E-Paper
Advertisement

ఆది నుంచి త‌ప్పట‌డుగులే.. వివాదాలే ఆమె దారి? ఇదీ కొండా సురేఖ వైఖరి!

ఆది నుంచి త‌ప్పట‌డుగులే.. వివాదాలే ఆమె దారి? ఇదీ కొండా సురేఖ వైఖరి!
Advertisement

కొండా సురేఖ ఎపిసోడ్‌కు ముగింపు పలికింది కాంగ్రెస్ అధిష్టానం. మంత్రి పదవికి రాజీనామా కోరడమే కాకుండా బర్తరఫ్ చేస్తామంటూ ఆమెకు హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి ఇప్పటికే గవర్నర్‌కు లేఖ రాశారు. మంత్రివర్గం నుంచి ఆమెను తొలగిస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. మంత్రిగా అటు ప్రజా సంక్షేమాన్ని చూసుకుంటూ.. ఇటు పార్టీని బలోపేతం చేస్తూ బాధ్యతగా సాగాల్సిన కొండా సురేఖ… ఆది నుంచి వివాదాలకే పరిమితమయ్యారు. పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు. అయితే, కొండా సురేఖకు ఇదేమీ కొత్తకాదు.. మొదటి నుంచి ఆమె వైఖరి ఇంతే.

రోశయ్యపై అనుచిత వ్యాఖ్యలు

రాజకీయాల్లో కొండ సురేఖది వివాదాస్పద దోరణి. అగ్నికి ఆజ్యం పోసేలా కొండా మురళి తెరవెనుక నుంచి వ్యూహాలు పన్నుతుంటే.. ఈమె అమలు చేస్తుంటారనే టాక్ ఉంది. గతంలో ఆమె అప్పటి అపద్దర్మ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యపై కూడా నోరుపాడేసుకున్నారు. రొశయ్యను సీఎంగా చూడలేకపోతున్నా అంటూ బాడీ షేమింగ్ చేశారు. సురేఖ మాటలతో మనస్తాపానికి గురైన రోశయ్య.. తన క్యాబినేట్‌లో ఆమెకు స్థానం లేదంటూ బహిరంగ ప్రకటన చేశారు. దీంతో ఆమె బీఆర్ఎస్‌లో చేరారు.

అక్కడా అదే తీరు

Advertisement

బీఆర్ఎస్‌లో కూడా ఆమె పొలిటికల్ జర్నీ అంత సాఫీగా సాగలేదు. అక్కడ గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోశారు. కొండ సురేఖ అండ్ ఫ్యామిలీ.. తమ ఇలాఖాలో ఇతర నేతల జోక్యాన్ని అస్సలు ఒప్పుకోరు. చివరికి వారు తమ సొంత పార్టీ వ్యక్తులైనా సహించరు. బీఆర్ఎస్ లో కూడా ఆమె వైఖరి మార్చుకోలేదు. దీంతో ఆమె ఆ పార్టీని వీడి మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరారు. కానీ, తీరు మారలేదు.

నాగార్జున కోడలిపై అనుచిత వ్యాఖ్యలు

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గంలో చోటు సంపాదించిన కొండ సురేఖ వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. తాను మాట్లాడేదే రైట్ అనుకుంటూ.. ముందుకు సాగారు. సినీ నటుడు నాగార్జున కోడలు సమంతపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. పెద్ద దుమారమే రేపారు. ఆమె వ్యాఖ్యలపై నాగార్జున కోర్టులో పరువు నష్టం దావా కూడా వేశారు. చివరికి సీఎం రేవంత్ జోక్యం చేసుకుని.. వివాదానికి పుల్ స్టాప్ పెట్టారు. మంత్రి పేషీలోని ఓఎస్‌డీ సుమంత్ వివాదంలోనూ కొండా ఫ్యామిలీ సానుకూలంగా స్పందిస్తూ.. అతడికి సపోర్టు చేశారు.

సీఎంకే వార్నింగ్ ఇచ్చేలా కామెంట్లు

Advertisement

ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా, రేవంత్‌కు వార్నింగ్ ఇచ్చేలా సుష్మిత కామెంట్స్ చేయడం అధిష్టానాన్ని ఆగ్రహానికి గురిచేసింది. అయినా సరే సీఎం రేవంత్ కొండాను క్షమించారు. తాజాగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి విషయంలో సీఎం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సురేఖ కుమార్తె సుష్మిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డైపర్లు వేసుకునే ఎమ్మెల్యేేకు మళ్లీ టికెట్టా అంటూ హేళన చేశారు. సీఎం తమ్ముడి బాగోతాలు బయటపెడతానంటూ బ్లాక్ మెయిల్ చేసేలా కామెంట్లు చేశారు. ‘పరకాల నాది.. నేనే పోటీ చేస్తా..’’ అంటూ ఏకంగా అధిష్టానానికే అల్టిమేటం ఇచ్చారు.

మా వల్లే రేవంత్ సీఎం అయ్యారంటూ…

కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఎందుకివ్వలేదు? ఆయన కింగ్ మేకర్ అంటూ జబ్బలు చరుకునే ప్రయత్నం చేశారు. సుష్మిత. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌ను ప్రమోట్ చేసిందే మేము అని, తమ వల్లే రేవంత్ సీఎం అయ్యారంటూ అపరిపక్వ కామెంట్లు చేశారు సుష్మిత. ఆమె మాటలను ఖండించాల్సిన సురేఖ.. మౌనంగా ఉన్నారు. అది తన పరిధి కాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. కూతురి వ్యాఖ్యలతో తనకు అస్సలు సంబంధమే లేదన్నట్లుగా వ్యవహరించారు.

నోటీసులు వెనక్కి తీసుకోవాలని దబాయింపు

కూతురి వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కాంగ్రెస్ అధిష్టానం జారీ చేసిన నోటీసులపై సురేఖ స్పందించిన తీరు కూడా వివాదాస్పదమైంది. ఆ నోటిసులను వాపస్ తీసుకోవాలని దబాయించడం, నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం పార్టీ పెద్దలను ఆగ్రహానికి గురిచేశాయి. ఆమె అంతటితో ఆగకుండా తన కూతురితో కలిసి తన ఇంటి బాల్కనీలో నవ్వుతూ మీడియాకు సైగలు చేస్తూ వివాదాన్ని మరింత పెద్దది చేశారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి మరీ సీఎంను బెదిరించే ప్రయత్నం చేశారు.

Also Read: నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

రెండు టెర్ములు కూడా తానే సీఎం అని రేవంత్ ప్రకటించుకుంటున్నారని, అతనిపై వేటు వేయాలంటూ అధిష్టానాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో కూడా బీసీ కార్డును ప్రయోగించి విఫలం అయ్యారు. చివరికి ఆమె ఆటలు సాగకపోవడంతో ఢిల్లీ నుంచి వెనుదిరిగారు. చివరికి పదవిని కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నారు. ఇప్పటికీ తాను చేసిందే రైట్ అనే దోరణిలో ముందుకు సాగుతున్నారు సురేఖ. ఆమె ఇచ్చిన వివరణ సరిగ్గా అధిష్టానాన్నిసంతృప్తిపరిచే విధంగా లేదని విషయాన్ని గ్రహించలేకపోతున్నారు.

Tags

Related News

వారసత్వం కొనసాగిస్తున్న రాధా! నిలకడలేని రాజకీయమే రాధకు మైనస్‌.. తండ్రి నేపథ్యం, సామాజికవర్గమే కొండంత బలం…!

రహస్య మిత్రుల మధ్య గ్యాప్‌ పెంచిన బాబు! ఎస్‌ఐఆర్‌పై జగన్‌ నిరసన గళం.. సీఈసీ నియామకం సరికాదని పశ్చాత్తాపం…

బతుకమ్మ కుంటకు జీవం పోసిన సీఎం.. సిటీ జనం చిరస్థాయిగా రేవంత్‌ను గుర్తు పెట్టుకునేలా! ఆంక్షలు చేధించుకుని మరీ ఈసారి ఘనంగా సద్దుల బతుకమ్మ!

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

ఎల్‌నినో ఎఫెక్ట్.. ఉచిత చేపపిల్లల పంపిణీకి కొత్త కష్టాలు.. చనిపోలాల్సిందేనా..?

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఇద్దరూ పోటీ..! మహేశ్‌కు వరించిన అధ్యక్ష పీఠం..! లేటుగానైనా జాతీయ స్థాయి కీలక పదవిలో యాష్కీ!

కాంగ్రెస్‌..కోదండరాం మంత్రం! ఆయనే ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రం..? రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు!

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

Big Stories

Advertisement
×