BigTV English

Trainee IAS Officer Puja Khedkar: ఎవరీ పూజా ఖేద్కర్.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి..?

Trainee IAS Officer Puja Khedkar: ఎవరీ పూజా ఖేద్కర్.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి..?

The More Problems of Controversial IAS officer Puja Khedkar and her Family: పూజా ఖేద్కర్.. ఓ ప్రొబేషనరీ ఐఏఎస్.. కానీ చార్జ్‌ తీసుకున్న నెల రోజుల్లోనే ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది నేషన్‌గా మారింది. మోస్ట్ కాంట్రవర్షియల్‌ పర్సన్ ఇప్పుడు తను. కానీ.. ఇప్పుడు ఆమె పేరెంట్స్‌కు సంబంధించిన షాకింగ్ డిటెయిల్స్‌ తెరపైకి వచ్చాయి. పూజా మాత్రమే కాదు.. ఆమె పెరేంట్స్‌ చుట్టూ కూడా చాలా వివాదాలు చుట్టుముట్టి ఉన్నాయని తెలుస్తోంది. ఇంతకీ పూజా పెరేంట్స్ ఎవరు..? వారి బ్యాగ్రౌండ్ ఏంటి..? కారు అరెంజ్ చేయండి.. క్యాబిన్ సిద్ధం చేయండి. నేను వచ్చే వరకు మొత్తం రెడీ అయి పోవాలి. అంటూ జాబ్‌లో చార్జ్‌ తీసుకోకముందే హుకూం జారీ చేసి వివాదంలో చిక్కుకుంది పూజా ఖేద్కర్‌.. దీంతో ఎవరీ పూజా..? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి..? అనే క్వశ్చన్స్‌పై ఆరా తీయడం మొదలైంది. దీంతో పూజా మాత్రమే కాదు.. ఆమె పెరేంట్స్‌ కూడా చాలా వివాదాస్పద వ్యక్తులే అని తెలిపోయింది. కాదంటే ఈ వీడియో చూడండి..


ఈ వీడియోలో గన్‌తో నానా వీరంగం చేస్తున్న మహిళ మరేవరో కాదు. ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లి మనోరమా ఖేదర్కర్.. పూణేలోని ముల్షి తహసీల్‌లో ధద్వాలి విలేజ్‌లో ఓ స్థలానికి సంబంధించిన వివాదం ఉంది. ఖేద్కర్ ఫ్యామిలీ తమ భూమితో పాటు చుట్టుపక్కల ఉన్న ఇతర రైతుల భూములను కూడా ఆక్రమించుకన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించిన వీడియోనే ఇది. ఓ రైతుపై మనోరమా అరుస్తోంది.. ఫుల్ ఫ్రస్టేషన్‌లో ఏకంగా గన్‌ తీసి బెదిరిస్తోంది. ఈ వీడియోలో ఆమె వెనుక ప్రైవేట్ సెక్యూరిటీ కూడా కనిపిస్తోంది. భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారని తమ సెక్యూరిటీ సిబ్బందితో వచ్చి బెదిరించారంటూ స్థానిక రైతులు తెలుపుతున్నారు..

పూజా ఇష్యూ తర్వాత ఈ వీడియోలో నెట్టింట్లో వైరల్‌ కావడం మొదలైంది. అసలు మనోరమాకు గన్ ఎక్కడిది? ఆ గన్‌కు లైసెన్స్ ఉందా? లేదా? అనే క్వశ్చన్స్ రెయిజ్‌ అయ్యాయి. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు పూజా తల్లి మనోరమా, తండ్రి దిలీప్‌పై FIR నమోదు చేశారు. మొత్తం ఐదుగురిపై ఇప్పుడు కేసు నమోదైంది. సెక్షన్‌ 323, 504, 506తో పాటు ఆర్మ్స్‌ యాక్ట్‌ కింద బుక్ చేశారు. దీంతో ఇప్పుడు వారంతా చిక్కుల్లో పడ్డారు. నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన పోలీసులతో కూడా చాలా అనుచితంగా ప్రవర్తించారు మనోరమా.


Also Read: JC Pavan Reddy: జేసీ పవన్ కు.. ఇచ్చే పదవి ఇదేనా?

ఇది పూజా తల్లి మనోరమా స్టైల్.. ఇక తండ్రి దిలీఫ్‌ ఖేద్కర్ విషయానికి వద్దాం. ఆయన కూడా ఐఏఎస్ అధికారే.. తను సర్వీస్‌లో ఉన్నప్పుడు తోటి ఉద్యోగులతో అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాదు దిలీప్‌ మొన్నటి ఎలక్షన్స్‌లో లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఎన్నికల అఫిడవిట్‌లో ఆయకు 49 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు ప్రకటించారు. దీంతో సివిల్ సర్వీస్‌ ఉద్యోగికి అంత ఆస్తులు ఎలా వచ్చాయన్న దానిపై కూడా ఇప్పుడు చర్చ నడుస్తోంది..

సో నాట్ ఓన్లీ పూజా.. ఆమె తల్లిదండ్రులు కూడా మొదటి నుంచి కాస్త వివాదస్పద వ్యక్తులే అనేది దీన్ని బట్టి తేలిపోయింది. ఇక పూజా విషయానికి వద్దాం. ఇప్పుడు పూజా ఉద్యోగం ఉంటుందా? ఊడుతుందా? అనేది కూడా ఇప్పుడు డైలమాలో ఉంది. ఎందుకంటే పూజా నకిలీ ఓబీసీ కోటా సర్టిఫికేట్‌తో పాటు దివ్యాంగురాలినని తప్పుడు సర్టిఫికేట్స్ సృష్టించారన్న ఆరోపణలు వచ్చాయి. మెడికల్ టెస్ట్‌కు కూడా ఆరుసార్లు డుమ్మా కొట్టినట్టు తేలింది. చివరికి ఆరోసారి కూడా అన్ని టెస్టులు కంప్లీట్ చేయలేదని తేలింది. నిజానికి పూజా తన కళ్లకు సమస్య ఉందని తెలిపింది. అయితే దీనికి సంబంధించిన అత్యంత కీలకమైన స్కాన్‌కు అటెండ్ కాలేదు. కానీ అపాయింట్‌మెంట్‌ మాత్రం సాధించింది. ఆమె సెలక్షన్‌ను కమిషన్‌ ట్రైబ్యూనల్‌లో కూడా సవాల్ చేశారు. దీనిపై కూడా వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.
అయినా కూడా ఆమెకు అపాయింట్‌ వచ్చింది.

Also Read: ‘ప్రజల సంపూర్ణ మద్దతు ఇండియా కూటమికే’.. ఉపఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ..

ఇప్పుడీ విషయాలన్నింటిని తేల్చడానికి ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అధికారులు ఓ ప్యానల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్యానల్ రెండు వారాల్లో నివేదికను రెడీ చేయనుంది. అమె సబ్మిట్ చేసిన ప్రతి డాక్యుమెంట్‌ను, ప్రతి సర్టిఫికేట్‌ను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఇందులో ఏ ఒక్కటి తప్పనికానీ.. నకిలీది అని కానీ తేలిందంటే.. ఆమె ఉద్యోగం ఊడిపోయినట్టే.. ఇక్కడో విషయం గుర్తు పెట్టుకోవాలి. ఈ విషయాలన్నీ బయటికి రావడానికి కారణం ఏంటి? పూజా యాటిట్యూట్.. ఆ యాటిట్యూడే బాగుంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేదా? ఒక్కసారి ఆలోచించండి.

పూజా కనుక తనకు అపాయింట్‌మెంట్ ఆర్డర్ దక్కగానే.. ఓవరాక్షన్‌ చేయకుండా సైలెంట్‌గా తన విధులకు హాజరయ్యుంటే పరిస్థితి ఎలా ఉండేది. ఈ రోజు తన పని తాను చేసుకునేది. తన తల్లి, తండ్రి ఏ టెన్షన్ లేకుండా ఉండేవారు. కేసుల బాధ ఉండేది కాదు.. విచారణల పరేషాన్‌ ఉండేది కాదు. కానీ చేసిన తప్పులు ఊరికే ఉండవు కదా.. వారి పాపం పండింది.. ఇప్పుడు బజారున పడింది. ఉద్యోగం ఊడే పరిస్థితి వచ్చింది.. తల్లిదండ్రులు జైలుకు వెళ్లకా తప్పడం లేదు.

Tags

Related News

Yellandu Politics: ఇల్లందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ పెత్తనంపై వ్యతిరేకత..

Congress: కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య గ్యాప్ వచ్చిందా..?

Srikakulam Politics: దువ్వాడ కుల రాజకీయం

KCR: కేటీఆర్ కామెంట్స్.. బీఆర్ఎస్ ఫ్యూచర్ ఏంటో?

BC Reservations: స్థానిక సంస్థల ఎన్నికలు.. కాంగ్రెస్‌లో కొత్త టెన్షన్..

Bigg Boss AgniPariksha E3 Promo1: ఎమోషన్స్ తో చంపేస్తున్న సామాన్యులు.. వర్కౌట్ అవుతుందా?

Big Stories

×