BigTV English

‘The Goat Life’ OTT Release Date: పృథ్విరాజ్ సుకుమారన్ అద్భుత నటనారూపం ‘ది గోట్ లైఫ్’.. త్వరలోనే ఓటీటీలో…

భారతీయ చిత్రాలలో అరుదైన సినిమా గుర్తింపు పొందిన ‘ది గోట్ లైఫ్’ త్వరలోనే ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ అద్భుత నటనకు ప్రేక్షకులు, సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు కూడా వచ్చాయి. ‘ది గోట్ లైఫ్’ ఓటీటీ రిలీజ్ హక్కులని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

‘The Goat Life’ OTT Release Date: పృథ్విరాజ్ సుకుమారన్ అద్భుత నటనారూపం ‘ది గోట్ లైఫ్’.. త్వరలోనే ఓటీటీలో…

‘The Goat Life’ OTT Release Date: భారతీయ చిత్రాలలో అరుదైన సినిమా గుర్తింపు పొందిన ‘ది గోట్ లైఫ్’ త్వరలోనే ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ అద్భుత నటనకు ప్రేక్షకులు, సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు కూడా వచ్చాయి. ‘ది గోట్ లైఫ్’ ఓటీటీ రిలీజ్ హక్కులని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.


‘ది గోట్ లైఫ్’ గురించి మరో విశేషమేమిటంటే.. ఈ సినిమా పూర్తి చేయడానికి 16 ఏళ్ల సుదీర్ఘ సమయం పట్టింది. మార్చి 28, 2024న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదలైంది. ఆ సమయంలో ఎన్నో కమర్షియల్ చిత్రాలు థియేటర్లలో పోటీ ఉన్నా.. ‘ది గోట్ లైఫ్’ని ప్రేక్షకులు ఆదరించారు. ఈ చిత్రం అన్ని భాషలలో కలిపి 150 కోట్ల వసూళ్లు సాధించింది.

పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన ‘ది గోట్ లైఫ్’ చిత్రం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో జూలై 19న విడుదల కానుంది. ఈ చిత్రం మలయాళం, తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి నెట్ ఫ్లిక్స్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ఇన్స్‌టాగ్రామ్ లో ప్రకటించింది.


Also Read: ఓటీటీలోకి భారతీయుడు ఎంట్రీ, షాక్‌లో ఆడియెన్స్..

మలయాళ నవల కథ ఆధారంగా ‘ది గోట్ లైఫ్’ చిత్రం
మలయాళంలో బెస్ట్ సెల్లింగ్ నవల ‘ఆడుజీవితం’ ఆధారంగా ‘ది గోట్ లైఫ్’ సినిమా రూపొందించారు. ‘ఆడుజీవితం’ నవల.. విదేశీ భాషలతో సహా మొత్తం 12 భాషల్లో అనువదించబడింది. ప్రముఖ మలయాళ రచయిత బెంజమిన్ ఈ నవలకు రచయిత. ‘ది గోట్ లైఫ్’ చిత్రానికి మలయాళ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వహించారు.

1990వ దశకంలో కేరళలో సామాన్య కుటుంబానికి చెందిన నజీబ్ అనే వ్యక్తి బతుకుతెరుకు కోసం మంచి ఉద్యోగం పొందడానికి గల్ఫ్ దేశం వెళతాడు. కానీ అక్కడ వెళ్లాక అతడు బానిస జీవితం గడపాల్సి వస్తుంది. ఏళ్ల తరబడి అతను అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్సిస్తూనే ఉంటాడు. నజీబ్ తిరిగి ఇంటికి చేరుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ. నజీబ్ గల్ఫ్ దేశంలోని ఎడారి ప్రాంతంలో ఒక గొర్రెల కాపరిగా జీవించాల్సి వస్తుంది. ‘ది గోట్ లైఫ్’ సినిమాలో నజీబ్ పాత్రను ప్రముఖ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ అద్భుతంగా పోషించాడు. తన నటనలో ప్రేక్షకులను కట్టిపడేశాడు పృథ్విరాజ్.

Also Read: మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిన జానూ, వైరల్ వీడియో

‘ది గోట్ లైఫ్’ సినిమాలో ప్రధాన పాత్రలో పృథ్విరాజ్ సుకుమారన్ నటించగా, అమలా పాల్, కేఆర్ గోకుల్, హాలీవుడ్ నటుడు జిమ్మీ లూయిస్, అరబ్ నటుడు తాలిబ్ అల్ బలూషీ, రిక్ ఏబీ నటించారు. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందించడం మరో విశేషం.

‘ది గోట్ లైఫ్’ తరువాత పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన సలార్ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ తరువాత ఆయన విలన్ గా నటించిన హిందీ చిత్రం బడే మియా ఛోటే మియా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

Tags

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×