E-Paper
Advertisement

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?
Advertisement

WhatsApp Bill Payments: రోజూ ఉదయం లేవగానే నోటిఫికేషన్లు చూసుకోవడానికి వాట్సప్ ఓపెన్ చేయడం మనందరికీ అలవాటే. అయితే ఇకపై కేవలం మెసేజ్‌లు, ఫొటోలు పంపుకోవడానికే కాకుండా.. నెలవారీ బిల్లులు కట్టడానికి కూడా వాట్సప్‌నే వాడేయవచ్చు. భారత్ కనెక్ట్ (BBPS) నెట్‌వర్క్ సహకారంతో వాట్సప్ భారత్‌లో సరికొత్త ‘బిల్ పేమెంట్స్’ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇకపై ప్రైవేట్ యాప్స్ వెతుక్కునే పనిలేకుండా మనకిష్టమైన చాటింగ్ యాప్‌లోనే అన్ని పనులూ పూర్తి చేసుకోవచ్చు.

ఏమేం బిల్లులు కట్టొచ్చు?

కరెంట్ బిల్లు, మంచినీటి పన్ను, గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ మాత్రమే కాదు.. FASTag రీఛార్జ్, క్రెడిట్ కార్డ్ బిల్లులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, లోన్ ఈఎంఐల వరకు అన్నీ ఇక్కడే చెల్లించవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే.. దాదాపు 30 రకాల కేటగిరీల్లో 22,700కి పైగా సర్వీస్ ప్రొవైడర్లు ఇందులో అందుబాటులో ఉన్నారు. మన ఇల్లు, ఆఫీస్ లేదా కుటుంబ సభ్యుల బిల్లులను కూడా ఒక్కచోట నుంచే సులభంగా నిర్వహించుకునే వెసులుబాటు ఇందులో ఉంది.

Advertisement

Also Read: రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

పేమెంట్ ఎలా చేయాలి?

ఈ ఫీచర్ వాడటం చాలా తేలిక. వాట్సప్ ఓపెన్ చేసి, పైన కనిపించే ₹ (పేమెంట్స్) ఐకాన్‌పై టాప్ చేయాలి. అక్కడ మీకు కావాల్సిన బిల్లు రకాన్ని, సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంచుకుని మీ కస్టమర్ ఐడీ ఎంటర్ చేస్తే చాలు. సిస్టమ్ ఆటోమేటిక్‌గా మీ బిల్లు వివరాలను స్క్రీన్ పై చూపిస్తుంది. సమాచారం కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకుని యూపీఐ, డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా నిమిషాల్లో చెల్లింపు పూర్తి చేయవచ్చు.

ప్రత్యేకతలేంటి?

Advertisement

మీరు ప్రతిసారీ వివరాలు ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా.. పాత బిల్లుల హిస్టరీ ఆధారంగా తదుపరి రాబోయే బిల్లుల వివరాలను వాట్సప్ హోమ్ స్క్రీన్‌పైనే గుర్తుచేస్తుంది. తరచుగా వాడే కేటగిరీలు ముందు వరుసలో కనిపిస్తాయి. మిగతావి See All అనే ఆప్షన్ ద్వారా చూసుకోవచ్చు. ఇది మీ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా.. బిల్లుల గడువు తేదీలను మర్చిపోకుండా నివారిస్తుంది.

ఒక్క యాప్.. బోలెడు సేవలు:

ఇప్పటికే వాట్సప్ ద్వారా మెట్రో టికెట్లు బుక్ చేసుకోవడం, చాట్‌బాట్ల ద్వారా ప్రభుత్వ సేవలు పొందడం లాంటివి చేస్తున్నాం. ఇప్పుడు ఈ బిల్ పేమెంట్ ఫీచర్ కూడా తోడవడంతో ప్రతి చిన్న దానికి వేర్వేరు యాప్స్ డౌన్‌లోడ్ చేసుకునే అవసరం తప్పనుంది. ఈ అప్‌డేట్ ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు విడతల వారీగా అందుబాటులోకి వస్తోంది.

Also Read: పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Tags

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×