Duniya Vijay:సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ఒక హాట్ టాపిక్.. సెలబ్రిటీలు ఎప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటారు? ఎవరితో ప్రేమలో పడతారు ?ఎవరితో డేటింగ్ చేస్తారు ? ఇలా కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. మరి కొంతమంది వివాహం చేసుకొని ఏళ్ల తరబడి సంతోషంగా వైవాహిక జీవితంలో గడిపి.. పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఉన్న సమయంలో అనూహ్యంగా విడాకులు తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అయితే విడాకుల సమయంలో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వేరుపడిన భాగస్వాములు ఉంటే.. మరి కొంతమంది లైఫ్ టైం సెటిల్మెంట్ కోరుతున్న భాగస్వాములు కూడా లేకపోలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఎన్నో ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు ప్రకటించారు ప్రముఖ కన్నడ నటుడు దునియా విజయ్ (Duniya Vijay).
కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా , నిర్మాతగా కూడా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ఈయన.. తాజాగా తన వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. ఈ మేరకు తన భార్య నాగరత్న (Naga Ratna)తో విడాకులను కోరుతూ ఆశ్రయించగా.. ఈ జంటకు విడాకులు మంజూరు చేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న వీరి వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ తీసుకున్న నిర్ణయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.. అసలు వీళ్ళిద్దరూ ఇంత సడన్గా విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయంపై చర్చిస్తున్నారు.
ALSO READ:అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!
ఇకపోతే భర్త నుండి విడాకులు తీసుకున్న తర్వాత ఆయన భార్య నాగరత్న కోరిన భరణం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .ఆమె ఏకంగా రెండు కోట్ల రూపాయలు చెల్లించాలని.. అందులోనూ కేవలం రెండు నెలల్లోనే ఆ మొత్తం డబ్బును ఇవ్వాలి అని కోరిందట. ఇక నాగరత్న ఏకంగా 2 కోట్ల రూపాయల భరణం కోరడం.. పైగా దీనిని కోర్టు కూడా అంగీకరించడంతో ఒక సామాన్యుడికి లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే ఈ విషయంపై హైకోర్టు విజయ్ దునియా నాగరత్నకు భరణం కింద రెండు కోట్లు ఇవ్వాలని, ఆ మొత్తాన్ని రెండు నెలలలోగా చెల్లించాలని, గడువులోగా చెల్లించని పక్షంలో ప్రతి ఏటా 6% వడ్డీ వర్తిస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ముఖ్యంగా జస్టిస్ డీకే సింగ్, జస్టిస్ హెచ్ శాంతి భూషణ్ లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఆమె ప్రస్తుత పరిస్థితులు, ముగ్గురు పిల్లల భవిష్యత్తు, చిత్ర పరిశ్రమలో విజయ్ ఆర్థిక స్థితిగతులు హోదాను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు దుర్మాసనం స్పష్టం చేసింది.
కన్నడ సినీ పరిశ్రమలో తనకంటూ మంచి పేరు సొంతం చేసుకున్న ఈయన.. తొలిసారి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. 2007లో వచ్చిన దునియా అనే చిత్రంతో కన్నడలో స్టార్ హోదా అందుకున్నారు. ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో ఈయన కుమార్తె మోనిషా విజయ్ కుమార్ హీరోయిన్ గా సిటీ లైట్స్ అనే చిత్రం రాబోతోంది.
మరోవైపు దునియా విజయ్.. ఒక మాజీ ఐటీ ప్రొఫెషనల్, మోడల్ , హిందుస్తానీ గాయనిగా పేరు సొంతం చేసుకున్న కీర్తి పట్టాడీకి 2010లో పరిచయమయ్యారు. అయితే దునియా విజయ్ తన మొదటి భార్య నాగరత్నకు విడాకులు ఇవ్వకముందే 2016లో కీర్తిని వివాహం చేసుకున్నారు. గతంలో విజయ్ దునియా మొదటి భార్య నాగరత్నకు కీర్తి పట్టాడికి కుటుంబ విషయాలపై కొన్నిసార్లు బహిరంగ వివాదాలు, గొడవలు కూడా జరిగాయి.