E-Paper
Advertisement

Sai Pallavi: తెలుగు సినిమాలకు బుజ్జితల్లి గుడ్ బై.. ఏడాదికి ఒక్కటి కూడా లేదు..!

Sai Pallavi: తెలుగు సినిమాలకు బుజ్జితల్లి గుడ్ బై.. ఏడాదికి ఒక్కటి కూడా లేదు..!
Advertisement

Sai Pallavi: టాలీవుడ్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి.. రీసెంట్గా టాలీవుడ్ లో ఈమె నటించిన తండేల్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ తర్వాత సాయి పల్లవి తెలుగులో వరుసగా సినిమాలు చేస్తుందని అందరూ అనుకున్నారు.. కానీ ఏడాది అవుతున్న సరే ఇప్పటివరకు తెలుగులో ఆమె ఒక్క సినిమా కూడా చేయలేదు.. దీంతో చాలామంది తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పేసిందేమో అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి.. అసలు తెలుగులో ఎందుకు సినిమాలు చెయ్యలేదో? ప్రస్తుతం సాయి పల్లవి ఏయే సినిమాలు చేస్తుంది..? ఒక్కసారి తెలుసుకుందాం..

తెలుగులో సినిమాలు ఆలస్యం ఎందుకు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామర్ పాత్రలకు అవకాశం ఇవ్వకుండా నేచురల్ బ్యూటీగా సినిమాలు చేసుకుంటూ క్రేజ్ ను పెంచుకుంటున్న హీరోయిన్ సాయి పల్లవి.. స్కోప్ ఉన్న పాత్రలను సెలెక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తుంది. `తండేల్` తర్వాత వచ్చిన చాలా అవకాశాలు కూడా వదులుకుందని ప్రచారంలోకి వచ్చింది. తాజాగా మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది… మొన్నటి వరకు టాలీవుడ్ లో సినిమాలకు దూరంగా ఉంటుందని వార్తలు వినిపించాయి.. ఇప్పుడు మాత్రం ఆమెని టాలీవుడ్ దూరంగా పెట్టబోతున్న అంటూ మరో వార్త ప్రచారంలో ఉంది.. అందుకు గ్లామర్ పాత్రలు చెయ్యకపోవడమే. సాయిపల్లవి అలాంటి సన్నివేశాలంటే అంగీకరించదు. తెరపై రొమాంటిక్ సన్నివేశాలకు, మోడ్రన్ దుస్తుల్లో గ్లామర్ షో చేయమంటే ససేమిరా అంటుంది. ఎప్పుడో ఒకసారి నేచురల్ సినిమాలకు అవకాశాలు ఉంటాయి కానీ. ఈమధ్య ఎక్కువగా యువత గ్లామర్ సినిమాలనే చూస్తున్నారు.. అందుకే తెలుగులో ఈమెకు సినిమా అవకాశాలు రాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం హాట్ టాపిక్ గా మారింది..

Advertisement

Also Read: అడ్డంగా ఇరుక్కున్న శ్రీవల్లి.. మోసపోయిన ఆనందరావు.. తెలివిగా నగలను దాచేసిన శ్రీవల్లి..

బాలీవుడ్ పై మోజు.. తెలుగు నాట్ ఇంట్రెస్ట్.. 

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారు బాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు.. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోయిన్లు బాలీవుడ్ లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.. ప్రస్తుతం సాయి పల్లవి కూడా బాలీవుడ్లో తన లక్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి సినిమాలు చేస్తుంది.. ప్రస్తుతం బాలీవుడ్ లో `రామాయణం`లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న రామాయణంలో ఇప్పటికే మొదటి భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. రెండవ భాగం షూటింగ్ జరుగుతోంది.. ఇక ఈ క్రమంలోనే మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మేరె రహే అనే హిందీ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకుని వచ్చే నెలలో రిలీజ్ రిలీజ్ కాబోతుంది.. ఇదిలా ఉండగా.. ఈ మధ్య ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కానీ తెలుగులో మాత్రం సినిమాలపై శ్రద్ధ చూపించడం లేదంటూ మరో వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.. మరి వార్తలపై సాయి పల్లవి ఎలా స్పందిస్తుందో చూడాలి..

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×