E-Paper
Advertisement

Rahul Gandhi on By Poll Elections: ‘ప్రజల సంపూర్ణ మద్దతు ఇండియా కూటమికే’.. ఉపఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ..!

Rahul Gandhi on By Poll Elections: ‘ప్రజల సంపూర్ణ మద్దతు ఇండియా కూటమికే’.. ఉపఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ..!
Advertisement

Rahul Gandhi on By Poll Elections: ఇటీవల ఏడు రాష్ట్రాల్లో జరిగిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికల్లో ఇండియా కూటమి 10 స్థానాల్లో విజయం సాధించింది. ఉపఎన్నికల ఫలితాలపై శనివారం రాత్రి రాహుల్ గాంధీ స్పందించారు.

”బిజేపీ దేశంలో భయం అనే వలను పన్నింది. ఆ వలను దేశ ప్రజలు తెంచివేశారు. ఈ ఎన్నికల ఫలితాలతో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలోని రైతులు, యువత, లేబర్, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు.. ఇలా అందరూ నియంతృత్వాన్ని నాశనం చేసి.. న్యాయ పాలనకు ఓటు వేశారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు, తమ జీవితాలలో అభివద్ధి కోరుకుంటున్న ప్రజలు తమ మద్దతుని సంపూర్ణంగా ఇండియా కూటమికే తెలిపారు.” అని రాహుల్ గాంధీ ట్విట్టర్ ఎక్స్ లో పోస్టు చేశారు.

Advertisement

శనివారం విడుదలైన అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాల్లో ఉత్తరాఖండ్‌లో రెండు సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. మంగ్ లౌర్ సీటుపై బిఎస్పీ అభ్యర్థిని కాంగ్రెస్ అభ్యర్థి ఓడించారు. బద్రీనాథ్ నియోజకవర్గంలో బిజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి అతి తక్కువ ఓట్లతో విజయం సాధించారు. ఓటమిపాలైంది. ఉత్తరాఖండ్ లో బిజేపీ అధికారంలో ఉంది.

Also Read: నా భర్తపై గవర్నర్ కొడుకు దాడి చేశాడు.. ఒడిశా రాజ్ భవన్‌ సిబ్బంది భార్య

Advertisement

కాంగ్రెస్ కు చెందిన మొహమ్మద్ నిజాముద్దీన్ వరుసగా నాలుగుసార్లు బద్రీనాథ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఈసారి జరిగిన ఉపఎన్నికల్లో బిజేపీకి చెందిన కర్తార్ సింగ్ భదానిని నిజాముద్దీన్ కేవలం 422 ఓట్లతో ఓడించడం విశేషం.

Related News

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

Big Stories

Advertisement
×