవస్థలోని ఎవరో లీక్‌ చేశారా..? లేక మరేదైనా మార్గంలో చేరిందా..? ఫిర్యాదులోనే అనధికారిక యాక్సెస్‌ లేదా అధికారిక నెట్‌వర్క్‌ నుంచి రాంగ్ రూట్ లో సమాచారం చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇది కేవలం నిర్లక్ష్యమా..? లేక ఉద్దేశపూర్వక లీకేజీనా..? కుట్ర కోణం ఉందా లేదా అనేది దర్యాప్తులోనే తేలాలి. పోలీసులు టెక్నికల్‌ ఆధారాలు, సమాచారం ఎక్కడి నుంచి బయటకు వచ్చిందన్న దానిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇది ఎవరి పనో తేల్చాలి. ఇలాగే వదిలేస్తే సీఎం భద్రత క్వశ్చన్ మార్క్ అవుతుంది.

Tags

Related News

ఆర్మీ వెపన్స్ మిస్సింగ్ వెనుక హనీ ట్రాప్ ఉందా?

పాదయాత్ర చేస్తే అధికారంలోకి వస్తారా!

ప్లాన్ Aనా.. Bనా? కొండా చూపు ఏ పార్టీ వైపు?

ఏపీలో లోకల్ వార్.. సత్తా చాటేదెవరు..?

సీఎం రేవంత్ పట్టు.. కులం కార్డుతో కొండాకు చెక్

టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగమా.. ఎస్‌జీటీ ప్రభాకర్ నియామకం రేగుతున్న దుమారం!

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

Big Stories

Advertisement
×