E-Paper
Advertisement

Telugu Girl Marriage: అంబానీ, అదానీల రేంజ్‌కి ఏమాత్రం తగ్గకుండా.. ఉదయ్‌పూర్‍‌లో ఓ తెలుగమ్మాయి పెళ్లి..

Telugu Girl Marriage: అంబానీ, అదానీల రేంజ్‌కి ఏమాత్రం తగ్గకుండా.. ఉదయ్‌పూర్‍‌లో ఓ తెలుగమ్మాయి పెళ్లి..
Advertisement

Telugu Girl Marriage: పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు.. దేశంలో లక్షల పెళ్లిళ్లు అవుతుంటాయ్. కానీ.. వాటిలో కొన్ని పెళ్లిళ్ల గురించి మాత్రమే దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఇటీవల.. అంబానీ కొడుకు పెళ్లి జరిగితే.. ఇండియా మొత్తం ఎలా కళ్లప్పగించి చూసిందో.. మనమంతా చూశాం కదా! మళ్లీ.. అలాంటి పెళ్లి ఇంకొకటి.. ఇప్పట్లో జరగదనుకున్నాం. కానీ.. లేటెస్ట్‌గా ఉదయ్‌పూర్‍‌లో జరిగిన ఓ రాయల్ వెడ్డింగ్.. ఇండియా అటెన్షన్‌ని గ్రాబ్ చేసింది. అంబానీ, అదానీల రేంజ్‌కి ఏమాత్రం తగ్గకుండా.. ఓ తెలుగమ్మాయి పెళ్లి జరిగింది. అదే ఇప్పుడు ఇండియా మొత్తం హాట్ టాపిక్‌గా మారింది. అసలు.. ఎవరిది ఈ పెళ్లి? పెళ్లంటే ఇదేరా అన్న రేంజ్‌లో.. ఎందుకు పాపులర్ అయింది?

అంబానీ కొడుకు పెళ్లి తర్వాత ఆ స్థాయిలో వెడ్డింగ్
ఇండియాలో ఎన్నో పెళ్లిళ్లు జరుగుతుంటాయ్. కానీ.. అప్పుడప్పుడు ఏదో ఒక పెళ్లి మాత్రమే వైరల్ అవుతుంది. ఇది కూడా అలాంటిదే. భారత వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ కొడుకు పెళ్లి తర్వాత.. మన దేశంలో మళ్లీ ఆ స్థాయిలో జరిగిన పెళ్లి ఇది. నేత్రా మంతెన, వంసీ గడిరాజు వివాహం.. ఇప్పుడు ఇండియా మొత్తం హాట్ టాపిక్‌గా మారింది. వీరి వివాహ వేడుకకు.. చారిత్రక రాజస్థాన్ నగరమైన ఉదయపూర్ ఆతిథ్యమిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్లు, రాజకీయ, సినీ ప్రముఖులు, పాప్ సింగర్లు, సినిమా స్టార్లు హాజరైన ఈ వేడుక.. ఇంటర్నెట్‌ని షేక్ చేసింది.

Advertisement

నేత్రా మంతెన.. ఇండియన్-అమెరికన్ ఫార్మా దిగ్గజమైన మంతెన రామలింగరాజు కుమార్తె. ఆయన కంపెనీలు.. అమెరికా, స్విట్జర్లాండ్, ఇండియాలో విస్తరించి ఉన్నాయ్. పెళ్లికొడుకు వంశీ గడిరాజు.. ఓ టెక్ ఆంత్రపెన్యూర్. అభివృద్ధి చెందుతున్న రెస్టారెంట్ టెక్ ప్లాట్ ఫామ్ కో ఫౌండర్. అమెరికాలో నివసిస్తున్న వంశీ.. కొలంబియా యూనివర్సిటీలో చదివాడు. తన స్టార్టప్‌కి గానూ.. ఇటీవలే ఫోర్బ్స్ అండర్-30లో చేరాడు. ఈ పెళ్లి వేడుక కేవలం.. ఇద్దరి జీవితాలు, రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు.. సంప్రదాయం, లగ్జరీ, గ్లోబల్ పాప్ కల్చర్‌ని మిక్స్ చేస్తూ సాగిన ఓ రాయల్ సెలబ్రేషన్. అందుకే.. సోషల్ మీడియాలో దీని గురించి ఇంత చర్చ సాగింది. సాధారణంగా.. ఇలాంటి బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్ అరుదుగా జరుగుతుంటాయ్. ఇటీవల.. అంబానీ కొడుకు పెళ్లి తర్వాత.. ఇండియాలో ఇంత ఖరీదైన, స్టార్లు మొత్తం హాజరైన వివాహం ఇదే. అందుకే.. ఈ రాయల్ వెడ్డింగ్ దేశవ్యాప్తంగా అందరి నోటా వినిపించింది.

ఈ రాయల్ వెడ్డింగ్ కోసం.. మంతెన ఫ్యామిలీ ఉదయ్‌పూర్‌లోని అత్యంత విలాసవంతమైన, చారిత్రక ప్రదేశాలను సెలక్ట్ చేసుకుంది. లీలా ప్యాలెస్, జెనానా మహల్, పీచోలా సరస్సు మధ్యలో ఉన్న బ్యూటీఫుల్ జగ్‌మందిర్ ఐలాండ్ ప్యాలెస్‌లో.. వివాహ వేడుకలు జరిగాయి. ఈ పెళ్లి కోసం.. ఉదయపూర్ నగరం మొత్తాన్ని లైటింగ్‌తో వెలిగిపోయేలా చేశారు. అన్ని ప్యాలెస్‌లని.. ఫ్లోరల్ డెకరేషన్‌తో అలంకరించారు. రాజసం ఉట్టిపడేలా ముస్తాబు చేశారు. మంతెనవారి వివాహ వేడుకల్లో.. గ్లోబల్ సెలబ్రిటీలు సందడి చేశారు.

Advertisement

దేశ, విదేశాల నుంచి అగ్రశ్రేణి ప్రముఖులు హాజరయ్యారు. దాదాపు 40 దేశాల నుంచి 600 మందికి పైగా వీవీఐపీలు ఈ వేడుకకు విచ్చేశారు. ఇంటర్నేషనల్ లెవెల్‌లో పాపులర్ అయిన సింగర్ కమ్ యాక్టర్ జెన్నిఫర్ లోపెజ్.. ప్రత్యేకమైన విమానంలో వచ్చి.. అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. జెన్నిఫర్ లోపెజ్ ఇండియాలో ఇలా ఓ పెళ్లిలో మెరవడం ఇది రెండోసారి. కెనడియన్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ కూడా ఈ పెళ్లిలో మెరిశాడు. గ్లోబల్ స్టార్ రాంచరణ్ సహా మిగతా బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా పెళ్లికి హాజరయ్యారు. ముఖ్యంగా.. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కుమారుడు.. డొనాల్డ్ ట్రంప్ జూనియర్.. తన ప్రియురాలితో కలిసి ఈ పెళ్లికి వచ్చారు. సంగీత్‌లో డ్యాన్స్‌లు కూడా వేశారు. ఈ రాయల్ వెడ్డింగ్‌లో.. రిసెప్షన్‌లో గ్లోబల్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ ప్రైవేట్ కాన్సర్ట్ హైలైట్‌గా నిలిచింది. ఈ ఒక్క ఈవెంట్‌కే.. ఏకంగా రూ.17 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ యాక్టర్స్.. మాధురి దీక్షిత్, దియా మీర్జా, షాహిద్ కపూర్, కృతి సనన్, జాన్వీ కపూర్, నోరా ఫతేహి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, వరుణ్ ధావన్, రణ్‌వీర్ సింగ్ లాంటి స్టార్‌లంతా.. సంగీత్ వేడుకల్లో తమ పెర్ఫార్మెన్స్‌లతో ఫుల్ జోష్ తీసుకొచ్చారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్.. మెహందీ, సంగీత్ కార్యక్రమాలని హోస్ట్ చేశారు. పాపులర్ డచ్ డీజే టియెస్టో.. తన మ్యూజిక్‌తో అలరించారు. ఫ్రాన్స్‌కు చెందిన ప్రఖ్యాత సర్కస్ బృందం విన్యాసాలు కూడా ఆకట్టుకున్నాయ్. నవంబర్ 21 నుంచి 24 వరకు.. నాలుగు రోజుల పాటు ఈ పెళ్లి వేడుకలు జరిగాయ్. ప్రతి వేడుక.. ఓ రాజభవనంలో అద్భుతంగా నిర్వహించారు. సంగీత్.. సిటీ ప్యాలెస్‌లోని జెనానా మహల్‌లో జరిగింది. ఇక్కడ.. బాలీవుడ్ స్టార్స్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు, గ్లోబల్ మ్యూజిక్ షోలు ఆకట్టుకున్నాయ్. హల్దీ ఈవెంట్.. తాజ్ లేక్ ప్యాలెస్‌లోని అందమైన లేక్ సైడ్ బంగళాలో జరిగింది. ప్రధాన ఘట్టమైన పెళ్లి వేడుక.. జగ్‌మందిర్ ఐలాండ్ ప్యాలెస్‌లో.. హిందూ సంప్రదాయం ప్రకారం.. అత్యంత వైభవంగా నిర్వహించారు. రిసెప్షన్.. ది లీలా ప్యాలెస్‌లో కళ్లు చెదిరే రీతిలో చేశారు.

ఈ పెళ్లి వేడుకల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. స్థానిక పోలీసులతో పాటు అమెరికన్ సీక్రెట్ సర్వీస్ కూడా భద్రతను పర్యవేక్షించింది. డ్రోన్‌లతో నిఘా, ప్రత్యేక విమానాలకు ఏర్పాట్లు, వీఐపీల రాకపోకల కోసం ప్రత్యేక కారిడార్ల ఏర్పాటు. ఇలా ప్రతీది పకడ్బందీగా చేశారు. అంబానీ ఫ్యామిలీ రేంజ్‌లో ఓ తెలుగు ఫ్యామిలీ నిర్వహించిన ఈ ఖరీదైన రాయల్ వెడ్డింగ్ వరల్డ్ అటెన్షన్‌ని గ్రాబ్ చేసింది. పెళ్లంటే ఇలా ఉండాలి అనిపించేలా.. దేశీయ సంప్రదాయాన్ని, గ్లోబల్ స్టైల్‌ని మేళవించి జరిపించిన ఈ వివాహం.. టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారింది. 2025లో.. వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది.

అసలు.. ఎవరు ఈ మంతెన రామలింగరాజు? భీమవరంలో పుట్టి.. అమెరికాలో ఇంతటి స్థాయికి ఎలా ఎదిగారు? ఏకంగా.. ట్రంప్ కొడుకే తన కూతురి పెళ్లికి వచ్చేంతలా ఏం చేశారు? తిరుమల శ్రీవారికి కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడానికి కారణమేంటి?

మంతెన రామలింగరాజు అచ్చతెలుగు మూలాలున్న అమెరికన్ ఇండస్ట్రియలిస్ట్. ఆయన.. అమెరికాలో స్థిరపడిన తెలుగు బిలియనీర్. ఇన్‌జెనుస్ ఫార్మాసూటికల్స్‌కి రామలింగరాజు ఛైర్మన్. ఇన్‌జెనుస్ ఫార్మాకి సంబంధించిన కంపెనీలు అమెరికా, స్విట్జర్లాండ్, భారత్‌లో విస్తరించి ఉన్నాయ్. రామరాజు మంతెన పశ్చిమ గోదావరి జిల్లా జువ్వలపాలెంలో పుట్టారు. విజయవాడలో చదువుకున్నారు. జేఎన్టీయూలో కంప్యూటర్ సైన్స్ ఆండ్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. 1980ల్లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన రామలింగ రాజు.. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్‌లో క్లినికల్ ఫార్మా పూర్తిచేశారు.

కొంతకాలం వివిధ ఫార్మా సంస్థల్లో పని చేసి సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించారు. ఫ్లోరిడాలోని పీ4 హెల్త్‌కేర్‌లో సీఈఓగా కెరీర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత.. రాజ్ మంతెన స్థాపించిన కంపెనీలలో ఐకోర్ హెల్త్ కేర్ సూపర్ హిట్ అయ్యింది. ఈ కంపెనీని 200 మిలియన్ డాలర్లకు అమ్మేయటంతో ఆయన లెవెల్ మారిపోయింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ.. ఇప్పుడు అమెరికా ఫార్మా రంగాన్ని ఏలుతున్నారు. రామ లింగరాజు నెట్‌వర్త్ దాదాపు 20 మిలియన్ డాలర్లు అంటే.. 167 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆయనకు ఫ్లోరిడాలో 400 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. రామలింగరాజు భార్యతో పాటు పిల్లల పేరిట కోట్లాది ఆస్తులున్నాయి. అలా.. ఈ ఫ్యామిలీ అమెరికాలోనే రిచ్చెస్ట్ ఫ్యామిలీస్‌లో ఒకటిగా గుర్తింపు పొందింది.

మంతెన రామలింగరాజు.. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఏకైక కుమార్తె పద్మజని వివాహమాడారు. వీరికి.. ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన అమెరికాలో బిలియనీర్. ఉదయపూర్‌లో జరిపించిన తన కూతురు వివాహానికి.. 40 దేశాల నుంచి అతిథులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. జస్టిన్‌ బీబర్‌, జెన్నిఫర్‌ లోపెజ్‌, టియెస్టో, బ్లాక్‌ కాఫీ, సిర్క్యు డు సోలైల్‌, డీజే అమన్‌ నాగ్‌పాల్‌ లాంటి.. ఇంటర్నేషనల్ స్టార్స్ అంతా.. ఈ రాయల్ వెడ్డింగ్‌లో తమ ఆటపాటలతో అలరించారు. సంగీత్ వేడుకల్లో రణవీర్ సింగ్.. ట్రంప్ జూనియర్, అతని ప్రియురాలిని డ్యాన్స్ ఫ్లోర్‌కి తీసుకెళ్లిన వీడియో.. బాగా వైరల్ అయింది. ఉదయపూర్‌లో జరిగిన మంతెన వారి రాయల్ వెడ్డింగ్‌ కోసం ఖరీదైన సెట్టింగ్‌లు, గ్లోబల్ స్టార్లతో ఈవెంట్లు నిర్వహించడంతో.. బాగానే ఖర్చయింది. ఈ పెళ్లికి 100 కోట్లపైనే ఖర్చయినట్లు అంచనా వేస్తున్నారు. అందుకోసమే.. ఈ పెళ్లికి సోషల్ మీడియాలో ఇంత బజ్ క్రియేట్ అయింది. పెళ్లి వేడుకలు జరిగిన వేదికలు, గెస్టుల లిస్టులో గ్లోబల్ స్టార్లు, లగ్జరీ ప్యాలెస్‌లు, ఆ హంగామా, హడావుడి అంతా.. గతంలో జరిగిన అంబానీ పెళ్లిని గుర్తుకు తెచ్చింది. ఈ పెళ్లి.. ఇండియాలో డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కి ఉన్న ప్రాముఖ్యతని మరోసారా హైలైట్ చేసింది.

Also Read: రికార్డుల మోత ఎకరం రూ.151 కోట్లు! హైదరాబాద్ భూమి ధరలు.. ఇప్పట్లో ఆగుతుందా?

విదేశాల్లో స్థిరపడినా, కోట్లు సంపాదిస్తున్నా.. మంతెన రామలింగరాజు తన మూలాలను మర్చిపోలేదు. ఆయనకు.. తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుడు. తన కుమార్తె నేత్ర మంతెన, అల్లుడు వంశీ గాదిరాజుల పేరు మీద.. 9 కోట్ల విరాళం అందించారు. అంతకుముందు.. 2017లో తిరుమల శ్రీవారికి 28 కిలోల బంగారు సహస్రనామ మాలను బహూకరించి తన భక్తిని చాటుకున్నారు. 2012లోనూ.. టీటీడీకి 16 కోట్లు విరాళంగా అందించారు. అలా.. అప్పట్లోనే రామలింగరాజు పేరు జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మరోసారి.. తన కూతురు రాయల్ వెడ్డింగ్ వల్ల.. మంతెన రామలింగరాజు పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది.

Story By Anup, Bigtv

Related News

QR కోడ్‌లో మూడు బాక్స్‌లు ఎందుకుంటాయో తెలుసా ?

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!

నిరుద్యోగ పెయిడ్ ఆర్టిస్ట్స్! యువ సంగ్రామ సదస్సు పై సెటైర్లు! ఎఫెక్ట్ ఎవరికి!?

చైన్ స్నాచర్లుగా మారండి! స్కూటీలు ఎత్తుకెళ్లండి..! జ‌నాల‌ను దోపిడీ చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే ..

ఒక్కో పార్టీకి రెండేసి సార్లు అధికారం.. ఇది ధీమానా, జోస్యమా? చరిత్ర ఇదేననే మైండ్ గేమా!?

సీసీటీవీ ఫుటేజ్ భయమేనా? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆత్మహత్యాయత్నం వెనుక అసలు నిజాలు!

మితిమీరిన కేటీఆర్ భాష‌! చిచోర‌, బేకార్‌.. స‌న్నాసీ..! సీఎంపై ప‌రుష‌ ప‌ద‌జాల ప్ర‌యోగం..!

రేవంత్ రెడ్డి సీక్రెట్ స్కెచ్.. దారికి రాకుంటే టికెట్ కట్! హస్తం పార్టీలో మొదలైన బిగ్ యాక్షన్ ప్లాన్

Big Stories

Advertisement
×